State Partition Act
-
విభజన చట్టంలోని అంశాలను త్వరగా అమలు చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను త్వరగా అమలు చేయాలని పలు కేంద్ర ప్రభుత్వ శాఖలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా చెప్పారు. విభజన చట్టం 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల అమలు పురోగతిపై అజయ్ భల్లా అధ్యక్షతన ఢిల్లీలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంబంధిత కేంద్ర శాఖల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కె.ఎస్.జవహర్ రెడ్డి, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో అజయ్ భల్లా మాట్లాడుతూ.. 13వ షెడ్యూల్లోని అంశాల అమలులో ఏమైనా మినహాయింపులు అవసరమైతే కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురావాలని చెప్పారు. పోర్టులు లాంటి ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేసిన అంశాలను ఈ సమావేశంలో సీఎస్ జవహర్‌రెడ్డి వివరించారు. వాటిని త్వరగా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కోరినవివీ.. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు పీపీపీ విధానంలో చేపడతామని, ప్రైవేట్ డెవలపర్ 60 శాతం భరిస్తున్నందున వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం 40 శాతం గ్రాంట్‌గా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ప్రతిపాదనను కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయాలని కేంద్ర హోంశాఖను కోరింది. సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మంజూరు చేయాలని, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై త్వరగా నిర్ణయం తీసుకుని అమలు చేయాలని చెప్పింది. విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే హై స్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు, మూడు ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర సాయం తదితర అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సమావేశంలో ప్రస్తావించింది. ఈ అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా్ల సానుకూలంగా స్పందించారు. -
విభజనతో ఏపీకి తీవ్ర నష్టం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయని, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఢిల్లీలో రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారుకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. పోలవరం, ప్రత్యేక హోదా ప్రస్తావించండి అప్పుల్లో 58% ఏపీకి, 42% తెలంగాణకు కేటాయించారు. కానీ రెవెన్యూ పరంగా 58% తెలంగాణకు, 42% ఏపీకి వచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయి. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు, పోలవరానికి నిధుల రాకలో సమస్యలున్నాయి. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలూ రాలేదు. మరి విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏవిధంగా బయటకు రాగలుగుతుంది. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టండి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరముంది. అప్పుడే విభజన నష్టాల నుంచి గట్టెక్కగలుగుతుంది. విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే కదా విభజన చట్టంలో హామీలిచ్చారు. హైదరాబాద్ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్థల పరంగా ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కోల్పోయాం. దీనివల్ల రాష్ట్రానికి రెవెన్యూ రూపంలో చాలా నష్టపోయాం. దీన్ని సర్దుబాటుచేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కేంద్రం హామీలిచ్చింది. విభజన చట్టంలో ఉన్న స్ఫూర్తి ఇప్పుడు అమల్లో కూడా కనిపించాల్సిన అవసర ముంది. ఇవి నెరవేరితే ఏపీలో వసతులు సమకూరి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. రెవెన్యూ క్రమంగా పెరుగుతూ వస్తుంది. రాష్ట్రం పురోగమిస్తేనే దేశం కూడా పురోగమిస్తుంది. కడప స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలి కొత్తగా సెంట్రల్ అగ్రికల్చర్ వర్సిటీని కోరుతున్నాం. కచ్చితంగా ఇది వచ్చేలా చర్యలు తీసుకోవాలి. దుగరాజç³ట్నం పోర్టు నిర్మాణం, కడపలో స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం హామీ ఇచ్చింది. స్టీల్ ప్లాంటుకు సమీపంలోని ఎన్ఎండీసీ నుంచి గనులు కేటాయించాలి. దీంతో ప్రతిపాదిత స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మార్గం సులభమవుతుంది. వీటకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. భోగాపురం ఎయిర్‌పోర్టు రోడ్డును ప్రస్తావించండి విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తామన్నారు. విశాఖలో నేవీ కార్యకలాపాల వల్ల పౌరవిమానాలకు ఇబ్బంది వస్తోంది. దీంతో ఎయిర్ పోర్టును వేరేచోటకు బదిలీచేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నారు. దీనికి కనెక్టివిటీ చాలా ముఖ్యం. మంచి రహదారి ఏర్పాటుకు కేంద్రం ఇతోధికంగా సహాయం అందించాలి. విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంపై కేంద్రంతో జరుగుతున్న సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడ లాంటి ఎయిర్ పోర్టుల్లోనూ భూ సేకరణ ఖర్చులను రాష్ట్రమే భరించాల్సి వస్తోంది. విశాఖ మెట్రో రైలుపై ఒత్తిడి తెండి విశాఖ మెట్రో రైలు అంశాన్ని కూడా కొలిక్కి తీసుకురావాలి. ప్రైవేట్ డెవలపర్ 60% భరిస్తున్నందున, భూ సేకరణ సహా మిగిలిన 40% కేంద్రం భరించేలా ఒత్తిడి తీసుకురావాలి. 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన పెండింగ్‌లో ఉంది. దీనికోసం ఒత్తిడి తీసుకురావాలి. పలు బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టిపెట్టాలి. విశాఖ నుంచి రాయలసీమకు హైస్పీడ్ రైల్ కారిడార్ కావాలి విశాఖ నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్ల కోసం హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. విశాఖ–వయా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి. దీనివల్ల 3 ప్రాంతాల మధ్య రాకపోకలు సులభమవుతాయి. విశాఖ రైల్వే జోన్ అంశంపై కూడా దృష్టిపెట్టాలి. మూడు ప్రాంతాల అభివృద్ధికి సాయాన్ని కోరాలి అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించాం. ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత. మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పలు రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం. దీనికోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలి. -
వచ్చేవారం పోలవరంపై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు, పార్టీ ఫిరాయింపులపై పార్లమెంటు ఉభయసభల్లో చర్చను కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వంగా గీత శుక్రవారం ఈమేరకు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం తాము ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా చర్చకు పట్టుపట్టుతూ తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు. వివిధ పక్షాల ఆందోళనలతో ఉభయ సభలు పలుమార్లు వెంటవెంటనే వాయిదాపడ్డాయి. ఆయా అంశాలపై వచ్చేవారం చర్చకు అనుమతిస్తామని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారని సభ అనంతరం మీడియా సమావేశంలో ఎంపీలు వెల్లడించారు. రాజ్యసభలో.. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధుల విడుదలపై జరుగుతున్న జాప్యంపై చర్చకు అనుమతించాలంటూ రూల్ 267 కింద వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలును అనుసరించి పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు అనుమతించాలని రూల్ 267 కింద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నోటీసు ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 90(1) ప్రకారం పోలవరం సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2022 ఖరీఫ్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను జలశక్తిశాఖ సాంకేతిక కమిటీ ఆమోదించినా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.1,917 కోట్లు ఇంకా రీయింబర్స్ చేయకపోవడం, ఇతరత్రా అంశాల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతోంది’ అని పేర్కొంటూ శుక్రవారం సభ కార్యకలాపాలు రద్దుచేసి ఈ అంశంపై చర్చ చేపట్టాలని ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసులో పేర్కొన్నారు. ‘ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండాలి. ఎవరైనా చట్ట సభ్యుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ.. ఏ గుర్తుపై పోటీచేసి గెలిచారో ఆ పార్టీ అధినేతపై విమర్శలు చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య సూత్రాలను అణగదొక్కడం వంటిదే. సదరు సభ్యుడు ఎన్నికల అనంతరం ప్రజాస్వామ్య సూత్రాలను దుర్వినియోగం చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సభాపతి లేదా చైర్మన్‌కు సదరు సభ్యుడిపై అనర్హత వేటు వేయాలని మెమొరాండం, పిటిషన్ ఇచ్చి కోరితే దానిపై నిర్ణయం తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో సభలో ఈ అంశంపై ఎలాంటి ఆలస్యం చేయకుండా చర్చించాలి’ అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తాను ఇచ్చిన నోటీసులో కోరారు. లోక్‌సభలో.. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై రూల్ 193 కింద స్వల్పకాలిక చర్చ కోరుతూ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి నోటీసు ఇచ్చారు. అయితే శుక్రవారం ఉభయసభలు వివిధ పక్షాల ఆందోళనతో పలుమార్లు వాయిదాపడ్డాయి. కేంద్రప్రభుత్వం వ్యాపారసంస్థలా వ్యవహరించరాదు వైఎస్సార్సీపీ ఎంపీలు బోస్, గీత, సురేశ్, అనూరాధ, సత్యవతి, మాధవి పార్లమెంటు ఉభయసభల్లోను వచ్చే వారంలో పోలవరంపై చర్చ జరగనుందని వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు. పోలవరంపై చర్చకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అంగీకరించారని చెప్పారు. న్యూఢిల్లీలోని విజయ్‌చౌక్‌లో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వంగా గీత, నందిగం సురేశ్, చింతా అనూరాధ, బి.వి.సత్యవతి, గొడ్డేటి మాధవి మీడియాతో మాట్లాడారు. పోలవరంపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతోందని సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అన్న విషయం కేంద్రం మరిచినట్టు ఉందన్నారు. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, సవరించిన అంచనాల ప్రకారం నిధుల విడుదల్లో జరుగుతున్న జాప్యంపై ఇటు రాజ్యసభలోను, అటు లోక్సభలోను చర్చకు అనుమతి కోరుతూ నోటీసులు ఇచ్చాం. పోలవరంపై చర్చకు రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కూడా అంగీకరించారు. విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయస్థాయి హోదా ఉన్న ప్రాజెక్టు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోతున్నట్టు ఉంది. పోలవరానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని పెండింగ్‌లో పెట్టడం చాలా దురదృష్టకరమైన అంశం. తక్షణమే ప్రాజెక్టుకు సవరించిన అంచనా నిధులు విడుదల చేయాలి. సవరించిన అంచనా ప్రకారం రూ.55,656.87 కోట్లు విడుదల చేసే అంశం, రెండేళ్లకు పైగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయాల్సిన పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం, ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి అడుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వచ్చినప్పుడల్లా కేంద్రం దృష్టికి నిధుల సమస్యను తీసుకెళుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. లోక్‌సభలో పార్టీ పక్షనేత మిథున్‌రెడ్డి, రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పలుసార్లు సంబంధిత మంత్రులను కలిసి వివరించినప్పటికీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం చాలా దురదృష్టకరం. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను ఆమోదించమని, టెక్నికల్ కమిటీ, సీడబ్ల్యూసీ, పీపీఏ ఆమోదం తెలిపి సంవత్సరాలు గడుస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ పోలవరంపై సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా నిధులను కూడా కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖ నగరానికి, విశాఖపట్నం పరిసర గ్రామాలకు మంచినీరు సరఫరాకు సంబంధించిన పనులకు దాదాపు రూ.4 వేల కోట్ల నిధులు ఇవ్వం, కేవలం సాగునీటికే ఇస్తాం అని కేంద్రం అనడం తప్పు. ఈ విషయాన్ని పలుసార్లు ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ప్రభుత్వాలు అనేవి లాభాలతో నడిచే సంస్థలు కాదు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి సహాయ, సహకారం చేసే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఏదో వ్యాపారసంస్థల్లా చేయడం మంచిది కాదు. పోలవరం ప్రాజెక్టులో అతి ప్రధానమైనవి ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ. ఇవన్నీ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే రోజుకి కేంద్రం క్లియర్ చెయ్యాలి. అప్పుడే పోలవరం ప్రాజెక్టును సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఖరీఫ్ 2022 కల్లా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రైతుల ప్రయోజనార్థం ప్రాజెక్టు నుంచి వచ్చే ఖరీఫ్‌లో నీళ్లు ఇస్తామని మాట కూడా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అడ్మినిస్టేటివ్ ఆఫీసు పోలవరం ప్రాజెక్టుకు ఎక్కడో దూరంగా హైదరాబాద్‌లో ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో పెట్టాలని కేంద్రాన్ని కోరాం’ అని పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. పోలవరం నిర్వాసితులకు తక్షణం పునరావాసం కల్పించాలి ఎంపీ వంగా గీత మాట్లాడుతూ అనేక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరానికి జీవం పోసి ఓ రూపాన్ని ఇచ్చారని చెప్పారు. విభజన చట్టంలో భాగంగా> పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 15–17 సార్లు కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తులు చేసినా పోలవరం నిధుల విడుదలపై జాప్యం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి గిరిజనుల మీద ప్రేమ లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు తక్షణమే పునరావాసం కల్పించాలని ఆమె డిమాండు చేశారు. తిరుపతి బహిరంగసభలో ప్రధాని మోదీ ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంట్ సాక్షిగా ఒక ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఇంతవరకు నెరవేరలేదని, పార్లమెంట్లో ఇచ్చిన హామీకే విలువ లేకపోతే ప్రజాస్వామ్యానికే విలువ లేనట్లని పేర్కొన్నారు. ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరికాదని, ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయకుండా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలు, రైతుల తరఫున రోజూ పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. -
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాంరాం!
సాక్షి, న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో పరోక్షంగా స్పష్టతనిచ్చారు. విభజన చట్టంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఈ అంశాన్ని చేర్చిన వారు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించారా.. ఏ రకంగా ఈ అంశాన్ని చేర్చారనేది వారినే అడగాలని సూచించారు. బుధవారం రాజ్యసభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడిన కేంద్రమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో ఉన్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అంతకుముందు చర్చలో భాగంగా మాట్లాడిన టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కేంద్రానికి అనేకసార్లు వినతి పత్రాలు అందించామని రైల్వే శాఖ మంత్రికి గుర్తుచేశారు. ప్రస్తుతం భారతీయ రైల్వే వద్ద అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇలాంటి సమయంలో ఎంతో కష్టపడి సంపాదించి పన్నుల రూపంలో కట్టిన డబ్బును అవసరమున్న చోట వెచ్చించాలే తప్ప అనవసరంగా వృథా చేయొద్దని రైల్వే మంత్రి పేర్కొన్నారు. కోచ్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలు ఇప్పుడు దేశంలో పూర్తిస్థాయిలో ఉన్నాయని తెలిపారు. భారీగా పెరిగిన ఎల్‌హెచ్‌పీ కోచ్‌లు 2014లో తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రైల్వే శాఖలో నాణ్యమైన ఎల్‌హెచ్‌పీ కోచ్‌ల సంఖ్య 2,500 కంటే తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 25 వేలకు చేర్చామని చెప్పారు. 2018లో తమ ప్రభుత్వం ఐసీఎఫ్ కోచ్‌ల తయారీని పూర్తిగా నిలిపేసిందని పేర్కొన్నారు. 2014 వరకు రాయ్‌బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీలో కనీసం ఒక్క కోచ్‌ను కూడా తయారు చేయలేదని, 2018లో ప్రధాని నరేంద్రమోదీ కోచ్ ఫ్యాక్టరీ పర్యటన తర్వాత కోచ్‌లు రెట్టింపు స్థాయిలో సిద్ధమవుతున్నాయని తెలిపారు. -
తెలుగుజాతిపై యుద్ధం చేస్తారా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే బీజేపీ తమపై ఎదురుదాడి చేస్తామంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. న్యాయం చేయమని అడిగితే యుద్ధం చేస్తారా? అని ప్రశ్నించారు. ఎవరిపై యుద్ధం చేస్తారు, తెలుగుజాతిపై చేస్తారా? అని అన్నారు. ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు మాట్లాడారు. తెలుగుజాతికి ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని ఇచ్చారని, తాను ఆత్మవిశ్వాసాన్ని ఇస్తానని చెప్పారు. జపాన్ తరహాలో అభివృద్ధి చేసుకుంటూనే పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను బలహీనపడితే రాష్ట్రం బలహీనపడుతుందని పేర్కొన్నారు. తమిళనాడులో చేసినట్లు ఇక్కడా చేయాలని చేస్తున్నారని, ఇక్కడ తమిళనాడు తరహా రాజకీయాలు జరగనివ్వబోనని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం ప్యాకేజీతోపాటు ప్రత్యేక హోదా ఇచ్చేదాకా తమ పోరాటం ఆగదన్నారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదని ఆరోపించారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. ఈ సంవత్సరం సాధారణ పంచాంగంతోపాటు పోలవరం పంచాంగం, ఉద్యానవన పంచాంగం కూడా విడుదల చేశామన్నారు. ఒడిదుడుకులుంటాయి: సుబ్రహ్మణ్యశర్మ ఉగాది వేడుకల్లో రాజమండ్రికి చెందిన డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్యశర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం స్థిరంగా స్వతంత్రంగా నిలబడుతుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల మధ్య సంబంధాలు పాలకుల వ్యక్తిత్వాలను బట్టి ఉంటాయన్నారు. ఈ ఏడాది శుభ ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. పంట సాగుకు అను కూలంగా మంచి వర్షాలు కురుస్తాయన్నారు. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ రూపొందించిన వ్యవసాయ పంచాంగాన్ని రావూరి వెంకటసాయి వరప్రసాద్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 47 కళారత్న, 99 ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, జయప్రకాశ్ తదితరులకు హంస అవార్డులను అందించారు. టీటీడీ, వ్యవసాయ, ఉద్యానవన, పోలవరం పంచాంగాలను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి తన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్‡్షతో కలిసి వచ్చారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. -
ముగిసిన విద్యుత్ బంధం!
ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ పంపకాలు బంద్ సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ బంధం పూర్తిగా తెగిపోయింది. విద్యుత్ వాటాల పంపకాల ప్రకారం తెలంగాణకు సరఫరా చేయాల్సిన విద్యుత్‌ను ఏపీ శనివారమే నిలిపివేయగా, ఆదివారం తెల్లవారుజాము నుంచి తెలంగాణ సైతం ఏపీ వాటా సరఫరాను నిలుపుదల చేసింది. విద్యుత్ పంపకాలకు సంబంధించిన రూ. 3,139 కోట్ల బకాయిలు చెల్లిం చలేదని తెలంగాణకు ఏపీ విద్యుత్ సంస్థలు విద్యుత్ సరఫరాను నిలిపివేయగా, ఏపీ నుంచే రూ. 1,676.46 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని పేర్కొంటూ తెలంగాణ సైతం ఏపీకి విద్యుత్ వాటాల పంపకాలను నిలిపివేసింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని జెన్కో విద్యుత్ ప్లాంట్ల నుంచి తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్ వాటాలున్నాయి. మూడేళ్ల పాటు రెండు రాష్ట్రాలు థర్మల్ విద్యుత్‌లో వాటాలు పంచుకోగా, తాజాగా ఈ పంపకాలకు బ్రేక్ పడినట్లు అయింది.