‘దుగరాజపట్నం’ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం | We are committed to the development of "Dugarajapatnam" | Sakshi
Sakshi News home page

‘దుగరాజపట్నం’ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

Published Tue, Mar 15 2016 2:33 AM | Last Updated on Wed, Apr 3 2019 8:42 PM

‘దుగరాజపట్నం’ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం - Sakshi

‘దుగరాజపట్నం’ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

రాష్ర్టంలో దుగరాజపట్నం పోర్టును అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్న ట్లు కేంద్రం స్పష్టం చేసింది.

భూ సేకరణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి: గడ్కారీ

 న్యూఢిల్లీ: రాష్ర్టంలో దుగరాజపట్నం పోర్టును అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్న ట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీనికి అవసరమైన 5,100 ఎకరాల భూమిని సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం కోరినట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. భూ సేకరణకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే.. పోర్టు నిర్మాణాన్ని కేంద్రం చేపడుతుందని ఆయన వెల్లడించారు.

ఏపీ శాసనసభ ఆమోదించిన మారిటైమ్ బోర్డు బిల్ 2015 బిల్లు ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చేరిందని గడ్కారీ తెలిపారు. పోర్టు మొదటి దశ పనులు 2018 నాటికి పూర్తి కావాలని, కానీ ఇప్పటివరకు పురోగతి లేదన్న విషయాన్ని కాంగ్రెస్ నేత అలీ ఖాన్ లేవనెత్తడంతో ఆయన సమాధానమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement