ఆపరేషన్‌ ముస్కాన్‌ ముమ్మరం   | Operation Muskaan In Yadadri | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ ముస్కాన్‌ ముమ్మరం  

Published Fri, Aug 3 2018 2:52 PM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM

Operation Muskaan In Yadadri - Sakshi

పోలీసులు అరెస్ట్‌ చేసిన  ఆర్‌ఎంపీ డాక్టర్‌ నర్సింహ,ఆరుగురు నిందితులు,

యాదగిరిగుట్ట(ఆలేరు) : ‘ఆపరేషన్‌ ముస్కాన్‌ను ముమ్మరం చేసి ముఠా సభ్యుల చెరలో నుంచి  బాలికలకు విముక్తి కల్పిస్తున్నాం. ఇందులో భాగంగానే మరో ఆరుగురి సభ్యులను పట్టుకుని.. నలుగురి అమ్మాయిలను రక్షించాం. అంతేకాకుం డా బాలికల శారీరక ఎదుగుదలకు సంబంధించి ఇంజక్షన్లు ఇస్తున్న ఆర్‌ఎంపీని కూడా అరెస్టు చేశాం’ అని రాచకొండ డీసీపీ రాంచంద్రారెడ్డి తెలి పారు. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో గురువారం ముఠాకు సంబంధించిన వివరాలను ఏసీపీ శ్రీనివాసచార్యులు, టౌన్‌ సీఐ అశోక్‌కుమార్, రూరల్‌ సీఐ అంజనేయులుతో కలిసి వెల్లడించారు.

రెండ్రోజులుగా గుట్టలోని వ్యభిచార గృహా లపై జరుగుతున్న దాడులను కొనసాగిస్తామని చెప్పారు. పిల్లల అక్రమ రవాణాలో భాగంగానే గత నెల 31వ తేదీన పరారీలో ఉన్న ముగ్గురు ముఠా సభ్యులతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసి నలుగురు బా లికలను రక్షించామన్నారు. ఈ ఆపరేషన్‌ ప్రతి రోజు కొనసాగుతుందన్నారు. బాలికల అక్రమ రవాణాను పూర్తిగా నివారించేందుకు పోలీస్‌ శాఖ శ్రమిస్తుందన్నారు.

వ్యభిచారాన్ని యాదగిరిగుట్టలో నిర్మూలించాలనే ధృఢ సంకల్పంతో పని చేస్తున్నామన్నారు. ముఠా వద్ద దొరి కిన అమ్మాయిలను వైద్య పరీక్షల కోసం చిల్డ్రన్‌ హోమ్స్‌కు పంపిస్తామని వెల్లడించారు. అరెస్టు చేసిన ముఠా సభ్యులు నాగలక్ష్మీ, కంసాని నరేష్, స్వప్న, కంసాని కుమారి, కంసాని రజిని, కంసాని ఎల్లయ్యలను కోర్టుకు పంపించి, ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా పీడీ యాక్టు పెడతా మన్నారు. 133 సెక్షన్‌ సీఆర్‌సీ ప్రకారంగా వారి ఇళ్లను కూడా సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

ఆర్‌ఎంపీ రిమాండ్‌ 

ఆపరేషన్లు అథారిటీ లేకుండా, రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్‌కు విరుద్ధంగా పనిచేస్తున్న ఆర్‌ఎంపీ నర్సిం హను కూడా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. ఆర్‌ఎంపీ వైద్యులు తమ పరిధి దాటి ఆపరేషన్లు చేయవద్దని, కేవలం వారు చే యాల్సిన చికిత్స మాత్రమే చేయాలని హెచ్చరిం చారు. రెండ్రోజులుగా బాలికలకు ఇస్తున్న హర్మో న్‌ గ్రోత్‌కు సంబంధించిన సుమారు 48 ఇంజిక్షన్లు ఆస్పత్రిల్లో లభించినట్లు డీసీపీ వెల్లడించారు.  

తమ పిల్లలే అంటూ..

పట్టుబడిన ముఠా.. బాలికలను తమ పిల్లలే అని చెబుతుంటారని, వారిపేరు మీద ఆధార్, రేషన్‌ కార్డులు సొంతంగా సృష్టించుకున్నారని తెలి పా రు. కృష్ణ అనే ఓ బ్రోకర్‌ పలు సందర్భాల్లో తమకు పిల్లలను ఇచ్చారని మరో మాట చెబుతున్నారని వెల్లడించారు. అంతేకాకుండా వ్యభిచారగృహాల్లో పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు దాడులు చేసే క్రమంలో నిర్వాహకులు బాలికలు, మహిళలను దాచి పెట్టడానికి వారి ఇండ్లలో కొంత ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు.

గృహాల్లో చేసు కున్న రంధ్రాల్లో లేక బాక్స్‌టైప్‌  గది.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిర్మించుకుని దాచిపెడతారన్నా రు. ఇక్కడే కాకుండా వివిధ ప్రాంతాలకు వెళ్లి న ముఠాను కూడా త్వరలోనే పట్టుకుని వారి వద్ద ఉన్న చిన్నారులను కాపాడుతామన్నారు.

రికార్డులను పరిశీలిస్తున్నాం

ప్రజ్వల పాఠశాలలో దాదాపు 30మంది చదువుకుంటున్నారని, ఇందులో ఇప్పటికే కొందరికి తీసుకొచ్చామని, పాఠశాలలో ఉన్న రికార్డులను పరిశీ లించి, వారు ఎవరి పిల్లలు అనే అంశాలపై విచారణ కొనసాగిస్తామన్నారు. పిల్లలు ఎక్క డి నుంచి వచ్చారనే విషయాలు తెలియాల్సి ఉందన్నారు. ఏవరైన తమ పిల్లలు తప్పిపోయి గతంలో కేసులు ఉంటే వారు వచ్చి పోలీస్‌ శాఖను సంప్రదిస్తే పిల్లల ద్వారా డీఎన్‌ఏ టెస్టులు జరిపి అప్పగిస్తామన్నారు.

యాదాద్రిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరంతరం దాడులు కొనసాగిస్తామన్నారు.  అనురాధ నర్సింగ్‌ హోంపై ఎస్‌ఓటీ దాడులుయాదగిరిగుట్టలోని అనురాధ నర్సింగ్‌హోంపై ఎస్‌ఓటీ(స్పెషల్‌ ఆపరేషన్‌ టీం) పోలీ సులు గు రువారం ఆకస్మికంగా దాడులు చేశారు.

ఈ సం దర్భంగా ఎస్‌ఓటీ ఇన్స్‌పెక్టర్‌ గంగాధర్‌ మాట్లాడుతూ, రాచకొండ సీపీ మహేష్‌భగవత్, ఎస్‌ ఓటీ ఓఎస్డీ రఫిక్‌ ఆదేశాలతో ఇటీవల వ్యభిచారగృహ నిర్వాహకుల వద్ద దొరికిన బాలికలకు ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్లు అనురాధ నర్సింగ్‌ హోంలో ఇస్తున్నారని సమాచారం ఇచ్చారని వెల్లడించారు. పక్కా సమాచారంతో దాడులు చేయగా ఇందులో 48 ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్లు దొరికాయని, అంతేకాకుండా శాంపిల్‌ మెడిసిన్స్‌ కూడా లభించాయని పేర్కొన్నారు. వీటితో పా టు సిజేరియన్, హెన్రియా, అబార్షన్‌ చేసినట్లు ఆస్పత్రిలో తెలిసిందన్నారు. ఆర్‌ఎంపీ నర్సిం హను  అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement