రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల విభజనకు సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక సిద్ధమైంది.
న్యూఢిల్లీ : రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల విభజనకు సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక సిద్ధమైంది. సిన్హా కమిటీ పరిశీలించి రాష్ట్రం ప్రభుత్వం సమర్పించిన నివేదికను ప్రధానమంత్రి ఆమోదానికి పంపారు. కాగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నుంచి... కేంద్రం పరోక్షంగా ఆప్షన్స్ తీసుకున్నది.
ప్రస్తుతం రాష్ట్రంలో 376 ఐఎఎస్ కేడర్ పోస్టులు ఉండగా 296 మంది అధికారులు మాత్ర మే విధుల్లో ఉన్నారు. మిగితా 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఐపిఎస్ అధికారులకు సంబంధించి 258 పోస్టులు ఉండగా 207 మంది మాత్రమే ఉన్నారు. 51 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఎఫ్‌ఎస్ పోస్టులు 149 ఉండగా 123 మంది మాత్రమే ఉన్నారు.
మిగితా 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఎఎస్, ఐపిఎస్ పోస్టుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తక్కువగా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఎఎస్‌లను తెలంగాణకు బదిలీ చేయాల్సి ఉంటుందని విభజన కమిటీ సూచించింది.ఆప్షన్ల విధానాన్ని తమకే వదిలేయాలని కొంతమంది ఐఎఎస్, ఐపిఎస్, ఐఫ్‌ఎస్ అధికారులు నేరుగా ప్రత్యూష్ సిన్హా కమిటీకి విజ్ఞప్తి చేశారు