sumati
-
జూలై 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్–8
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ ఆదే శాల ప్రకారం ఏటా రెండు విడతల్లో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్–8ని వచ్చే నెల 1 నుంచి ప్రారంభించనున్నట్టు మహి ళలు, చిన్నారుల భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా వెల్లడించారు. జూలై 1 నుంచి నెల పాటు జరిగే ముస్కాన్ కార్యక్రమంలో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులను, ట్రాఫికింగ్ ద్వారా వివిధ వ్యవస్థల్లో బందీలైన వారిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చనున్నారు. అలాగే తల్లిదండ్రులు లేని చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు తరలించి వారి బాధ్యతలను సంబంధిత విభాగాలకు అప్పగించనున్నారు. ఈ ఆపరేషన్‌పై మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ విభాగం, కార్మిక శాఖ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, సర్వశిక్షా అభియాన్, యూనిసెఫ్ విభాగాలతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించినట్టు స్వాతిలక్రా తెలిపారు. ఈ సమా వేశంలో మహిళాభివృద్ధి, చిన్నారుల సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక క్యార్యదర్శి డి.దివ్య, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్, కుటుంబ సంక్షేమ శాఖ, శిశు ఆరోగ్య విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర, సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ పాల్గొన్నారు. (క్లిక్: 38 మంది ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్) -
SHE Teams: ఏడేళ్లుగా ‘ఆమె’కు నిరంతరం రక్షణగా..
సంతోషకరమైన జీవనం వైపుగా అడుగులు వేయడానికి భద్రమైన మార్గంలో పయనించడానికి సమాజం మనందరికీ చేదోడు వాదోడుగా నిలుస్తుంది. కానీ, ఈ సమాజంలో మహిళ రక్షణ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటోంది. దీనికి సమాధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది ‘షీ టీమ్’. ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యక్రమాల్లో భాగంగా స్త్రీల రక్షణ కోసం 24 గంటలూ పనిచేస్తూ మహిళా నేస్తంగా మారిన ‘షీ టీమ్’ సేవలకు ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో మహిళల భద్రత ఏవిధంగా ఉంది? పెరుగుతున్న నేరాలు, మారుతున్న విధానాలు తీసుకుంటున్న చర్యల గురించి పూర్తి సమాచారంతో మన ముందుంచింది తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్. వేధింపులకు చెక్‌పెట్టడమే లక్ష్యం – స్వాతి లక్రా ► తెలంగాణలో ‘షీ టీమ్’ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఫలితాలను చూసినప్పుడు మీకేమనిపించింది? ‘షీ టీమ్’ గురించి 90 శాతం ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇదే విషయం మీద సర్వే చేశాం. దాంట్లో మంచి రేటింగ్ వచ్చింది. ప్రజలకు ‘షీ టీమ్’ సేవలు బాగా నచ్చాయి. మంచి ఫలితాలు వచ్చాయి. ప్రతి యేటా 5 వేలకు పైగా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మహిళల రక్షణ, వారి భద్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఉండాలనుకుని ప్రభుత్వం అక్టోబర్ 24, 2014లో హైదరాబాద్‌లో షీ టీమ్‌ను ప్రారంభించింది. ఏప్రిల్, 2015లో తెలంగాణ మొత్తంగా షీ టీమ్ సేవలను విస్తృతం చేసింది. ► ఇన్నేళ్లుగా వచ్చిన మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇటీవల మహిళలపై నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎలాంటివి? గతంలో భౌతిక దాడులు, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్‌కు సంబంధించినవి మొదటి జాబితాలో ఉండేవి. దాదాపు వందలో 60 శాతం ఫోన్ వేధింపులు, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటున్నాయి. ఈ ఫిర్యాదుల్లో వాట్సప్ ద్వారా వచ్చేవి ఎక్కువ ఉండగా, డయల్ –100, ఫేస్బుక్, హ్యాక్ ఐ యాప్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ► సామాజిక మాధ్యమాల ద్వారా పెరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి తీసుకుంటున్న చర్యలు? మహిళలు చాలా మంది వేధింపుల బారిన పడుతున్నామని తెలిసినా ఫిర్యాదు చేయడానికి ఇంకా ముందుకు రావడం లేదు. ముందు వాళ్లలో చాలా మార్పు రావాలి. ఏ వేధింపులైనా వెంటనే మాకు తెలియజేయడం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుంది. ఉమన్ సేఫ్టీ వింగ్‌లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్‌కు సంబంధించి ‘షీ ల్యాబ్’ను కూడా ప్రారంభిస్తున్నాం. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ వేధింపులను సైబర్ నిపుణుల ద్వారా కనిపెట్టి, వీటికి అడ్డుకట్ట వేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచీ సైబర్ నేరస్తులు ఉంటున్నారు. ఇలాంటప్పుడు వారిని పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సాయమూ తీసుకుంటున్నాం. ఏఅగిఓ ఉ్గఉ మొబైల్ అప్లికేషన్ ఉంది. ఇది ఇప్పటికే 30 లక్షల మందికి పైగా రీచ్ అయ్యింది. మా వెబ్సైట్లో సోషల్‌మీడియాలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే విధానాలపై పూర్తి సమాచారం ఉంచాం. వాటిని చదివి తెలుసుకోవచ్చు. ‘షీ టీమ్’ సమావేశం అనంతరం సభ్యులతో స్వాతి లక్రా ► షీ టీమ్‌లో మహిళా భద్రత కోసం ఎంత మంది వర్క్ చేస్తుంటారు? 33 శాతం మహిళలకు రిజర్వేషన్ వచ్చాక మహిళలు అధిక సంఖ్యలో పోలీసు విభాగంలోకి వస్తున్నారు. కానీ, ఇంకా తక్కువమంది మహిళా పోలీసులు ఈ విభాగంలో ఉండటం ఆలోచించ వలసిన విషయం. షీ టీమ్ బృందాలుగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తారు. ఒక బృందంలో 5 గురు సభ్యులు, ప్రతి బృందంలో తప్పనిసరిగా ఒక మహిళ ఉంటారు. వీళ్లు యూనిఫామ్‌లో కాకుండా సివిల్ డ్రెస్‌లో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులను నిర్వర్తిస్తుంటారు. ఇదే విధానం తెలంగాణ మొత్తం ఉంటుంది. సుశిక్షితులైన వారే ఈ టీమ్‌లో ఉంటారు. అలాగే, సమాజంలో మహిళల స్థానం పట్ల అవగాహన, వారి పట్ల నడుచుకునే విధానం, ఆపరేషన్ నైపుణ్యాలు, పద్ధతులు, సాంకేతిక నైపుణ్యం, న్యాయపరమైన, చట్టపరమైన నిబంధనల పట్ల పూర్తి సమాచారం కలిగి ఉంటారు. ► మన సమాజ మూలాల్లోనే కుటుంబాల్లోనూ అమ్మాయిల పట్ల ఒక వివక్ష ఉంది. షీ టీమ్ ఏర్పాటై ఇన్నేళ్ల తర్వాత ఈ విధానంలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? చాలా మార్పు వచ్చింది. వివక్ష లేకపోలేదు. కానీ, వివక్ష తీవ్రత తగ్గింది. 2016–17 సమయంలో అమ్మాయిలను వేధించేవారిలో చాలా మంది మైనర్ అబ్బాయిలను మేం పట్టుకున్నాం. వారికి కౌన్సెలింగ్ చేస్తూ వచ్చాం. దీంతో వారిలో మార్పు తీసుకురావడానికి జూనియర్, డిగ్రీ స్థాయి కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రోగ్రామ్‌లు చేశాం. ఇప్పుడు సర్వే చేస్తే మైనర్ అబ్బాయిలు వేధింపులకు పాల్పడటం లేదని తెలిసింది. అవగాహన కావచ్చు. కౌన్సెలింగ్ కావచ్చు. అన్నీ దోహదం చేస్తున్నాయి. కాలేజీల్లో అబ్బాయిలు కూడా షీ టీమ్ కార్యక్రమాల సమయంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకువస్తున్నాయి. అమ్మాయిలను ఎలా చూడాలనే ఆలోచనల్లో మార్పు రావడానికి మేం చేస్తున్న కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయి. ఇళ్లలో చూస్తే ఈ మార్పు చాలా నెమ్మదిగా ఉంది. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే.. బధిరులను వేధించడం, వారిపై లైంగిక దాడులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. బధిరుల పట్ల ఎలా నడుచుకోవాలనే విషయాల పట్ల కుటుంబాల నుంచే అబ్బాయిల్లో అవగాహన పెంచితే మరింత బాగుంటుంది. ► ఇటీవల చిన్నపిల్లలపై లైంగిక దాడుల సంఘటనలు ఎక్కువ వింటున్నాం. తెలిసినవారే నిందితులుగా ఉంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజమే, పిల్లలపై దాడులు చేసేవారు 90 శాతం కంటే ఎక్కువ ఆ కుటుంబాలకు తెలిసినవారే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కుటుంబాల నుంచి ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఉండే ‘అంకుల్స్’ వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. పిల్లలపై లైంగిక దాడి జరిగిందని తెలిసినప్పుడు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి. ఆ నేరాన్ని దాచిపెట్టాలని చూసినా అది నేరమే. ఈ విషయాలు పిల్లలకు కూడా తెలియాలని పాఠశాలల్లో ‘సేఫ్–అన్ సేఫ్ టచ్’ పట్ల అవగాహన కల్పిస్తున్నాం. సమస్య తెలిసినప్పుడు టీచర్లు కూడా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత గురించి తెలియజేస్తున్నాం. ► మహిళకు సమస్య వచ్చి, మిమ్మల్ని కలిసిన తర్వాత ఆమె జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? బాధితుల్లో ఎలాంటి అండ లేనివారికి ప్రభుత్వం నుంచి పరిహారం ఉంటుంది. వారు నిలదొక్కుకోవడానికి చదువు, జీవననైపుణ్యాలను కల్పించేందుకు తగిన శిక్షణ కూడా ఉంటుంది. ► చాలా వరకు మహిళా బాధితుల్లో ఇప్పటికీ పోలీసు స్టేషన్‌కి రావాలంటే ఒక తెలియని సందిగ్ధత ఉంటుంది. షీ టీమ్ వచ్చాక ఈ విధానంలో మార్పు వచ్చిందంటారా? గత పోలీసు స్టేషన్లు, నేటి పోలీసు స్టేషన్లను చూస్తే ఆ తేడా మీకే అర్థమవుతుంది. ఒక మంచి వాతావరణంలో మా సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా లింగసమానతలు, సున్నితమైన విషయాల గురించిన అవగాహనతో పనిచేస్తున్నారు. ఒక మహిళ పోలీస్ స్టేషన్‌కు వస్తే ఆమెతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనే విషయాల పట్ల మార్పు వచ్చింది. అలాగే, ప్రతీ పోలీసు స్టేషన్ రిసెప్షన్లో ఒక మహిళ ఉంటుంది. దీని వల్ల మంచి మార్పుతోపాటు గతంలో ఉన్న సందిగ్ధతలు చాలా వరకు తగ్గాయి. ఒక మహిళ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే, మేం వారిని నేరుగా సంప్రదించి వివరాలన్నీ తీసుకుంటున్నాం. అంటే, మహిళ పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఆమెకు న్యాయం జరిగేలా చూస్తున్నాం. ► ఇతర రాష్ట్రాల్లో ‘షీ టీమ్’ లాంటి మహిళా రక్షణ కోసం చేస్తున్నæ విభాగాలున్నాయా? మనం వారి నుంచి స్ఫూర్తి పొందినవి ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. మన సెంటర్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం నుంచి వచ్చి చూస్తుంటారు. మేం కూడా మహిళా రక్షణలో ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుంటుంటాం. ఇది రెండువైపులా ఉంటుంది. ► ఇక్కడి మహిళలు వేరే దేశాల్లో వేధింపులకు గురైన సందర్భాల్లో వచ్చిన ఫిర్యాదులు.. ఈ విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఉమెన్ సేఫ్టీ వింగ్లోనే ‘ఎన్ఆర్ఐ సెల్’ కూడా ఏర్పాటు చేశాం. ఎన్ఆర్ఐ లను పెళ్లి చేసుకున్న మహిళలు విదేశాలకు వెళ్లిన తర్వాత వారిని వదిలేయడం, అదనపు కట్నం కోసం వేధించడం వంటి సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి వారి కోసం ఒక టీమ్ పని చేస్తుంది. లాయర్ ద్వారా, స్వచ్ఛంద సంస్థల నుంచి, ఎంబసీస్, విదేశీ మంత్రిత్వ శాఖ, ఆర్పీఓ .. అందరినీ సంప్రదించి ఆ సదరు మహిళకు ఎలా సాయం అందించాలో చూస్తున్నాం. కొన్ని విషయాల్లో టైమ్ పడుతుంది కానీ, మంచి ఫలితాలు వస్తున్నాయి. ► మహిళా రక్షణ విషయంలో ఇప్పటి వరకు ఉన్న చట్టాలు సరిపోతాయా? అదనంగా కొత్త చట్టాలను చేర్చాల్సిన అవసరం ఉందా? చట్టాలు చాలా ఉన్నాయి. వాటిని అమల్లో పెట్టడం ముఖ్యం. ఈ విషయంపైనే మేం దృష్టి పెడుతున్నాం. విచారణ త్వరగా పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ ఫైల్ చేశాక త్వరగా బాధితులకు న్యాయం జరగాలి.. ఈ విధానంలోనే మేం పనిచేస్తున్నాం. ► సమాజంలో చోటు చేసుకోవాలనుకుంటున్న మార్పుల గురించి? దేశవ్యాప్తంగా పోలీసు విభాగంలో మహిళల సంఖ్య తక్కువే ఉంది. ఇప్పుడిప్పుడే మహిళా పోలీసుల సంఖ్య పెరుగుతోంది. మన సమాజంలో 50 శాతం మహిళలు ఉంటే అంత శాతం పోలీసు విభాగంలోనూ ఉండాలి. దీనివల్ల సమాజంలో ఉన్న మహిళలకు మరింత మేలు జరుగుతుంది. ఏ సమయంలోనైనా మహిళ ధైర్యంగా తన పనుల నిమిత్తం వెళ్లగలిగే పరిస్థితి రావాలనుకుంటున్నాను. ఆ రోజు తప్పక వస్తుంది అన్న నమ్మకమూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘షీ టీమ్’, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జ్, అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డిఐజీ సుమతి ఇంటర్వ్యూలతో షీ టీమ్ గురించిన సమగ్ర సమాచారం. ఎంబీయే చేస్తున్న నాకు మా కాలేజీలో చదువుతున్న సురేష్ (పేరు మార్చడమైనది) ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. ఏడాదిగా బాగానే ఉన్న సురేష్ అనుమానంతో విసిగిస్తుండటంతో భరించలేక బ్రేకప్ చెప్పేశాను. ఆనాటి నుంచి తన దగ్గరున్న ఫొటోలతో నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. నా ఫోన్లో ఉన్న మా బంధుమిత్రుల నెంబర్లన్నీ ట్యాప్‌చేసి, తీసుకొని వారందరికీ మా ప్రేమ గురించి, ఫొటోల గురించి చెబుతానని బెదిరించేవాడు. ఇది నా భవిష్యత్తుకే ప్రమాదం అనుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ‘షీ టీమ్’ను వాట్సప్ నెంబర్ ద్వారా సంప్రదించాను. పోలీసులు సురేష్‌ను హెచ్చరించి, అతని వద్ద నాకు సంబంధించి ఉన్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయించారు. ఇక నుంచి ఎలాంటి వేధింపు చర్యలకు పాల్పడబోనని రాతపూర్వకంగా రాయించుకొని, అతని మీద నిఘా పెట్టారు. రెండు నెలలుగా ఈ సమస్యతో నరకం చూసిన నాకు, షీ టీమ్ ద్వారా ఒక్క రోజులోనే పరిష్కారం దొరికింది. ఇప్పుడు హాయిగా ఉన్నాను. – బాధితురాలు మా అమ్మాయి ఏడవ తరగతి చదువుతుంది. సెలవులకు మా అమ్మ వాళ్ల ఊరు వెళ్లింది. అదే ఊళ్లో ఉంటున్న తెలిసిన వ్యక్తే మా అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించడమే కాకుండా, ఫొటోలు, వీడియోలు తీసి మమ్మల్ని మానసికంగా వేధించేవాడు. భరించలేక షీ టీమ్‌ను ఫోన్ ద్వారా సంప్రదించాం. షీ టీమ్ సదరు వ్యక్తి నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సరైన విధంగా బుద్ధి చెప్పారు. ఏడాది నుంచి సమస్యేమీ లేకుండా మనశ్శాంతిగా ఉన్నాం. – మరో బాధితురాలి తల్లి అవగాహన తీసుకొస్తున్నాం– బి. సుమతి ► మహిళల వేధింపులకు సంబంధించి రోజూ ఎన్ని కేసులు ఫైల్ అవుతుంటాయి? రోజూ దాదాపు 20 నుంచి 25 కేసుల వరకు ఉంటాయి. వీటిలో లైంగిక వేధింపులు ఎక్కువ. స్నేహం, ప్రేమ పేరుతో దగ్గరయ్యి ఫొటోలు, వీడియోలు నలుగురిలో పెట్టి పరువు తీస్తామనే బెదిరింపులూ ఎక్కువే. పదేళ్ల లోపు చిన్నపిల్లలకు సంబంధించిన కేసులు కూడా ఉంటున్నాయి. వీటిలో తీవ్రత శాతాన్ని బట్టి మానిటరింగ్ ఉంటుంది. ప్రధానంగా నేరాల తీవ్రతను బట్టి ఒక షెడ్యూల్‌ను రూపొందించాం. పిల్లలు, మహిళలపై పబ్లిక్‌గా జరిగే దాడులు, లైంగిక హింస, మనుషుల అక్రమరవాణా, సైబర్‌క్రైమ్, గృహహింస ప్రధానమైనవి. ► షీ టీమ్ ఆధ్వర్యంలో పిల్లల భద్రత కోసం చేస్తున్న కార్యక్రమాలు గురించి? చిన్న పిల్లల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్రస్థాయిలో స్కూళ్లను ఎంచుకున్నాం. షీ టీమ్, సైబర్ నిపుణులు, స్వచ్ఛంధ సంస్థ భాగస్వామ్యంతో ఇప్పటికి 1650 స్కూళ్లలో ‘సైబర్ కాంగ్రెస్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులు పాల్గొనేలా చూస్తున్నాం. ► టీనేజర్లు, యువతలో మహిళల భద్రతకు సంబంధించి చేస్తున్న కార్యక్రమాలు? యువతలో 19 నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలపై వేధింపులు ఎక్కువున్నాయి. అందుకని, కాలేజీల్లో ‘గర్ల్ సేఫ్టీ క్లబ్స్’ ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో 25 మంది విద్యార్థులను తీసుకుంటే సగం అమ్మాయిలు, సగం అబ్బాయిలు ఉండేలా చూస్తున్నాం. ఒక కాలేజీలో 25 మంది సేఫ్టీ క్లబ్‌గా ఉంటే వారి చుట్టుపక్కల, కాలేజీలో ఏదైనా సమస్య వస్తే ఎలా స్పందించాలి, అనే విషయాల పట్ల శిక్షణ ఇస్తాం. వాళ్లు పరిష్కరించలేని సమస్యలను మా దగ్గరకు తీసుకువచ్చేలా శిక్షణ ఇస్తున్నాం. ► ఆన్లైన్ మోసాలకు గురయ్యేవారిలో గృహిణులూ ఉంటున్నారు. వీరి రక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు? గృహిణులు సైబర్ మోసాల బారినపడకుండా, అవగాహన కల్పించేందుకు ‘సైభర్’ కార్యక్రమం రూపొందించాం. ఆన్లైన్ మాధ్యమంగానే చేసిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 50 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్లమ్స్‌లలో కూడా అక్కడి అమ్మాయిల భాగస్వామ్యంతో గృహిణుల రక్షణ కోసం అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాం. వీటి విస్తృతి పెంచేందుకు మరికొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ► గ్రామస్థాయిల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు, అవగాహన పెంచేందుకు చేస్తున్న కృషి? పట్టణ, గ్రామీణ స్థాయిలోనూ షీ టీమ్ ద్వారా నేరుగా దాదాపు 30 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్థానిక జానపద కళాకారులతో కలిసి గ్రామస్థాయిలో కార్యక్రమాలు చేశాం. వీటిని మరింతగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. షీ టీమ్ మీ కోసమే.. ► పబ్లిక్ ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (ఈవ్ టీజింగ్.. వంటివి) జరిగినా ► ఫోన్‌కాల్, మెసేజ్‌లు, ఇ–మెయిల్స్, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినా ► మహిళ ఒంటరిగా ప్రయాణించే సందర్భాలలో వెంటనే పోలీసు సాయం అందాలన్నా షీ టీమ్ వెంటనే స్పందిస్తుంది. ► మహిళలపై తీవ్రమైన నేరాలను అరికట్టడానికి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ► తప్పుదారి పట్టిన యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి నిపుణులచే కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పింస్తుంది. వారిని తమ నిఘానేత్రంతో నిశితంగా గమనింఇస్తుంది. ► మహిళకు హక్కుల పట్ల షీ టీమ్ వివిధ వేదికల ద్వారా అవగాహన కలిగిస్తుంది. భద్రత... సురక్షితం ► బృందాలుగా తెలంగాణ వ్యాప్తంగా ‘షీ టీమ్’ పనిచేస్తుంది. ప్రతి టీమ్‌లో ఒక మహిళా పోలీస్ అధికారి ఉంటారు. ► బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు–కాలేజీలు, లేడీస్ హాస్టల్స్, పార్కులు, ఆసుపత్రుల చుట్టుపక్కల ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి నిఘాను ఉంచుతుంది. ► చట్టం, న్యాయం, సాంకేతిక విషయాల్లో సుశిక్షితులైన వారు ఈ బృందంలో తమ విధులను నిర్వర్తిస్తుంటారు. ఎప్పటికప్పుడు షీ టీమ్‌కు నిఘా విభాగం నుంచి సమాచారం చేరుతూనే ఉంటుంది. ► మహిళలు ఆన్లైన్ వేదికల ద్వారా తమ ఫిర్యాదులను అందజేయవచ్చు. షీ టీమ్ బృందం సివిల్ డ్రెస్సులో బాధితులను నేరుగా కలిసి, తదుపరి విచారణ కొనసాగిస్తుంది. ► ఒకసారి ఒక వ్యక్తిపై మొదటిసారి నేరారోపణ వస్తే సుమోటోగా బుక్ చేసి, తగిన చర్యలు తీసుకుంటారు. అదే నేరసుడిపై మరోసారి ఫిర్యాదు వస్తే.. ఆ కేసును నిర్భయ యాక్ట్ కింద బుక్ చేసి, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకని, బాధితులు వెనుకంజ వేయకుండా తమ సమస్యను నివేదించి, సరైన పరిష్కారం పొందవచ్చు. ► సమాజంలో మహిళలకు సంబంధించిన సమస్యలను పరువుగా చూస్తారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ వివరాలు బయటకు వచ్చి, తమ కుటుంబ పరువు పోతుందేమో అని భయపడతారు. షీ టీమ్ లోబాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ నెంబర్, నేరుగా.. ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా, అత్యంత వేగంగా పరిష్కారం చూపుతారు. అందుకని మహిళలు తమను వేధించేవారిని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే వారికై వారుగా ముందుకు రావాలి. ► మహిళా రక్షణ కోసం షీ టీమ్ వివిధ వేదికల ద్వారా ప్రజలలో అవగాహన కలుగజేస్తుంది. ఆ కార్యక్రమాలలో పాల్గొని తమ అభిప్రాయాలనూ పంచుకోవచ్చు. ఫిర్యాదులకు వేదికలు తెలంగాణ మొత్తానికి మహిళకు రక్షణకవచంలా ఉంది షీ టీమ్. సమస్య వచ్చినప్పుడు సందేహించకుండా సత్వర పరిష్కారం కోసం సంప్రదించాల్సిన వేదికలు.. ఇన్స్టాగ్రామ్:telanganasheteams ఫేస్బుక్, ట్విటర్:@ts-womensafety మెయిల్: womensafety-ts@tspolice.gov.in య్యూట్యూబ్: Women Safety Wing Telangana Police వాట్సప్ నెం. 944 166 9988 క్యూ ఆర్ కోడ్.. వంటి వేదికల ద్వారా ఫిర్యాదు చేయచ్చు. లైంగిక వేధింపులు, దాడులు, సైబర్ నేరాల నుంచి ‘ఆమె’ను రక్షించడానికి నిరంతరాయంగా కృషి చేస్తున్న షీ టీమ్‌కు ‘సాక్షి’ సెల్యూట్. – నిర్మలారెడ్డి, ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
చిన్నారి గర్భంలో పిండం
కలియుగ విచిత్రాల జాబితాలో మరొకటి చోటుచేసుకుంది. ఏడాది పాప గర్భంతో ఉన్న చిత్రమైన సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో వెలుగు చూసింది. కోయంబత్తూరు జిల్లా పులియంపట్టికి చెందిన రాజు, సుమతి దంపతులకు నిశా అనే ఏడాది పాప ఉంది. ఇటీవల పాప పొట్ట విపరీతంగా పెరిగిపోవడం ప్రారంభించింది. దీంతో భయాందోళనలకు లోనైన తల్లిదండ్రులు చికిత్స కోసం మేట్టుపాళయంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. పొట్టను స్కాన్ తీసి పరిశీలించిన వైద్యులు పాప కడుపులో ఒక బిడ్డ పెరుగుతున్నట్లు గుర్తించి బిత్తరపోయారు. అలాగే లివర్, పిత్తాశయం వేర్వేరు చోట్ల ఉండడాన్ని గమనించారు. ఆలస్యం చేస్తే బిడ్డ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని భావించిన వైద్యుల బృందం వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రెండుగంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. పాప కడుపులో నుంచి మూడు కిలోల పిండాన్ని తొలగించారు. ఆ పిండానికి అప్పటికే జుట్టు, కొన్ని ఎముకలు ఏర్పడి ఉన్నాయని డాక్టర్ విజయగిరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాప ఆరోగ్యంగా కోలుకుంటోందని తెలిపారు. పాప తల్లి గర్భవతిగా ఉన్నపుడు రెండు పిండాలు ఏర్పడి ఉంటాయని, వాటిల్లో ఒకటి ఈ పాపకాగా, మరో పిండం ఇదే పాప కడుపులోకి చేరి పెరగడం ప్రారంభించిందని తెలిపారు. పది లక్షల్లో ఒకటి ఇలాంటి కేసు ఉంటుందని చెప్పారు. -
అమ్మను కాలేనని..
మనోవేదనతో వివాహిత ఆత్మహత్య ఐదేళ్లుగా మొక్కని దేవుడు.. చేయని పూజలు లేవు.. బిడ్డల కోసం పరితపించింది. ఏడాది క్రితం గర్భం నిలిస్తే.. పొంగిపోయింది. కానీ ఐదునెలలకే అబార్షన్ కావడంతో కుంగిపోయింది. అప్పటి నుంచి తాను తల్లిని కాలేనని, గొడ్రాలుగానే ఉండిపోవాల్సి వస్తుందని తరచూ బాధపడేది. ఈ క్రమంలో.. జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చౌడేపల్లె: పిల్లలు పుట్టలేదని కలత చెంది వివాహిత బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చౌడేపల్లె మండలంలోని పుదిపట్ల పంచాయతీ మిట్టూరు గ్రామంలో సోమవారం వెలుగులోకివచ్చింది. మృతురా లి తండ్రి సుబ్రమణ్యం కథనం మేరకు గంగవరం మండలం పాతూరు గ్రామానికి చెందిన బి.సుబ్రమణ్యం కుమార్తె ఎం. సుమతి(30)ని చౌడేపల్లె మండలం మిట్టూరుకు చెందిన పాపన్న కుమారుడు లోకేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వివాహమై ఐదేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో సుమతి తీవ్రమనోవేదనకు గురైంది. ఈక్రమంలో ఏడాది క్రితం ఐదు నెల లు గర్భం నిలిచి ఆ తర్వాత అబార్షన్ అయ్యింది. గర్భసంచి చిన్నది కావడం వల్ల పిల్లలు పుట్టడం కష్టమని.. మందులు వాడమని డాక్టర్లు సలహా ఇచ్చారు. అయితే తనకు ఇకపై తనకు గర్భంరాదనే మనో వేదనతో తరచూ చనిపోతానని చెబుతుండేదని తండ్రి సుబ్రమణ్యం తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంటి వద్ద సుమతి కనిపించకుండా పోవడంతో చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయిందన్నారు. సోమవా రం గ్రామానికి సమీపంలో ఉన్న బావిలో సుమతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు సమాచారం అందుకొన్న ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతిరాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యువతి అనుమానాస్పద మృతి
శ్రీకాకుళం జిల్లా భామిని మండలం గణచర గ్రామానికి చెందిన సుమతి(20) అనే యువతి సోమవారం మధ్యాహ్నం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కాగా.. ఇదివరకే సుమతి తండ్రి మృతి చెందాడు. తల్లి అనారోగ్యంతో మంచానపడింది. సుమతి కూలిపనులు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. సోమవారం మధ్యాహ్నం సుమతి గ్రామ శివారులోని పౌరసరఫరాల శాఖ గోదాము సమీపంలో శవమై పడిఉండటాన్ని గ్రామస్తులు కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. భామిని పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి.. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ క్షణం ఆలోచిస్తే..
సంగారెడ్డి క్రైం : పిల్లలు పుట్టలేదని ఆత్మహత్య చేసుకుందో మహిళ.. ప్రేమ పెళ్లి కాదన్నం దుకు ప్రేమికుల ఆత్మహత్య.. ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని యువకుడి బలవన్మరణం.. టెన్త్, ఇంటర్ తప్పానని తనువు చాలించిన విద్యార్థి.. ఇలా జిల్లా లో ప్రతిరోజూ ఏదో ఒక మారుమూల గ్రామాల్లో సైతం వినిపిస్తున్న వార్తలు. విచక్షణ, ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి నూరేళ్ల జీవితాన్ని ఉరికొయ్యకు తగిలి స్తున్నారు. క్షణికావేశంతో తనువు చాలించే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే తామెందుకు చనిపోతున్నామో తెలుసుకోవచ్చు. తననే నమ్ముకుని తనపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనే దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది. ఆత్మహత్య ఒక్కటే అన్ని సమస్యలకూ పరిష్కారం కాదు. సమస్యను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలే తప్ప కృంగి పోయి ప్రాణాలు తీసుకోవడం సబబు కాదని గుర్తించాలి. ఇటీవల చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాలే ఎక్కువ కారణంగా తెలుస్తోంది. ఒక్క క్షణం ఆలోచించి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తే భవిష్యత్ అంతా ఉజ్వలంగానే ఉంటుందన్న విషయం తెలుసుకోవాలి. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో వారి భార్య, పిల్లలు రోడ్డున పడి అనాథలుగా మిగిలిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందుల ను తట్టుకుని జీవితంలో రాణించాలన్న భరోసా, ఆత్మస్త్యైం అందరిలో వుండాలి. ఆత్మహత్యల నివారణకు కౌన్సెలింగ్ ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఆత్మహత్యల నివారణ కోసం పోలీసు శాఖ తరఫున సదస్సులు నిర్వహించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ముఖ్యంగా యువత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా యువత, మహిళలే ఉంటున్నారు. జీవితంలో లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడాలే తప్ప ఆత్మహత్యలకు పాల్పడవద్దు. బతకడానికి కష్టపడాలే తప్ప డిప్రెషన్‌కు లోను కావొద్దు. - సుమతి, ఎస్పీ ఒత్తిడిని తట్టుకుని కష్టపడాలి జీవితంలో అనుకున్నది సాధించడానికి వత్తిడిని తట్టుకునే శ క్తిని పెంచుకోవాలి. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోయినా వారు ఆత్మహ త్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. జీవితంపై సరైన అవగాహన లేక ఈ చర్యకు పాల్పడతారు. జీవితంలో ఎలా బతకాలో, ఎలా కష్టపడి జీవించాలో వారికి నేర్పాలి. వ్యామోహానికి లోను కావొద్దు. ఆత్మహత్యనే అన్నింటికీ పరిష్కారం కాదన్న విషయం తెలుసుకోవాలి. జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తించాలి. - డాక్టర్ కుమార రాజ, సంగారెడ్డి -
అయ్యో.. సుమతీ!
యువతిపై మృత్యుక్రీడ ప్రాణాలు తోడేస్తున్న హైపర్ ప్లాస్టిక్ బోన్‌మారో బతుకు మీద ఆశతో రోజులు లెక్కిస్తున్న నిరుపేద దాతలు కరుణిస్తే ప్రాణాలు నిలబడతాయి ఆపన్నహస్తం కోసం అశ్రునయనాలతో ఎదురుచూపు ‘అంతే లే పేదల గుండెలు.. అశ్రువులే నిండిన కుండలు’.. అన్నారు మహాకవి శ్రీశ్రీ. గుండెలే కాదు పేదల జీవితాలే కన్నీటి కండలవుతున్నాయి. దీనికి ఆ విద్యాధిక కుటుంబమే నిదర్శనం. సరస్వతీ కటాక్షం మెండుగా ఉన్నా.. లక్ష్మీ కటాక్షం లేశమాత్రమైనా లేని ఆ కుటుంబంపై విధి కూడా వక్రదృష్టి సారించింది. అంతే.. అంతవరకు సలక్షణంగా ఉన్న.. డిగ్రీ పూర్తి చేసిన ఆ కు టుంబంలోని యువతిని అతి భయంకరమైన వ్యాధి ఆవహించి ంది. వైద్య చికిత్స ఖరీదు కావడంతో లక్షల రూపాయల భారాన్ని నిరుపేద కుటుంబం నెత్తిన మోపింది. పెళ్లీడుకొచ్చిన కూతురు మంచం పట్టింది. వైద్యం చేయించే తాహతు లేక ఆ అమాయకురాలితోపాటు కుటుంబం మొత్తం మానసికంగా కుంగిపోతోంది. పొందూరు:కొద్ది నెలల క్రితం వరకు ఆ అమ్మారుు సంపూర్ణ ఆరోగ్యవంతురాలు. ఉత్సాహంగా తిరుగుతూ ఇల్లంతా సందడి చేసేది. అంతలోనే అస్వస్థతకు గురైంది. సాధారణమే కదా.. అనుకుంటే.. పరిస్థితి కాస్త తిరగబడింది. తల్లిదండ్రులు మొదట స్థానిక వైద్యులకు, ఆ తర్వాత శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లి చూపించారు. ఫలితం లేకపోయింది. విశాఖ కేజీహెచ్‌లో చూపించారు. పరీక్షల్లో అప్పటికే ఆమె రక్తంలోని ప్లేట్లెట్స్ సంఖ్య 1.50 లక్షల నుంచి ఏడువేల కనీస స్థాయికి పడిపోయాయి. శారీరకంగా కృశించిపోయింది. అన్ని రకాల పరీక్షల అనంతరం కేజీహెచ్ వైద్యులు బాంబు పేల్చారు. ఆమె అరుదైన హైపర్ ప్లాస్టిక్ బోన్‌మ్యారో వ్యాధితో బాధపడుతోందని నిర్ధారించారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లినా అక్కడి వైద్య నిపుణులు కూడా అదే చెప్పారు. చికిత్సకు సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చువుతుందని కూడా స్పష్టం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు హతాశులయ్యూరు. చేసేదేమీ లేక కుమార్తెను తీసుకొని స్వగ్రామానికి తిరిగి వచ్చారు. పేదరాలికి ఖరీదైన వ్యాధి పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామానికి చెందిన వండాన రామారావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెకు వివాహమైనా ఆమె వైవాహిక జీవితం సక్రమంగా సాగడం లేదు. కుమారుడు వెంకటేష్ ఇటీవలే బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. మరో కుమార్తె అయిన సుమలత గత ఏడాదే బీకాం(కంప్యూటర్స్) పూర్తి చేసింది. ఎంఏ, బీఈడీ చేసిన రామారావు ఇప్పటికీ నిరుద్యోగిగానే ఉన్నారు. గతంలో శ్రీకాకుళంలోని పలు ప్రైవేటు కళాశాలల్లోనూ, నందిగాం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తాత్కాలికంగా పనిచేశారు. ఎక్కడికి వెళ్లినా దినం తీరడం లేదు. పైసా ఆదాయం లేదు. సెంటు భూమి లేదు. బతకడమే కష్టంగా ఉన్న రామారావును కుమార్తె దీనస్థితి మరింతంగా కుంగదీస్తోంది. బతుకు ఆశతో.. కుమార్తెను బతికించుకునేందుకు శ్రీకాకుళం రిమ్స్ నుంచి హైదరాబాద్ నిమ్స్ వరకు ఎన్నో ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయితే చికిత్సకు తమిళనాడులోని వేలూరుకు తీసుకెళ్లాలని, ఖర్చు రూ.15 లక్షల వరకు ఉంటుందని తెలియడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం ఇంటి వద్దనే మంచంపై ఉన్న కూతురిని చూసుకొని గుడ్లనీరు కక్కుకుంటున్నారు. ఏదైనా మార్గం కనబడకపోతుందా?.. కూతురి జీవితం మళ్లీ చిగురించకపోతుందా??.. అన్న ఆశతో రోజులు గడుపుతున్నారు. బాధాసర్ప దష్టురాలైన సుమలతకు మెరుగైన వైద్య చికిత్సకు సహకరించి కొత్త జీవితం ఇవ్వాలని తల్లిదండ్రులు అశ్రునయనాలతో వేడుకుంటున్నారు. స్పందించే హృదయం ఉన్న వ్యక్తులు, సంస్థలు సెల్: 8008545015కు సంప్రదించాలని, తమ స్టేట్ బ్యాంకు ఖాతా నంబర్ 11639435720 అని వివరించారు. -
శునకం కేర్ ఆఫ్ సుమతి
పెంపుడు జంతువులు అంటేనే ప్రేమ. దానితో ఉన్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కల్మషమైన దాని ప్రేమకు ఎంతటివారైనా ఫిదా అయిపోవాల్సిందే. అలాంటి పెంపుడు జంతువును ఇంట్లో ఒంటరిగా వదిలి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏంటి? తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా... మనసంతా దానిపైనే ఉంటుంది. అలాంటివారి బెంగ తీర్చడంకోసం వెలసిందే ‘పెట్సెట్రా’. వేళకు అన్నంతో పాటు ఇంత ఆప్యాయతను కూడా అందిస్తానంటూ మూడేళ్లక్రితం పెట్స్ కేర్ సెంటర్‌ని నెలకొల్పారు సుమతీ నీలమేఘం. హైదరాబాద్ విమానాశ్రయంలో విమానం బయలుదేరడానికి ఇంకా అరగంట సమయం ఉంది. సుమతి మనసు బరువెక్కుతోంది. జనని మొహం మాత్రం ఆనందంతో వెలిగిపోతోంది. ‘నా బంగారం... రేపొద్దిటికల్లా మనింటికి వెళ్లిపోవచ్చు...’ ఒడిలో కూర్చున్న కుక్క తలపై దువ్వుతూ జనని అంటున్న మాటలకు సుమతికి ఇంకాస్త బెంగగా అనిపించింది. ‘మళ్లీ ఎన్నాళ్లకు... నిన్ను చూస్తానే..’ అంది సుమతి. ‘ఎందుకండీ అంత బెంగ... మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు స్కైప్‌లో చూడొచ్చు కదా!’ అన్న జనని మాటలతో కాస్త ఊరట చెందిన సుమతి ‘ఓబా’ జాగ్రత్త అంటూ వెనుతిరిగింది. ఎయిర్‌పోర్టులో ఈ కుక్క గోలేమిటి అనుకుంటున్నారా! దీని వెనుక ఓ కథ ఉంది. జనని భర్తకు సింగపూర్‌లో ఉద్యోగం రాగానే భార్యాభర్తలు ఉన్నట్టుండి బయలుదేరాల్సి వచ్చింది. వెళ్లేటప్పుడు వారి పెంపుడు కుక్క ‘ఓబా’ని తీసుకెళ్లడం కుదరలేదు. పొరుగుదేశాలకు పెంపుడు జంతువుల్ని తీసుకెళ్లడం అంత సులువైన పనికాదు. ముందుగా అక్కడ క్వారెంటైన్(పొరుగుదేశాల నుంచి వచ్చిన పెంపుడు జంతువుల్ని అక్కడ ఒక నెలరోజులపాటు పెట్టుకుని ఎలాంటి జబ్బులూ లేవని తెలిశాక అప్పుడు యజమానులకు అప్పగించే సెంటర్)లో పెట్టడానికి స్లాట్ దొరక లేదు. దాంతో సుమతి నెలకొల్పిన ‘పెట్సెట్రా’లో చేర్పించారు. ఏడు నెలల తర్వాత సింగపూర్ క్వారెంటైన్లో స్లాట్ దొరికింది. అప్పుడు హైదరాబాద్‌కి వచ్చి తమ కుక్కను తీసుకెళ్లారు. ఆలోచన వెనక... పదిహేడేళ్లపాటు బహుళజాతి కంపెనీలో పనిచేసిన సుమతి కుక్కలను పెంచడంలోనే ఉన్న ఆనందం ఇంకెక్కడా దొరకదంటారు. ఐదంకెల జీతం వదులుకుని కుక్కల్ని పెంచే సెంటర్ నెలకొల్పడం వెనక సుమతికున్న ప్రేమతో పాటు పెట్స్ ప్రేమికుల అవసరం కూడా ఉంది. పెట్స్‌ని ఒంటరిగా వదిలివెళ్లలేక చాలామంది ప్రయాణాలకు దూరంగా ఉంటారు. అలాగే పగలు ఇంట్లో చూసుకునేవాళ్లుండరని కుక్కల్ని పెంచుకోలేనివారు చాలామంది ఉన్నారు. హైదరాబాద్‌లోని మణికొండ దగ్గర సుమతి గురించి ఎవరిని అడిగినా చెబుతారు. ఆమె పేరు చెబితే అడ్రస్ దొరకదు. ‘ఇక్కడ కుక్కలామె ఎక్కడుంటుంది’ అని అడిగితే వెంటపెట్టుకుని మరీ తీసుకెళ్లి చూపిస్తారు. ‘‘నేనలా ఫేమస్ అయిపోయానండీ... పొద్దునే ఓ పది కుక్కల్ని వెంటబెట్టుకుని వాకింగ్‌కి వెళితే అందరికీ తెలియకుండా ఎలా ఉంటుంది! (నవ్వుతూ..) నిన్నమొన్న కొత్తగా వచ్చినవారికి కూడా నా ‘పెట్సెట్రా’ గురించి తెలుసు’’ అని అంటారామె. స్విమ్మింగ్‌పూల్‌తో సహా... ఈ పెట్స్‌కేర్ సెంటర్ నెలకొల్పి మూడేళ్లు దాటుతోంది. మొదట్లో అపార్ట్మెంట్లో తన ఫ్లాట్‌లోనే కుక్కల్ని పెంచిన సుమతి ఈ మధ్యనే సొంతింట్లోకి వచ్చారు. కింది అంతస్థు మొత్తం కుక్కలకోసం కేటాయించారు. అక్కడే వాటికోసం స్విమ్మింగ్‌పూల్ కూడా ఏర్పాటుచేశారు. కొందరు పొద్దుటే తమ కుక్కల్ని ఇక్కడ వదిలేసి ఆఫీసు నుంచి ఇంటికెళ్లేటపుడు తిరిగి తీసుకెళ్లిపోతుంటారు. కొందరు వారాంతపు సెలవుల్లో వదులుతారు. ఇంకొందరు దూరప్రయాణాలపుడు తమ కుక్కల్ని ఇక్కడ అప్పజెప్పేస్తారు. ‘‘కుక్కని ఇక్కడ వదలడానికి ముందు దాని మెడికల్ రిపోర్టు చూస్తాను. ఏమైనా చర్మవ్యాధులుంటే వారికి చెప్పి వైద్యం చేయిస్తాను. లేదంటే మిగతావాటికి వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆ కుక్కలు మొదటిసారి కొంచెం కొత్తగా చేస్తాయి. తర్వాత వాటికి కూడా అలవాటైపోతుంది. చాలామంది చెబుతుంటారు. ‘సుమతీ ఆంటీ ఇంటికి వెళదామా... అనగానే వెంటనే కారెక్కి కూర్చుంటుందండీ..’ అంటూ తమ పెంపుడు కుక్క గురించి వారు చెబుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది’’ అని చెపుతున్నప్పుడు సుమతి ముఖంలో కించిత్ గర్వం తొణికిసలాడింది.ప’కి 150మంది క్లయింట్స్ ప్రసుప్రస్తుతం ‘పెట్సెట్రా’కి 150మంది క్లయింట్స్ ఉన్నారు. ఇందులో కుక్కలతోపాటు కుందేళ్లు, లవ్‌బర్డ్స్‌కి కూడా ఆశ్రయం ఉంది. సుమతి భర్త డాక్టర్ కిరణ్ ఒమేగా హాస్పిటల్లో మెడికల్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు కూడా పెంపుడు జంతువులంటే ప్రాణం. ‘‘సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులప్పుడు నేను గుమ్మం దాటను. ఎందుకంటే అప్పుడే కదా అందరికీ నా అవసరం. మాక్కూడా మూడు కుక్కలున్నాయి. వాటిలో ఒకటి దత్తత తీసుకున్నది. నేను అప్పుడప్పుడు బ్లూక్రాస్‌కి వెళుతుంటాను. అప్పుడు ఎవరో వదిలేసిన కుక్క కనిపిస్తే తెచ్చి పెంచుకున్నాను. వీధి కుక్కల్ని పెంచుకునే ధోరణికి మద్దతునిస్తూ స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాను’’ అని చెప్పారు సుమతి. పొరుగింటివాళ్లనే పెద్దగా పట్టించుకోని ఈరోజుల్లో వారి పెంపుడు జంతువుల్ని చేతుల్లోకి తీసుకుని తియ్యగా మాటలు చెబుతూ ఆటలాడించేవారెవరుంటారు చెప్పండి. ‘ఊరికే ఏం చేయడం లేదు కదా’ అనొచ్చు. డబ్బుతో వాటికి పెట్టే ఆహారాన్ని కొనచ్చు కానీ ప్రేమను కొనలేరు కదా! - భువనేశ్వరి; ఫొటోలు: జి బాలస్వామి పెంపుడు కుక్కను వదిలే ముందు దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలి. మీ పెట్‌కి స్విమ్మింగ్ అవసరమైతే రెండు రోజుల ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. మీ పెట్ని చూసుకున్నందుకు రోజుకి 300 రూపాయల వరకు తీసుకుంటారు. మీ పెట్‌కి మీరేం ఆహారం పెడతారో అదే మెనూను ఫాలో అవుతారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే ప్రాణం. ఎక్కడ రోడ్డుపైన కుక్కపిల్ల కనిపించినా ఆగిపోయేదాన్ని. ఆ ప్రేమ అక్కడితో ఆగకుండా నన్నిలా వెంటాడి ఏకంగా కేర్ సెంటర్‌నే పెట్టించింది.’’