ఐపీఎస్‌ల ఖాళీలు... 930 | 930 vacancies in Indian Police Service | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ల ఖాళీలు... 930

Jul 28 2014 1:52 PM | Updated on Sep 2 2017 11:01 AM

ఐపీఎస్‌ల ఖాళీలు... 930

ఐపీఎస్‌ల ఖాళీలు... 930

సివిల్స్ ఆశావహుల్లో ఐఏఎస్ తర్వాత ఎక్కువ మంది కోరుకునే ఐపీఎస్‌లో దేశవ్యాప్తంగా 930 ఖాళీలు ఉన్నాయి.

న్యూఢిల్లీ: సివిల్స్ ఆశావహుల్లో ఐఏఎస్ తర్వాత ఎక్కువ మంది కోరుకునే ఐపీఎస్‌లో దేశవ్యాప్తంగా 930 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు సంబంధించి 51 ఖాళీలు కూడా ఉన్నాయి. దేశం మొత్తం మీద 4,728 ఐపీఎస్ అధికారుల పోస్టులు ఉండగా, అందులో సీనియర్ అధికారులకు సంబంధించి 930 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

ఈ ఖాళీల్లో 105 ఉత్తరప్రదేశ్‌కు సంబంధించినవే. ఆ తర్వాత పశ్చిమబెంగాల్లో 96, ఒడిశాలో 83 ఖాళీలు ఉన్నాయి. ఐపీఎస్ అధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ దేశవ్యాప్తంగా వివిధ కేడర్లలో ఖాళీలు ఇంకా ఉంటున్నాయని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement