Operation Muskaan
-
బాల్యాన్ని బందీ కానీయొద్దు.. బాల్య వివాహాల చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు
వికారాబాద్ అర్బన్: బాల్య వివాహాల నివారణ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జూలై మాసంలో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీవితంలో బాల్యం చాలా గొప్పదన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో జూలై 31లోపు అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పిల్లల సంక్షేమ కమిటీ, చైల్డ్‌లైన్ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలన్నారు. పిల్లలకు మంచి జీవితాన్ని అందించాల్సి వచ్చినప్పుడు కొంత కటువుగా వ్యవహరించాల్సి ఉంటుందని, ఈ విషయంలో అధికారులకు ఏదైనా సమస్య ఎదురైతే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. తప్పిపోయిన పిల్లల విషయంలో చైల్డ్‌లైన్ ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జూలై 9న జరిగే సమావేశానికి గత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదివి పైచదువులకు వెళ్లని విద్యార్థినుల జాబితా సేకరించి తీసుకురావాలని డీఈఓను ఆదేశించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు అందరూ చట్టం పరిధిలో పనిచేయాలన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు. ఎక్కడ బాల్య వివాహాలు జరిగినా సంబంధిత సెక్రటరీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యాన్ని బందీ కానీయొద్దని.. బడీడు పిల్లలందరూ పాఠశాలలో ఉండేలా చూడాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అనంతరం దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ రూపొందించిన పలు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ లలితకుమారి, డీఆర్ఓ అశోక్‌కుమార్, డీఎంహెచ్ఓ పాల్వాన్ కుమార్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జూలై 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్–9
ఖలీల్‌వాడి: జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించాలని డీసీపీ(అడ్మిన్) మధుసూదన్‌రావు ఆదేశించారు. ఇన్చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లో వివిధ శాఖల అధికారులతో ఆపరేషన్ ముస్కాన్–9 సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ(అడ్మిన్)మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 18 ఏళ్లలోపు తప్పిపోయిన, వదిలేసిన, కార్మికులుగా ఉన్న బాలబాలికలు ఉన్నట్లయితే.. అలాంటి వారి సమాచారం సేకరించి రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించాలన్నారు. బాలలతో బలవంతంగా భిక్షాటన చేయించిన వారిపై, వెట్టి చాకిరి చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో ఎస్సై, నలుగురు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ప్రజలు తప్పిపోయిన బాలురు, బాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం, బాలకార్మికుల గురించి సమాచారం తెలిస్తే డయల్ 100, స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూం సెల్ నెంబర్ 87126– 59777, నిజామాబాద్ ఇన్చార్జి ఎస్సై 80965– 73004, ఆర్మూర్ ఇన్చార్జి ఎస్సై 94401–40022, బోధన్ ఇన్చార్జి ఎస్సై 94412–50992 నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. సమావేశంలో ఎస్బీ శ్రీశైలం, సీసీఆర్బీ మోహన్, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సీఐ గోపినాథ్, జిల్లా లేబర్ ఆఫీసర్ యోహన్, జిల్లా సంక్షేమ అధికారి రసూల్‌బీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ సంపూర్ణ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్య, బాల రక్ష భవన్ కో–ఆర్డినేటర్ విజయలక్ష్మి, నిజామాబాద్ ఇన్చార్జి మహిళా ఆర్ఎస్సై స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
జూలై 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్–8
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ ఆదే శాల ప్రకారం ఏటా రెండు విడతల్లో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్–8ని వచ్చే నెల 1 నుంచి ప్రారంభించనున్నట్టు మహి ళలు, చిన్నారుల భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా వెల్లడించారు. జూలై 1 నుంచి నెల పాటు జరిగే ముస్కాన్ కార్యక్రమంలో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులను, ట్రాఫికింగ్ ద్వారా వివిధ వ్యవస్థల్లో బందీలైన వారిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చనున్నారు. అలాగే తల్లిదండ్రులు లేని చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు తరలించి వారి బాధ్యతలను సంబంధిత విభాగాలకు అప్పగించనున్నారు. ఈ ఆపరేషన్‌పై మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ విభాగం, కార్మిక శాఖ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, సర్వశిక్షా అభియాన్, యూనిసెఫ్ విభాగాలతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించినట్టు స్వాతిలక్రా తెలిపారు. ఈ సమా వేశంలో మహిళాభివృద్ధి, చిన్నారుల సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక క్యార్యదర్శి డి.దివ్య, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్, కుటుంబ సంక్షేమ శాఖ, శిశు ఆరోగ్య విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర, సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ పాల్గొన్నారు. (క్లిక్: 38 మంది ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్) -
బాలల బంగారు భవితకు సర్కార్ భరోసా
సాక్షి, అమరావతి: ‘మా అమ్మానాన్న పొలం పనులకు వెళ్లినా కుటుంబం గడవడం లేదు.. అందుకే నన్ను భిక్షాటన చేయిస్తున్నారు.. మా తమ్ముడిని చదివిస్తున్నారు.. నాకూ చదువుకోవాలని ఉంది సార్.. బాగా చదువుకుని టీచర్‌ను అవుతాను.. నన్ను చదివిస్తారా’ ఇది ప్రకాశం జిల్లాకు చెందిన పదేళ్ల చిన్నారి సలోమి వేడుకోలు ‘మా అమ్మ చనిపోయింది. మా నాన్న రోజుకు వంద రూపాయలు వస్తాయని నన్ను బట్టల కొట్టులో పెట్టాడు. నన్ను చదివిస్తే పోలీస్ అవుతాను సార్’.. ఇది విజయనగరం జిల్లాలో పోలీసులకు దొరికిన ఏడేళ్ల బాలిక యామిని విన్నపం ‘మా అమ్మ ఇంటింటికీ వెళ్లి పాచి పనిచేసినా ఇల్లు గడవడం లేదు. రోజుకు రూ.150 కోసం నన్ను హోటల్లో అంట్లు కడిగే పనిలో పెట్టింది. నాకు చదువుకోవాలని ఉంది. నన్ను చదివిస్తే ఆర్మీలో చేరతాను’.. ఇది కృష్ణా జిల్లా ఘంటసాల మండలానికి చెందిన చరణ్ వెంకట్ వినతి ఇవి.. ఆపరేషన్ ముస్కాన్‌లో పోలీసులు సంరక్షించిన చిన్నారుల దయనీయ గాథలు. ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. ఏ ఒక్క బాలుడు, బాలికను కదిలించినా తమ దుస్థితిని ఏకరువు పెట్టారు. తమకూ చదువుకోవాలని ఉందని.. చదివిస్తే అందరిలా ఉన్నతంగా ఎదుగుతామంటూ కోరికను వ్యక్తం చేశారు. వీరంతా తాజాగా రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎస్పీ కార్యాలయాల నుంచి డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో వెబినార్ ద్వారా తమ గోడును వెళ్లబోసుకున్నవారే. బడిలో ఉండాల్సిన బాలలు వీధి బాలలుగా మగ్గిపోవడానికి ప్రధాన కారణం.. వారి పేదరికమే. మూడో విడత ఆపరేషన్ ముస్కాన్‌లో దొరికిన వీధి బాలల వాస్తవ పరిస్థితిపై విశ్లేషణ.. బాలల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట చిన్నారులు, బాలల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దవచ్చని అధికారులు తెలిపారు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి కార్యక్రమాలను ఉపయోగించుకుని వీధి బాలలను కూడా విద్యావంతులను చేస్తామని చెబుతున్నారు. -
ఏడేళ్ల బిందును అక్కున చేర్చుకున్న డీజీపీ
సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆపరేషన్ ముస్కాన్‌లో గుర్తించిన ఏడేళ్ల బిందును డీజీపీ గౌతమ్ సవాంగ్ అక్కున చేర్చుకున్నారు. నూతన వస్త్రాలు, టెడ్డీబేర్ ఇచ్చి చిన్నారి ముఖంలో సంతోషం నింపారు. తన యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, తన కాళ్ల మీద తాను నిలబడే స్థాయి వచ్చేంత వరకు బిందును అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా గుర్తించిన పిల్లలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం కాసేపు ముచ్చటించారు. అదే విధంగా రెస్క్యూ చేసిన బాల బాలికలతో పాటు తాడేపల్లి గుడ్ షప్పర్డ్ కరుణామయి హోమ్‌లోని పిల్లలకు స్టడీ కిట్ అందజేశారు. (చదవండి: ఉత్తరాంధ్ర, సీమ వాసుల అభ్యర్థన తిరస్కృతి ) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పదమూడు వేల మంది బాల బాలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు. రెస్క్యూ చేసిన వీధి బాలలు, బాల కార్మికులను చైల్డ్ వెల్ఫేర్ హోమ్ లకు తరలించినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను అప్పజెపుతామని అన్నారు. పేద పిల్లల చదువు కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు పెట్టిందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్.. వాటిని సద్వినియోగం చేసుకుని పిల్లలను బడులకు పంపాలని విజ్ఞప్తి చేశారు. -
ఆపరేష్ ముస్కాన్ కోవిడ్-19 ఫేజ్ 6వ విడత ముగింపు కార్యక్రమం
-
ఆపరేషన్ ముస్కాన్
-
ఆపరేషన్ ముస్కాన్‌ను ప్రారంభించిన డీజీపీ
సాక్షి, విజయవాడ: బాలల మోమున చిరునవ్వులు పూయించడమే లక్ష్యంగా.. వారికి స్వేచ్ఛను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగమే ఆపరేషన్ ముస్కాన్. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 కార్యక్రమాన్ని మంగళవారం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కంట్రోల్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలోనే మొదటసారిగా ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19కు శ్రీకారం చుట్టాము. ( విశాఖ ప్రమాదం: నలుగురు సభ్యులతో కమిటీ ) అందులో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, వివిధ కర్మాగారాల్లో బాలకార్మికులుగా, అనాదలుగా రోడ్లపైన తిరుగుతున్న వారిని రెస్క్యూ చేస్తారు. కార్యక్రమంలో పోలీస్, సీఐడీ, మున్సిపల్, ఐసీడీఎస్, మహిళ శిశు సంక్షేమ శాఖ, చేల్డ్ లైన్, స్వచ్చంధ సంస్థలు పాల్గొంటాయి. ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 ద్వారా రెస్క్యూ చేసిన బాలబాలికలకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం రిపోర్టుల ఆధారంగా అవసరమైన వారిని ఆస్పత్రికి తరలిస్తారు. పూర్తిగా కోలుకున్న తర్వాత వారిని పునరావాస కేంద్రాలలో చేర్పించి వారికి కావాల్సిన ఉచిత విద్య, మౌళిక సదుపాయాలు కల్పిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. (దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశం) -
ఆధార్ కార్డుల్లో పెద్దోళ్లు.. పనిలో చిన్నోళ్లు
సాక్షి, సిటీబ్యూరో: యాచిస్తున్న...చెత్త ఏరుకుంటున్న...బాల కార్మికులుగా పనిచేస్తున్న బాలబాలికలను రక్షించడంలో సైబరాబాద్ పోలీసులు ముందున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలైలో జరిగిన అపరేషన్ ముస్కాన్–5లో 541 మంది(483 బాలురు, 58 బాలికలు)ను సంరక్షించారు. వీరిలో 479 మందిని షెల్టర్ హోంలకు, 62 మంది తల్లిదండ్రులకు అప్పగించారు. తెలంగాణ పోలీసులు రూపొందించిన ఫేషియల్ రికగ్నేషన్ యాప్ (దర్పణ్) ద్వారా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులను కూడా ఈ అపరేషన్ ముస్కాన్–5 ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేశారు. సైబరాబాద్ పోలీసులకు చిక్కిన బాలకార్మికుల్లో అత్యధికంగా ‘338 మంది’ ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని సైబరాబాద్ ఉమెన్ అండ్ సేఫ్టీ విభాగం ఇన్చార్జి అనసూయ తెలిపారు. ఆధార్‌కార్డులో వీరి వయస్సు మేజర్‌గా ఉండగా పని చేస్తున్న ప్రాంతాల్లో వీరిని సంరక్షించగా బాలకార్మికులుగా తేలిందన్నారు. కొన్ని కేసులిలా... ♦ అత్యంత హానికర పరిస్థితుల్లో మేడ్చల్‌లోని శ్రీరామ స్పిన్నింగ్ మిల్లులో బాలకార్మికులుగా పనిచేస్తున్న 15 మంది చిన్నారులను ఆయా జిల్లాల కార్మిక విభాగం అధికారులు, చైల్డ్‌లైన్ సిబ్బంది, జిల్లా బాలసరంక్షణ విభాగాధికారులతో కలిసి సైబరాబాద్ పోలీసులు జూలై 15న రక్షించారు. వీరందరూ మహారాష్ట్ర, బీహర్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం. ♦ మైలార్‌దేవ్‌పల్లిలో మెటల్ ఇండస్ట్రీలో 10 మంది బాలకార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం అందడంతో అపరేషన్ ముస్కాన్–5 సిబ్బంది జూలై 16న దాడులు నిర్వహించారు. అత్యధిక ఉష్ణోగ్రతలో యంత్రాల వద్ద పనిచేస్తుండటంతో అనారోగ్యం బారిన పడిన చిన్నారులకు విముక్తి కల్పించారు. చిన్నారులకు తక్కువ వేతనాలు ఇవ్వడంతో పాటు విరామం లేకుండా వారితో పని చేయిస్తున్న కంపెనీ యజమానిపై మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. ♦ కాటేదాన్‌లోని ఓ పేపర్ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురు పిల్లలను జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులతో కలిసి పోలీసులు సంరక్షించారు. వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు వైద్య పరీక్షలో తేలింది. సదరు కంపెనీ యజమానిపై బాలకార్మికుల చట్టం, 79 జేజే యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ♦ వివిధ జంక్షన్ల వద్ద యాచిస్తున్న ముగ్గురు పిల్లలను పోలీసులు కాపాడారు. వీరి తల్లిదండ్రులు హెచ్ఐవీతో మృతి చెందగా, సదరు చిన్నారులు కూడా అదే వ్యాధితో బాధపడుతున్నారు. వారి అలనాపాలనా చూసుకుంటామని చేరదీసిన వారి బంధువులు చిన్నారులతో వివిధ జంక్షన్ల వద్ద భిక్షాటన చేయిస్తున్నారు. ప్రతిరోజూ రూ.1500 కంటే తక్కువగా తీసుకొస్తే అన్నం కూడా పెట్టడం లేదని పోలీసుల విచారణలో తేలింది. ఆధార్ కార్డుల్లో అక్రమాలు... ఈ అపరేషన్ ముస్కాన్ –5లో చిక్కిన బాల, బాలికలకు అందరికీ పుట్టిన తేదీలు 2000 జనవరి 1, 2001 జనవరి 1 గా సృష్టించారు. బీహర్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం తదితర రాష్ట్రాలకు చెందిన దళారులు చిన్నారుల తల్లిదండ్రులకు దళారులు రూ.10,000 చొప్పున చెల్లించి వారిని తీసుకువచ్చినట్లుగా విచారణలో తేలింది. పిల్లలు పనిచేసే ప్రాంతాలు అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో రోగాల బారిన పడుతున్నారు. రోజుకు రెండుసార్లు మాత్రమే అన్నం పెట్టేవారు. కొన్ని కంపెనీలు 24 గంటలు బాలకార్మికులతో పని చేయించుకోగా, మరికొన్ని కంపెనీలు ఉదయం పెద్దవారితో, రాత్రిళ్లు పిల్లలతో పని చేయించేవని సైబరాబాద్ పోలీసుల విచారణలో వెల్లడైంది. -
ఆపరేషన్ ముష్కాన్; 1371 మంది వీధి బాలలు గుర్తింపు
సాక్షి, అమరావతి : డీజీపీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆపరేషన్ ముష్కాన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 690 టీమ్‌లు పాల్గొన్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, థియేటర్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 1371 మంది వీధి బాలలను, బాల కార్మికులను గుర్తించిన పోలీసులు 286 మందిని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు. మిగిలిన వారిని చైల్డ్ణ్ కేర్ హోమ్‌లకు తరలించారు. కాగా చైల్డ్‌లైన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో మిగిలిన బాల బాలికలను వారి ఇంటికి చేర్చుతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పిల్లలను బడికి పంపకుండా పనికి పంపితే చర్యలు తప్పవని తల్లిదండ్రులను హెచ్చరించారు. -
ఆపరేషన్ ముస్కాన్‌తో 94 మందికి విముక్తి
సాక్షి, మెదక్ : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను తీసుకొచ్చాయి. అయినా ఆశించిన ఫలితాలు రాలేదు. కార్మిక శాఖ ప్రతి ఏటా దాడులు నిర్వహిస్తున్నా. తూతూమంత్రంగానే సాగుతోంది. 15 ఏళ్లలోపు బాలబాలికలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమైనప్పటికీ జిల్లాలో చాలా ప్రాంతాల్లోని వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు హోటళ్లు, దుకాణాలు, ఇటుకబట్టీల్లో వారు కనిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. చదువుకునే వయసులో పిల్లలు వివిధ కారణాలతో బాలకార్మికులుగా మారుతుండగా, ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్‌లో అధికారులు వారిని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు సమన్వయంతో ముందుకు.. జిల్లాలో బాలకార్మికుల నిర్మూలనకు సంబంధించి అధికార యంత్రాంగం సీరియస్‌గా దృష్టి సారించింది. పోలీస్, కార్మిక, స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎస్పీ చందనాదీప్తి నేతృత్వంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ బాలకార్మికులను గుర్తిస్తున్నారు. ఈ మేరకు ఐదో దఫాలో జిల్లా కేంద్రంతో పాటు నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ పట్టణాలు, పలు మండలాల్లో వివిధ యాజమాన్యాల కింద పనిచేస్తున్న బడి బయట ఉన్న 94 మంది బాలబాలికలను గుర్తించారు. వీరిని బాలల సంరక్షణ కమిటీ ఎదుట హాజరుపర్చారు. వీరితో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాలబాలికలను వారివారి సమీప పాఠశాలల్లో చేర్పించారు. ఇప్పటివరకు 347 మందికి విముక్తి.. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం రాష్ట్రంలో 2015లో ప్రారంభమైంది. జిల్లాల విభజన అనంతరం 2017లో మెదక్‌లో మొదటిసారిగా జల్లెడ పట్టారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, బట్టీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న వారితో పాటు బడి బయట ఉన్న పిల్లలు 134 మందిని గుర్తించారు. ఇందులో 120 మంది బాలురు కాగా 14 మంది బాలికలు ఉన్నారు. వీరందరిని సమీప పాఠశాలల్లో చేర్పించిన అధికారులు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించారు. 2018లో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో మొత్తం 119 మంది బాలకార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. ఇందులో బాలురు 108 మంది కాగా.. బాలికలు 11 మంది. అదే విధంగా ఈ ఏడాది గత నెలలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 94 మందికి విముక్తి కలిగింది. ఇందులో 83 మంది బాలురు కాగా, 11 మంది బాలికలు ఉన్నారు. ఇప్పటివరకు విబాజ్య మెదక్ జిల్లాలో 311 మంది బాలురు 36 మంది బాలికలు.. మొత్తం 347 మందికి అధికారులు విముక్తి కల్పించారు. వీరిని పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులతోనే.. పలువురు బాలబాలికలు ఆర్థిక ఇబ్బందులతోనే బడికి వెళ్లకుండా పనులకు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. బేకరీలు, హోటళ్లు, పరిశ్రమల నిర్వాహకులు వారికి నెలనెలా జీతంతో పాటు తిండి కూడా పెడుతుండటంతో పిల్లలను పనులకు పంపించేందుకే తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అనాథలుగా మారిన పిల్లలు మాత్రం చెత్త కాగితాలు ఏరుతూ, బస్టాండ్లు ఇతర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్నారు. అంతేకాదు కొంత మంది బాలబాలికలు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అధికారులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు పిల్లలను పనిలోకి పంపితే బాలకార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు అనాథలైన పిల్లలను ప్రభుత్వ గురుకులాల్లో చేర్పించారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు పోలీస్, కార్మిక, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తున్నాం. బాలకార్మికుల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రెండు బృందాలతో జిల్లాను జల్లెడ పట్టాం. బాలబాలికలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే ఊరుకునేది లేదు. ఎవరైనా సరే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – చందనాదీప్తి, ఎస్పీ -
నకిలీ ఆధార్ కార్డులతో వెట్టిచాకిరీ!
సాక్షి, హైదరాబాద్: దిక్కుతోచని స్థితిలో వెట్టి వెతలో చిక్కుకుపోయిన బాల, బాలికలకు విముక్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆపరేషన్ ముస్కాన్–5లో ఇప్పటివరకు సైబరాబాద్‌లో 541 మంది పిల్లలను రెస్క్యూ చేశామని సైబరాబాద్ సీపీ విసి సజ్జనార్ వెల్లడించారు. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఈ ఆపరేషన్ ముస్కాన్‌లో లేబర్426, బెగ్గింగ్39, విధి బాలలు 33 మందిని ముస్కాన్ టీమ్ రెస్క్యూ చేసిందని అన్నారు. రెస్క్యూ చేసిన వారిలో 483 మైనర్ బాలురు, 58 బాలికలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి ఏడాది జనవరి, జూలైలో ముస్కాన్ ఆపరేషన్ నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. రక్షించిన వారిలో 62 మందిని తల్లిదండ్రుల చెంతకు చేర్చామని, రెస్క్యూ చేసిన పిల్లలను మొబైల్ యాప్ దర్పన్ ద్వారా గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. వెట్టి నుంచి విముక్తి కల్పించిన బాలకార్మికుల్లో ముగ్గురు హెచ్ఐవీతో బాధపడుతుండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన బాలలు 338 మంది ఉన్నారని వివరించారు. కొంత మంది పిల్లలకు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి సరైన ఆహారం ఇవ్వకుండా టీస్టాల్స్, దాబాలు, చిన్నతరహా పరిశ్రమలు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ జంక్షన్లు, ప్రార్థన మందిరాల సమీపాల్లో భిక్షాటన చేయిస్తున్నారన్నారు. అంతేకాక ఎక్కువ వేడి ఉండే పని చేయించడంతో చాలా మంది పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఎక్కువ పని చేయించుకొని తక్కువ వేతనం ఇస్తున్నారని ఇలాంటివి ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఇలా నిబంధనలు అతిక్రమించిన పరిశ్రమల యజమానులపై రాష్ట్రవ్యాప్తంగా 478 కేసులు నమోదైతే ఒక్క సైబరాబాద్‌లోనే 247 కేసులు నమోదు చేశామన్నారు. చైల్డ్ లేబర్ యాక్ట్2016 ప్రకారం, ఐపీసీ 374 కింద 247 కేసులు నమోదు చేశామని తెలిపారు. పిల్లలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు.ఇప్పటి వరకు రెస్క్యూ హోమ్ లో 479 మంది పిల్లలను తరలించామని, అందులో 429 మంది బాలురు, 50 మంది బాలికలని పేర్కొన్నారు. -
హ్యాపీ డేస్
సాక్షి, సిటీబ్యూరో: వెట్టి చాకిరీలో మగ్గుతున్న పిల్లలకు విముక్తి కల్పించడం... తప్పిపోయిన చిన్నారుల్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చడం, చదువుకు దూరమైన వారిని పాఠశాలల్లో చేర్పించడం... ఈ లక్ష్యాలతో ఏర్పాటైన ‘ఆపరేషన్ ముస్కాన్’ ఐదో విడతను నగర పోలీసులు విజవంతంగా పూర్తి చేశారు. గత నెల 1 నుంచి 31 వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో మొత్తం 445 మందిని రెస్క్యూ చేశారు. ఈ దఫా మొత్తం 31 మందిని బడికి దగ్గర చేశారని పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం వెల్లడించారు. క్రైమ్స్ విభాగం అదనపు సీపీ షికా గోయల్, నగర నేర పరిశోధన విభాగం అదనపు డీసీపీ ఎంఏ బారిలతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది రెండు విడతల్లో మొత్తం 874 మందిని రక్షించామన్నారు. ఆపరేషన్ ముస్కాన్ కోసం ఒక్కో సబ్–డివిజన్‌కు ఒక్కోటి చొప్పున ఎస్సైల నేతృత్వంలో మొత్తం 17 టీమ్స్ ఏర్పాటు చేశారు. గడిచిన 27 రోజుల్లో రెవెన్యూ, లేబర్ డిపార్ట్మెంట్, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులతో కూడిన ఈ టీమ్స్ సిటీలోని దాదాపు 200 ప్రాంతాల్లో దాడులు, తనిఖీలు నిర్వహించారు. కొన్ని కార్ఖానాల్లో చిన్నారుల వెట్టి చాకిరి చేస్తుండగా, మరికొన్ని చౌరస్తాల్లో బిక్షాటన చేస్తున్నట్లు గుర్తించారు. ఇంకొందరు చిన్నారులు చదువుకు దూరమై కేవలం ఇళ్ళు, బస్తీలకే పరిమితమైనట్లు తెలుసుకున్నారు. ఆయా చోట్ల దాదాపు మూడు రోజుల పాటు పరిశీలన చేసిన తర్వాత వరుపెట్టి దాడులు చేశాయి. ఫలితంగా 38 మంది బాలికల సహా మొత్తం 445 మందిని రెస్క్యూ చేశారు. యాజమాన్యాల వివరాలతో డేటాబేస్ ఈ రెస్క్యూ అయిన చిన్నారుల్లో ఆరుగురు పదేళ్లలోపు, 155 మంది 11 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సులో, మిగిలిన వారు ఇతర వయస్కులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్స్‌లో చిక్కిన 381 మందికి సమగ్ర కౌన్సిలింగ్ తర్వాత వారివారి కుటుంబీకులకు అప్పగించారు. 51 మంది బాలురిని సైదాబాద్‌లోని రెస్క్యూ హోమ్, 13 మంది బాలికల్ని నిండోలిఅడ్డా హోమ్‌లకు తరలించారు. లేబర్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురు యజమానులపై కేసులు నమోదు చేసిన అధికారులు మొత్తం రూ.18.7 లక్షల జరిమానా విధించి వసూలు చేశాయి. ఈ చిన్నారుల్లో ఏపీ, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు దాదాపు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. అది కూడా అభివృద్ధికి సూచికే సమాజంలో పిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తామనేది కూడా అభివృద్ధికి ఓ సూచికగా ఉంటుంది. ఇతర విభాగాలతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. చిన్నారుల్ని రెస్క్యూ చేయడంతో పాటు వారికి పునరావాసం కల్పించడం, పాఠశాలల్లో చేర్పించడం అనేది పెద్ద టాస్క్. దీనికోసం అటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ సహకారం ఉండాలి. 2016–2019 మధ్య చేపట్టిన ఈ ఆపరేషన్స్‌లో మొత్తం 4624 మంది చిన్నారుల్ని రెస్క్యూ చేశాం. ఇది కేవలం ఓ డ్యూటీ కాదు... మసస్ఫూరిగా, త్రికరణ శుద్ధితో ఆచరించాల్సిన బాధ్యత. ఈ ‘ముస్కాన్’ను విజయవంతం చేసిన ఎస్సైలకు రివార్డులు అందిస్తాం. – అంజనీకుమార్ సిటీ కొత్వాల్ -
'ముస్కాన్'తో 445 మంది చిన్నారుల్లో చిరునవ్వు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో జూలై 1 నుంచి నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-5 వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఏటా రెండు విడుతలుగా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా నగరంలో జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్5 పేరుతో అధికార యంత్రాంగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. హైదరాబాద్ సిటీలో మొత్తం 17 టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఆపరేషన్ ముస్కాన్-5లో భాగంగా హైదరాబాద్‌లో మొత్తం 445 మంది వీధి బాలలు, బాల కార్మికులను అధికారులు కాపాడారు. వీరిలో 407 మంది బాలురు ఉండగా, 38మంది బాలికలు ఉన్నారు. పట్టుబడిన బాల కార్మికుల్లో 381 మంది చిన్నారులను గుర్తించి పునరావాస చర్యల్లో భాగంగా పోలీసులు వారిని తిరిగి తమ తల్లిదండ్రులకు అప్పగించారు. అంతేకాకుండా వారికి చదువుకోవడానికి స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అందజేశారు, మరో 64 మంది చిన్నారులను రెస్క్యూ హోమ్ కు తరలించామని అధికారులు వివరించారు. పలువురు బాలురను సైదాబాద్ రెస్క్యూ హోమ్ కు, బాలికలను నింబోలిఅడ్డ రెస్క్యూ హోమ్ కు తరలించామని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం పద్నాలుగు సంవత్సరాల లోపు చిన్నారులతో పని చేయించడం చట్టరిత్యా నేరం. కార్మిక శాఖ అధికారులు చట్టవ్యతిరేకంగా బాల కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు 7 కేసులు నమోదు చేసి 18 లక్షలకు పైగా జరిమానా వేశారు. కాగా జనవరిలో నిర్వహించిన ఆపకేషన్ స్మైల్‌లో భాగంగా 429మంది చిన్నారులను, ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 874 మంది చిన్నారులను పోలీసులు సంరక్షించారు. -
బాలకార్మికులకు బంధవిముక్తి
సాక్షి, (కరీంనగర్) : బాలకార్మికులను వ్యవస్థను నిర్మూలించేందుకు బడి బయట వెట్టిచాకిరీలో మగ్గుతున్న బాలబాలికలను గుర్తించి తిరిగి పాఠశాలలకు పంపించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం ఆపరేషన్ ముస్కాన్. ఐదేళ్లుగా ప్రభుత్వం ఏటా జూలైలో ఈ కార్యక్రమం చేపట్టి బాలకార్మికులను బంధ విముక్తులను చేస్తోంది. చిన్నారుల మోములో చిరునవ్వు పూయిస్తోంది. సోమవారం నుంచి జూలై 30 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ పోలీస్‌శాఖ, ఐసీడీసీఎస్ శాఖ ప్రణాళిక రూపొందించింది. రెండు శాఖలు సంయుక్తంగా వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న లేదా బడికి వెళ్లని బాల కార్మికులను, ఇతర ప్రాంతాల నుంచి తప్పిపోయి వచ్చి కార్మికులుగా మారిన బాలలను, భిక్షాటన చేసే వారిని, అనాథలుగా ఉన్న వారిని గుర్తించి వారిని వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పిస్తారు. తిరిగి బడిబాట పట్టెలా చర్యలు తీసుకుంటారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్.. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా లేకుండా చేసేందుకు 2015 నుంచి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. బాలకార్మికులను, బిక్షాటన, వెట్టిచాకిరీ చేస్తున్న వారిని గుర్తించి వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం, అనాథలను ఆనాథశ్రయాలకు పంపించడం, వారికి మెరుగైన విద్య అందించేందదుకు చర్యలు తీసుకునేందుకు ఈ రెండు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏటా జనవరి 1 నుంచి 30 రోజులు పాటు ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో మళ్లీ జులై 1 నుంచి 30 రోజులు ఆపరేషన్ ముస్కాన్ పేరిట బాల కార్మికుల వ్యవస్థ లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2015 నుంచి స్మైల్ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఐదుసార్లు నిర్వహించగా, ముస్కాన్ ఇప్పటి వరకు నాలుగుసార్లు నిర్వహించారు. ఐదో విడత సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. ఐదుసార్లు నిర్వహించిన స్మైల్, నాలుగుసార్లు నిర్వహించిన ముస్కాన్ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు 2,700 మంది బాలబాలికలను గుర్తించారు. వారిని బాల సంరక్షణ కమిటీ ఎదుట హాజరుపరిచి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు. పలు శాఖల సమన్వయం.. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల్లో పలు శాఖలను భాగస్వాములు చేస్తున్నారు. పోలీస్, స్త్రీ,శిశు సంక్షేమశాఖ, స్వచ్ఛంద సంస్థలు, కార్మికశాఖ, విద్య, వైద్యశాఖలు, రెవెన్యూ, చైల్డ్ హెల్ప్‌లైన్‌కు చెందిన సిబ్బందితోపాటు పలువురు సామాజిక కార్యకర్తలను కూడా భాగస్వాముల చేస్తూ బాల కార్మికుల వ్యవస్థను రూపుమాపేందుకు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. బడి బయటే బాల్యం బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇది మున్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. పలు కుటుం బాలు ఆర్థిక స్థోమత, ఇళ్లలో ఉం టున్న ఇబ్బందులు మూలంగా పిల్లలను తిరిగి పనికి పంపుతున్నారు. వారిని పట్టుకుని ఇంటికి పంపిస్తున్నా వారు మళ్లీ్ల పనికి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. దీనితో బాలకార్మికులు అలాగే ఉండిపోతున్నారు. బాలలు కార్మికులుగా మారడానికి కారణాలు తెలుసుకుని వాటిని నిర్మూలించినప్పుడే బాలకార్మికులు మళ్లీ కార్మికులు మారకుండా బడికి వెళ్లడానికి సిద్ధపడతారు. కొందరు అనాథగా ఉన్న వారు సంరక్షణ కేంద్రాల్లో కొంతకాలం ఉంటున్నారు. వివిధ పరిస్థితుల ప్రభావంతో మళ్లీ అక్కడి నుంచి బయటపడి కార్మికులుగా మారుతున్నారు. మంచి లక్ష్యంతో ముందుకు సాగుతున్నా అయా శాఖల సమన్వయంతోనూ ఇబ్బందులు వస్తున్నాయి. పలు శాఖల భాగస్వామ్యం ఉన్నా కూడా పోలీస్, ఐసీడీసీఎస్ శాఖలు మాత్రమే బాధ్యతాయుతంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికైనా అన్ని శాఖల అధికారులు స్పందించి 30 రోజులు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్‌లో భాగస్వాములై బాల కార్మికులు లేకుండా చేసేందుకు ముందుకు సాగాలని ప్రజలు కోరుతున్నారు. -
సెక్స్ రాకెట్ : మరో ఆరుగురికి విముక్తి
సాక్షి, యాదగిరిగుట్ట : వ్యభిచార నిర్వాహకులు, బాలికల అక్రమ రవాణా ముఠా కలిసి సాగిస్తున్న చీకటి వ్యాపారానికి చెక్ పెట్టే దిశగా పోలీస్ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ‘ఆపరేషన్ ముస్కాన్’ పేరుతో వ్యభిచార గృహాలపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. వ్యభిచార ముఠా సభ్యుల చెరలో నుంచి బాలికలకు విముక్తి కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఆరుగురికి విముక్తి కలిగించారు. ఆలేరు రైల్వేస్టేషన్లో వ్యభిచార నిర్వహకుడి అరెస్ట్ చేశారు. రక్షించిన వారిలో ఇద్దరు యువతులు, నలుగురు బాలికలు ఉన్నారు. బాలికల అక్రమ రవాణాను పూర్తిగా నివారించేందుకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. -
మరో ఇద్దరి బాలికలకు విముక్తి ?
యాదగిరిగుట్ట(ఆలేరు) : యాదగిరిగుట్ట పట్ట ణంలో ఆపరేషన్ ముస్కాన్ ముమ్మరంగా కొనసాగుతోంది. చిన్నారుల అక్రమ రవాణా ముఠాతో పాటు ఇటీవల ఇళ్లు వదిలివెళ్లిన వ్యభిచార ని ర్వాహకులను పట్టుకునేందుకు పోలీస్‌శాఖ మూ డు టీంలుగా విడిపోయి గాలిస్తున్నట్లు తెలు స్తోంది. ఇందులో భాగంగానే రెండ్రోజుల క్రితం యాదగిరిగుట్టలోని గణేష్‌నగర్‌లో పోలీసులు చేసిన దాడుల్లో 10మంది వ్యభిచార నిర్వాహకులతో పాటు ఇద్దరు బాలికలు దొరికినట్లు సమాచారం. వీరిని విచారించిన పోలీసులు వారి వద్ద ఉన్న ఇద్దరి చిన్నారులను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారని తెలిసింది. ఇప్పటికే 15 మందికి విముక్తి.. గత నెల 30వ తేదీ నుంచి యాదగిరిగుట్ట పట్ట ణంలో కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్‌లో వ్యభిచార నిర్వాహకుల ముఠా సభ్యుల నుంచి ఇప్పటికే 15మంది చిన్నారులకు పోలీసులు వి ముక్తి కల్పించారు. తాజాగా శుక్రవారం మరో ఇద్దరి బాలికలను గుర్తించి నిర్వాహకుల నుంచి విముక్తి కల్పించి, భువనగిరిలో స్త్రీ, శిశు సంక్షేమ అధికారులకు అప్పగించారు. దీంతో వారిలో ఒకరిని ఆమనగల్‌లోని ప్రజ్వల హోంకి, మరొకరిని నల్లగొండకు తరలించినట్లు ఐసీడీఎస్ అధి కారులు తెలిపారు. చిన్నారులు ఎక్కడ దొరి కా రు. ఎప్పుడు దొరికారు అనే విషయాలపై అటు పోలీసులు, ఇటు ఐసీడీఎస్ అధికారులు నోరు విప్పడం లేదు. మూడు టీంలుగా గాలింపు బాలికలను వ్యభిచారం రొంపిలోకి దింపుతున్న గ్యాంగ్ సభ్యుల తాట తీయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో పోలీస్ శాఖ మూడు టీం లుగా ఏర్పడి వివిధ ప్రాంతాలకు వెళ్లి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే యాదగిరిగుట్ట పట్టణంలోని గణేష్‌నగర్‌తో పా టు ఇతర ప్రాంతాలను జల్లెడపడుతున్న పోలీ సులు.. ఇటీవల ఇళ్లను వదిలి వివిధ ప్రాంతాల కు వెళ్లిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. మొ న్నటి వరకు యాదగిరిగుట్టలో వ్యభిచారం నిర్వహించిన వారి బంధువులు ఎక్కడ ఉన్నారు.. వా రు ఇప్పుడు ఏ వృత్తిలో కొనసాగుతున్నారు.. అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిద్దిపేట, జగిత్యాల ప్రాంతాల్లో అక్కడి పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు చేసినట్లు తెలిసింది. ఈ రెండు ప్రాంతాలే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా పక్కా సమాచారంతో ఏకకాలంలో దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వ్యభిచార గృహ నిర్వాహకుల చెరల్లో ఉన్న బాలికలను రక్షించడమే ప్రధాన ధ్యేయంగా పోలీసులు అడుగు ముందుకు వేసి దర్యాప్తు ముమ్మరం చేశారనిపిస్తుంది. అంతేకాకుండా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో కొంతమంది వ్యభిచార నిర్వాహకులను శుక్రవారం రాత్రి విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీస్ కస్టడీకి నిందితులు భువనగిరి క్రైం : యాదగిరిగుట్టలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా పోలీసులకు పట్టుబడిన చిన్నారులు, వ్యభిచార నిర్వహకులను శుక్రవారం భువనగిరి ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయస్థానం వీరిని జ్యూడీషి యల్ కస్టడీ నుంచి మూడు రోజుల విచారణ నిమిత్తం పోలీస్‌కస్టడీకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
యాదగిరిగుట్టలో వెలుగులోకి వస్తున్న అరాచకాలు
-
యాదాద్రి విషవలయంపై కలెక్టర్ సమీక్ష
-
ఆపరేషన్ ముస్కాన్ ముమ్మరం
యాదగిరిగుట్ట(ఆలేరు) : ‘ఆపరేషన్ ముస్కాన్‌ను ముమ్మరం చేసి ముఠా సభ్యుల చెరలో నుంచి బాలికలకు విముక్తి కల్పిస్తున్నాం. ఇందులో భాగంగానే మరో ఆరుగురి సభ్యులను పట్టుకుని.. నలుగురి అమ్మాయిలను రక్షించాం. అంతేకాకుం డా బాలికల శారీరక ఎదుగుదలకు సంబంధించి ఇంజక్షన్లు ఇస్తున్న ఆర్ఎంపీని కూడా అరెస్టు చేశాం’ అని రాచకొండ డీసీపీ రాంచంద్రారెడ్డి తెలి పారు. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో గురువారం ముఠాకు సంబంధించిన వివరాలను ఏసీపీ శ్రీనివాసచార్యులు, టౌన్ సీఐ అశోక్‌కుమార్, రూరల్ సీఐ అంజనేయులుతో కలిసి వెల్లడించారు. రెండ్రోజులుగా గుట్టలోని వ్యభిచార గృహా లపై జరుగుతున్న దాడులను కొనసాగిస్తామని చెప్పారు. పిల్లల అక్రమ రవాణాలో భాగంగానే గత నెల 31వ తేదీన పరారీలో ఉన్న ముగ్గురు ముఠా సభ్యులతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి నలుగురు బా లికలను రక్షించామన్నారు. ఈ ఆపరేషన్ ప్రతి రోజు కొనసాగుతుందన్నారు. బాలికల అక్రమ రవాణాను పూర్తిగా నివారించేందుకు పోలీస్ శాఖ శ్రమిస్తుందన్నారు. వ్యభిచారాన్ని యాదగిరిగుట్టలో నిర్మూలించాలనే ధృఢ సంకల్పంతో పని చేస్తున్నామన్నారు. ముఠా వద్ద దొరి కిన అమ్మాయిలను వైద్య పరీక్షల కోసం చిల్డ్రన్ హోమ్స్‌కు పంపిస్తామని వెల్లడించారు. అరెస్టు చేసిన ముఠా సభ్యులు నాగలక్ష్మీ, కంసాని నరేష్, స్వప్న, కంసాని కుమారి, కంసాని రజిని, కంసాని ఎల్లయ్యలను కోర్టుకు పంపించి, ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా పీడీ యాక్టు పెడతా మన్నారు. 133 సెక్షన్ సీఆర్సీ ప్రకారంగా వారి ఇళ్లను కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఆర్ఎంపీ రిమాండ్ ఆపరేషన్లు అథారిటీ లేకుండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్‌కు విరుద్ధంగా పనిచేస్తున్న ఆర్ఎంపీ నర్సిం హను కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. ఆర్ఎంపీ వైద్యులు తమ పరిధి దాటి ఆపరేషన్లు చేయవద్దని, కేవలం వారు చే యాల్సిన చికిత్స మాత్రమే చేయాలని హెచ్చరిం చారు. రెండ్రోజులుగా బాలికలకు ఇస్తున్న హర్మో న్ గ్రోత్‌కు సంబంధించిన సుమారు 48 ఇంజిక్షన్లు ఆస్పత్రిల్లో లభించినట్లు డీసీపీ వెల్లడించారు. తమ పిల్లలే అంటూ.. పట్టుబడిన ముఠా.. బాలికలను తమ పిల్లలే అని చెబుతుంటారని, వారిపేరు మీద ఆధార్, రేషన్ కార్డులు సొంతంగా సృష్టించుకున్నారని తెలి పా రు. కృష్ణ అనే ఓ బ్రోకర్ పలు సందర్భాల్లో తమకు పిల్లలను ఇచ్చారని మరో మాట చెబుతున్నారని వెల్లడించారు. అంతేకాకుండా వ్యభిచారగృహాల్లో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు దాడులు చేసే క్రమంలో నిర్వాహకులు బాలికలు, మహిళలను దాచి పెట్టడానికి వారి ఇండ్లలో కొంత ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. గృహాల్లో చేసు కున్న రంధ్రాల్లో లేక బాక్స్‌టైప్ గది.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిర్మించుకుని దాచిపెడతారన్నా రు. ఇక్కడే కాకుండా వివిధ ప్రాంతాలకు వెళ్లి న ముఠాను కూడా త్వరలోనే పట్టుకుని వారి వద్ద ఉన్న చిన్నారులను కాపాడుతామన్నారు. రికార్డులను పరిశీలిస్తున్నాం ప్రజ్వల పాఠశాలలో దాదాపు 30మంది చదువుకుంటున్నారని, ఇందులో ఇప్పటికే కొందరికి తీసుకొచ్చామని, పాఠశాలలో ఉన్న రికార్డులను పరిశీ లించి, వారు ఎవరి పిల్లలు అనే అంశాలపై విచారణ కొనసాగిస్తామన్నారు. పిల్లలు ఎక్క డి నుంచి వచ్చారనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు. ఏవరైన తమ పిల్లలు తప్పిపోయి గతంలో కేసులు ఉంటే వారు వచ్చి పోలీస్ శాఖను సంప్రదిస్తే పిల్లల ద్వారా డీఎన్ఏ టెస్టులు జరిపి అప్పగిస్తామన్నారు. యాదాద్రిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరంతరం దాడులు కొనసాగిస్తామన్నారు. అనురాధ నర్సింగ్ హోంపై ఎస్ఓటీ దాడులుయాదగిరిగుట్టలోని అనురాధ నర్సింగ్‌హోంపై ఎస్ఓటీ(స్పెషల్ ఆపరేషన్ టీం) పోలీ సులు గు రువారం ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ సం దర్భంగా ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ, రాచకొండ సీపీ మహేష్‌భగవత్, ఎస్ ఓటీ ఓఎస్డీ రఫిక్ ఆదేశాలతో ఇటీవల వ్యభిచారగృహ నిర్వాహకుల వద్ద దొరికిన బాలికలకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు అనురాధ నర్సింగ్ హోంలో ఇస్తున్నారని సమాచారం ఇచ్చారని వెల్లడించారు. పక్కా సమాచారంతో దాడులు చేయగా ఇందులో 48 ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు దొరికాయని, అంతేకాకుండా శాంపిల్ మెడిసిన్స్ కూడా లభించాయని పేర్కొన్నారు. వీటితో పా టు సిజేరియన్, హెన్రియా, అబార్షన్ చేసినట్లు ఆస్పత్రిలో తెలిసిందన్నారు. ఆర్ఎంపీ నర్సిం హను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. -
తల్లిదండ్రుల వద్దకు వీధి బాలలు
విజయవంతంగా ‘ఆపరేషన్ ముస్కాన్’ సత్ఫలితాలిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారించి.. బాలల అప్పగింత హైదరాబాద్: ఇంటినుంచి పారిపోయి వీధి బాలలుగా మారిన చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు రా్రష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ సత్ఫలితాలిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో ఈ కార్యక్రమం అమలు బాధ్యతను మహిళా శిశు సంక్షేమ, పోలీసు శాఖలు సంయుక్తంగా చేపట్టాయి. రాష్ట్రంలోని పది జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్‌ల నిమిత్తం పోలీసు, కార్మిక, శిశు సంక్షేమ, విద్యా శాఖల నుంచి ఒక్కో అధికారి, స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థల నుంచి మరికొందరు సభ్యులుగా బృందాలను ఏర్పాటుచేశారు. ప్రధాన కూడళ్ల వద్ద భిక్షాటన చేస్తున్న వీధి బాలలు, కాగితాలు ఏరుకునే వారు, రైల్వే ఫ్లాట్‌ఫారాలపై ఉంటున్నవారు, దుకాణాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి.. వారందరినీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతి గృహాలకు తరలిస్తారు. బాలల నుంచి వారి స్వస్థలం, కుటుంబ వివరాలను సేకరించి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందజేస్తారు. ఆపై ఎవరైనా తామే తల్లిదండ్రులమని తగిన గుర్తింపు పత్రాలతో వస్తే.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)ల సమక్షంలో విచారించి బాలలను అప్పగిస్తారు. వారం రోజుల్లో 970 మంది పట్టివేత వారం రోజులుగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌లో బాలల పరిరక్షణ బృందాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 970 మంది బాలలను పట్టుకున్నారు. వీరిలో బాలకార్మికులే ఎక్కువమంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లో దొరికిన బాలలను ఆయా జిల్లా కేంద్రాల్లోని తాత్కాలిక వసతి గృహాల్లో ఉంచి, చదువు నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన బాలలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు అందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ ముస్కాన్‌ను ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని నిర్ణయించారు. ఆపరేషన్ ముస్కాన్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఐసీపీఎస్) నుంచి నిధులను కేటాయించారు.