సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి శౌర్య పతకానికి పోలీసు శాఖ నుంచి 13 మంది ఎంపికయ్యారు. కె.శివప్రసాద్(ఎస్‌ఐ, వెంకటాపురం, ఖమ్మం జిల్లా) కామరాజు(ఆర్‌ఎస్‌ఐ, ఖమ్మం) నోముల వెంకటేష్(ఎస్‌ఐ, కోహిర్, మెదక్ జిల్లా), పి.భాస్కర్(హెచ్‌సీ, ఇంటెలిజెన్స్), సక్రా నాయక్ గుగులోత్(ఏఏసీ, గ్రేహౌండ్స్), గోపి నరేంద్రప్రసాద్(ఏఏసీ, గ్రేహౌండ్స్) ఎ.భాస్కర్(ఏఏసీ, గ్రేహౌండ్స్)తోపాటు గ్రేహౌండ్స్‌లో జాయింట్ కమాండర్లు వీరస్వామి సోలం, సీహెచ్ శ్యాంబాబు, డి.శేఖర్, కూన రాము, కె చంద్రశేఖర్, కె.రాజ్‌కుమార్ ముఖ్యమంత్రి శౌర్యపతకానికి ఎంపికయ్యారు.
పోలీసు కఠిన సేవా పతకానికి 30 మంది, పోలీసు ఉత్తమ సేవా పతకానికి 38 మంది, పోలీసు సేవా పతకానికి 142 మంది ఎంపికయ్యారు. అగ్నిమాపక, అత్యవసర సర్వీసుల శాఖలో ఉత్తమ సేవా పతకానికి నలుగురు, సేవా పతకానికి 25 మంది ఎంపికయ్యారు. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో మహోన్నత సేవా పతకానికి అదనపు ఎస్పీ కె.మహేంద్రపాత్రుడు, ఉత్తమ సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 10 మంది ఎంపికయ్యారు. రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్)లో ఉత్తమ సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 13 మంది ఎంపికయ్యారు.
పోలీసు పతకాలు పొందిన వారు
షేక్ సిరాజుద్దీన్ (డీఐజీ, ఏపీఎస్పీ), ఉక్కలం రామ్మోహన్ (అదనపు ఎస్పీ, సైబర్ క్రైం), మహ్మద్ తహరాలి (ఏసీపీ, ఫలక్‌నుమా), జె.కోటేశ్వరరావు (అసిస్టెంట్ డెరైక్టర్, అప్పా), సి.సన్నీ (అదనపు ఎస్పీ, ఆక్టోపస్), ఎస్.సయ్యద్‌భాషా (సీఎస్‌వో, డీజీపీ కార్యాలయం), ఎస్.ఎం.రత్న (డీఎస్పీ, సీఐడీ), టి.శంకరరెడ్డి (ఏసీపీ, హైదరాబాద్), జె.భాస్కరరెడ్డి (డీఎస్పీ, నెల్లూరు రేంజ్), జి.నరసింహారెడ్డి (డీఎస్పీ, సీఐ సెల్), కె.ఆనందరెడ్డి (సీఐ, ఎస్‌ఐబీ), వై.రామకృష్ణ (సీఐ, జీకే వీధి, విశాఖ జిల్లా), సీహెచ్‌ఆర్వీ ఫణిధర్ (ఇన్‌స్పెక్టర్, సీఐ సెల్), కె.రవీందర్‌రెడ్డి (ఇన్‌స్పెక్టర్, సీఐ సెల్) జి.గోవిందరావు (ఎస్‌ఐ, కోటఊరుట్ల, విశాఖ జిల్లా), పి.రమేష్ (ఎస్‌ఐ, నాథవరం, విశాఖ జిల్లా), కె.నాగరాజు (ఎస్‌ఐ, ఖమ్మం రూరల్), పి.నరసింహారెడ్డి (సీకే దిన్నె, వైఎస్‌ఆర్ జిల్లా), కె.చంద్రశేఖర్ (ఆర్‌ఎస్‌ఐ, ఎస్‌ఐబీ, హైదరాబాద్), పి.జితేందర్‌ప్రసాద్ (ఎస్‌ఐ, ఇంటెలిజెన్స్), ఐ.ఆర్.చంద్రశేఖరరావు (ఏఆర్‌ఎస్‌ఐ, ఎస్‌ఐబీ), ఎం.నరసింగరావు (ఏఎస్‌ఐ, సీఐ సెల్), ఎం.వెంకటేశ్వరరావు (హెచ్‌సీ, ఎస్‌ఐబీ), సయ్యద్ అఖీల్(హెచ్‌సీ, సీఐ సెల్), సి.వెంకటరమణ (సీనియర్ కమాండో, గ్రేహౌండ్స్) ఎం.తిరుపతిరావు (ఏఆర్‌హెచ్‌సీ, విశాఖ జిల్లా), శీను చింతా (సీనియర్ కమాండో, గ్రేహౌండ్స్) జి.కోదండ (హెచ్‌సీ, ఎస్‌ఐబీ), ఖాజా మొహినుద్దీన్ (హెచ్‌సీ, సీఐ సెల్), మహ్మద్ ముజీబ్ (హెచ్‌సీ, సీఐ సెల్), మహ్మద్ అక్తర్ పాషా(హెచ్‌సీ, సీఐ సెల్), బి.శ్రీనివాసరావు (జూనియర్ కమాండో, గ్రేహౌండ్స్), ఎస్.వి.భాస్కరరావు (ఏఆర్‌పీసీ, విశాఖ జిల్లా), కె.లక్ష్మీరమేష్ (జూనియర్ కమాండో, గ్రేహౌండ్స్).
అటవీ శాఖ నుంచి పతకాలు అందుకున్న వారు
ఎస్.మన్నయ్య (ఎఫ్‌ఆర్‌వో, ఆదిలాబాద్ జిల్లా), ఎం.జ్యోతి (ఎఫ్‌ఎస్‌వో, వాల్మీకిపురం, మదనపల్లి రేంజ్), ఎన్.బాలకృష్ణారెడ్డి (ఎఫ్‌ఎస్‌వో, శ్రీకాళహస్తి రేంజ్), విధి నిర్వహణలో మరణించిన ఆర్.గంగయ్య (కామారెడ్డి డివిజన్ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్) తరఫున ఆయన సతీమణి హేమలత.
13 మందికి సీఎం శౌర్య పతకాలు
Published Sat, Nov 2 2013 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement
Advertisement