
దిగ్విజయ్ క్షమాపణ చెప్పాలి: నాయిని
తెలంగాణ పోలీసులపై అను చిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వెంటనే క్షమాపణ
సాక్షి, భూపాలపల్లి: తెలంగాణ పోలీసులపై అను చిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీస్‌స్టేషన్ నూతన భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ రాష్ట్ర పోలీసుల పనితీరు బాగుందని ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ప్రశంసించారన్నారు.
ఈ సమ యంలో రాష్ట్ర పోలీసుల ప్రతిష్ట దెబ్బ తీసేలా దిగ్విజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని హోంమంత్రి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ను రద్దు చేయలేదని నాయిని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నూటికి నూరుశాతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు.