
ఏపి రాజధానిపై వార్తలు నిజంకాదు: కేంద్ర హొం శాఖ
న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటుపై మాజీ ఐఏఎస్ అధికారి కె.సి.శివరామకృష్ణన్ నేతత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలుగా పేర్కొంటూ వస్తున్న వార్తలు నిజం కాదని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇవన్నీ ఈ కమిటీ గతంలో ఇచ్చిన మధ్యంతర నివేదికలోని అంశాలని ఆ వర్గాలు తెలిపాయి. శివరామకష్ణన్ కమిటీ బుధవారం సాయంత్రం నివేదిక ఇచ్చిన మాట వాస్తవమేనని ఆ వర్గాలు తెలిపాయి.
అయితే నివేదికను హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరిశీలనకు శుక్రవారం ఆయన ముందు అధికారులు పెడతారని ఆ వర్గాలు వెల్లడించాయి. హోంమంత్రి పరిశీలన అయిన తరువాత అంటే శుక్రవారం గానీ, శనివారం గానీ హోం శాఖ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయనున్నట్లు ఆ వర్గాలు వివరించాయి.