సాక్షి, అమరావతి : డీజీపీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆపరేషన్ ముష్కాన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 690 టీమ్‌లు పాల్గొన్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, హోటళ్లు, థియేటర్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 1371 మంది వీధి బాలలను, బాల కార్మికులను గుర్తించిన పోలీసులు 286 మందిని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పి కౌన్సిలింగ్ ఇచ్చారు. మిగిలిన వారిని చైల్డ్ణ్ కేర్ హోమ్‌లకు తరలించారు. కాగా చైల్డ్‌లైన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో మిగిలిన బాల బాలికలను వారి ఇంటికి చేర్చుతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పిల్లలను బడికి పంపకుండా పనికి పంపితే చర్యలు తప్పవని తల్లిదండ్రులను హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment