సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ ఆదే శాల ప్రకారం ఏటా రెండు విడతల్లో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్–8ని వచ్చే నెల 1 నుంచి ప్రారంభించనున్నట్టు మహి ళలు, చిన్నారుల భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా వెల్లడించారు. జూలై 1 నుంచి నెల పాటు జరిగే ముస్కాన్ కార్యక్రమంలో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులను, ట్రాఫికింగ్ ద్వారా వివిధ వ్యవస్థల్లో బందీలైన వారిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చనున్నారు. అలాగే తల్లిదండ్రులు లేని చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు తరలించి వారి బాధ్యతలను సంబంధిత విభాగాలకు అప్పగించనున్నారు.
ఈ ఆపరేషన్‌పై మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ విభాగం, కార్మిక శాఖ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, సర్వశిక్షా అభియాన్, యూనిసెఫ్ విభాగాలతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించినట్టు స్వాతిలక్రా తెలిపారు. ఈ సమా వేశంలో మహిళాభివృద్ధి, చిన్నారుల సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక క్యార్యదర్శి డి.దివ్య, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్, కుటుంబ సంక్షేమ శాఖ, శిశు ఆరోగ్య విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర, సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ పాల్గొన్నారు. (క్లిక్: 38 మంది ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్)
Comments
Please login to add a commentAdd a comment