విభజనతో ఏపీకి తీవ్ర నష్టం | CM Jagan direction to officials On Central Home Ministry Meeting | Sakshi
Sakshi News home page

విభజనతో ఏపీకి తీవ్ర నష్టం

Published Tue, Nov 21 2023 5:04 AM | Last Updated on Tue, Nov 21 2023 8:22 AM

CM Jagan direction to officials On Central Home Ministry Meeting - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నా­యని, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభు­త్వానిదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఢిల్లీలో రాష్ట్ర ఉన్నతాధి­కారులతో సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.­జవహర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధి­కారులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాల­యంలో సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారుకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..

పోలవరం, ప్రత్యేక హోదా ప్రస్తావించండి
అప్పుల్లో 58% ఏపీకి, 42% తెలంగాణకు కేటా­యించారు. కానీ రెవెన్యూ పరంగా 58% తెలంగాణకు, 42% ఏపీకి వచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయి. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు, పోలవరానికి నిధుల రాకలో సమస్యలున్నాయి. తెలంగాణ నుంచి రావా­ల్సిన విద్యుత్‌ బకాయిలూ రాలేదు. మరి విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏవిధంగా బయ­టకు రాగలు­గు­తుంది. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టండి. ఇతర రాష్ట్రాలతో  పోలి­స్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరముంది.

అప్పుడే విభజన నష్టాల నుంచి గట్టెక్కగలుగుతుంది. విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే కదా విభజన చట్టంలో హామీలిచ్చారు. హైదరాబాద్‌ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్థల పరంగా ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కోల్పోయాం. దీని­వల్ల రాష్ట్రానికి రెవెన్యూ రూపంలో చాలా నష్టపో­యాం. దీన్ని సర్దుబాటుచేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాల మౌలిక సదుపా­యా­ల ఏర్పాటుకు కేంద్రం హామీలిచ్చింది.

విభజన చ­ట్టంలో ఉన్న స్ఫూ­ర్తి ఇప్పుడు అమల్లో కూడా కనిపించాల్సిన అవసర ముంది. ఇవి నెరవేరితే ఏపీలో వసతులు సమకూరి వ్యాపార, వా­ణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. రెవె­న్యూ క్రమంగా పెరుగుతూ వస్తుంది. రాష్ట్రం పురోగ­మిస్తేనే దేశం కూడా పురోగమిస్తుంది. 

కడప స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలి
కొత్తగా సెంట్రల్‌ అగ్రికల్చర్‌ వర్సిటీని కోరు­తున్నాం. కచ్చితంగా ఇది వచ్చేలా చర్యలు తీసు­కోవాలి. దుగరా­జç­³ట్నం పోర్టు నిర్మాణం, కడపలో స్టీల్‌ప్లాంట్‌­పై కేంద్రం హామీ ఇచ్చింది. స్టీల్‌ ప్లాంటుకు సమీపంలోని ఎన్‌ఎండీసీ నుంచి గనులు కేటాయించాలి. దీంతో ప్ర­తి­పాదిత స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి మార్గం సుల­భ­మ­వుతుంది. వీటకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి.

భోగాపురం ఎయిర్‌పోర్టు రోడ్డును ప్రస్తావించండి
విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులను అంత­ర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తామ­న్నారు. విశాఖలో నేవీ కార్యకలాపాల వల్ల పౌరవి­మానాలకు ఇబ్బంది వస్తోంది. దీంతో ఎయిర్‌ పో­ర్టును వేరేచోటకు బదిలీచేయాల్సిన అవసరం ఏర్ప­డింది. ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌­పోర్టును నిర్మిస్తు­న్నారు. దీనికి కనెక్టివిటీ చాలా ముఖ్యం.

మంచి ర­హదారి ఏర్పాటుకు కేంద్రం ఇతోధికంగా సహా­యం అందించాలి. విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎ­యిర్‌పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంపై కేంద్రంతో జరుగుతున్న సమావేశంలో ప్రత్యేక శ్ర­ద్ధ పెట్టాలి. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విజయ­వాడ లాంటి ఎయిర్‌ పోర్టుల్లోనూ భూ సేకరణ ఖర్చులను రాష్ట్రమే భరించాల్సి వస్తోంది. 

విశాఖ మెట్రో రైలుపై ఒత్తిడి తెండి
విశాఖ మెట్రో రైలు అంశాన్ని కూడా కొలిక్కి తీసుకు­రావాలి. ప్రైవేట్‌ డెవలపర్‌ 60% భరిస్తున్నందున, భూ సేకరణ సహా మిగిలిన 40% కేంద్రం భరించే­లా ఒత్తిడి తీసుకురావాలి. 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన పెండింగ్‌లో ఉంది. దీనికోసం ఒత్తిడి తీసు­కురావాలి. పలు బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టిపెట్టాలి. 

విశాఖ నుంచి రాయలసీమకు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కావాలి 
విశాఖ నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్ల కోసం హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. విశాఖ–వయా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి. దీనివల్ల 3 ప్రాంతాల మధ్య రాకపోకలు సులభమవుతాయి. విశాఖ రైల్వే జోన్‌ అంశంపై కూడా దృష్టిపెట్టాలి.

మూడు ప్రాంతాల అభివృద్ధికి సాయాన్ని కోరాలి
అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించాం. ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత. మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పలు రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం. దీనికోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement