bifurcation act
-
13వ షెడ్యూల్‌పై ముగిసిన సమీక్షా సమావేశం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల అమలుకు సంబంధించి ఈరోజు(మంగళవారం)ఢిల్లీ వేదికగా జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన సమావేశంలో 13వ షెడ్యూల్లోని విద్యా సంస్తలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వ సీఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు శ్రీలక్ష్మి, ప్రేమ చంద్రరెడ్డి, ప్రేమ చంద్రరెడ్డి, ఎస్ఎస్ రావత్, యువరాజ్లు హాజరయ్యారు. -
ఆ అధికారం ఉందా?.. జమ్ము విభజనపై సుప్రీం
ఢిల్లీ: ఉగ్రవాదం, వేర్పాటువాదం లాంటివి కేవలం జమ్ము కశ్మీర్‌కే పరిమితం కాలేదు. పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు సహా చాలా రాష్ట్రాలు ఆ తరహా పీడిత రాష్ట్రాలేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై విచారణ సందర్భంగా.. జమ్ము కశ్మీర్ విభజనపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. ‘‘జమ్ము కశ్మీర్‌ను 2019లో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినట్లే.. ఇరత రాష్ట్రాలనూ కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించే అధికారం పార్లమెంట్‌కు, కేంద్రానికి ఉంటుందా?’’ అని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనికి కేంద్రం తరపున వాదనలు వినిపించిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇవ్వగా.. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జోక్యం చేసుకున్నారు. జమ్ము కశ్మీర్‌లోనే కాదు.. పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ జమ్ము తరహా పరిస్థితులు చూస్తున్నాం కదా అని అన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ గవాయి సైతం మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్లను ప్రశ్నించారు. కేవలం సరిహద్దు రాష్ట్రం గనుకే ప్రత్యేకంగా భావించాం గనుకే విభజించాం అనే సమాధానం ఇవ్వకండి అంటూ జస్టిస్ కౌల్ అసహనం ప్రదర్శించారాయన. అయితే.. దశాబ్దాల కాలం నుంచి జమ్ము ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటోందని. పైగా పీవోకేతో సరిహద్దు పంచుకుంటోందని, జమ్ము విషయంలో కేంద్రం తొందరపాటు ప్రదర్శించలేదు. విధానాల పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకుందని. ఒకవేళ గుజరాతో, మధ్యప్రదేశ్‌లను విభజించాల్సి వస్తే.. అప్పుడు ప్రామాణికాలు వేరుగా ఉంటాయని సాలిసిటర్ జనరల్ బెంచ్‌కు వివరించారు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కలగజేసుకుని.. ‘‘ఒక రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అంగీకరించిన తర్వాత.. ఆ అధికార దుర్వినియోగం చేయకుండా ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కేంద్రానికో.. లేదంటే పార్లమెంట్‌కో.. ఇప్పుడున్న ప్రతీ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగానో.. విభజన చేయగల అధికారమో ఉందా? అని ప్రశ్నించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 విషయంలో రాజ్యాంగ పరిషత్(పార్లమెంట్) పాత్ర కేవలం సిఫార్సు పాత్రను కలిగి ఉంటుంది. అలాగని అది రాష్ట్రపతి అధికారాలను భర్తీ చేసేదిగా ఉండకూడదు అని రాజ్యంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక.. జమ్ము కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోరగా.. సెప్టెంబర్ 1వ తేదీన ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని కేంద్రం, కోర్టుకు తెలియజేసింది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం అప్పట్లో పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంతం అనేది శాశ్వతం కాదు -
ఏపీ విభజన చట్టంలోని ఆస్తుల విభజన ఆలస్యంపై సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: ఏపీ విభజన చట్టంలోని ఆస్తుల విభజన ఆలస్యంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రూ.లక్షన్నర కోట్లకు పైగా ఆస్తుల విభజనపై తెలంగాణ తేల్చకపోవడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. జస్టిస్ జె.కే. మహేశ్వరి, జస్టిస్ సుందరేషన్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. విభజన చట్టం ప్రకారం ఆస్తులలో ఏపీకి 58% తెలంగాణకు 42 శాతం వాటా దక్కాలని, ఆస్తుల విభజనపై అవసరమైతే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమించాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. దీంతో ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటి అని సుప్రీంకోర్టు అడిగింది. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే దీనిపై తగిన సూచనలు తీసుకుంటామని కేంద్ర తరఫు న్యాయవాది నటరాజన్ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. అనంతరం ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత రెండు వారాల్లో రీజైండర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై నెలాఖరుకు వాయిదా వేసింది. చదవండి: ఉద్ధవ్‌ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు -
దక్షిణాదిన తలసరి ఆదాయంలో దూసుకుపోతున్న ఏపీ: ఆర్బీఐ గణాంకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదో సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ సందర్భంగా దేశ ఆర్థికాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల కృషి, వాటి వాటాపై సంతోషకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం తోటి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగంలో ముందుకు దూసుకుపోతోంది. 2014 ఫిబ్రవరి-జూన్ మాసాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఫలితంగా అనేక రకాలుగా అననుకూల పరిస్థితులు ఎదుర్కొన్న నవ్యాంధ్ర ప్రదేశ్ ఆర్థిక పనితీరు సంతృప్తికరంగా ఉంది. అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై స్థాయి మెట్రోపాలిటన్ నగరం రాజధానిగా లేనప్పటికీ ఏపీ గణనీయమైన స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) సాధించిందని ఈ గణాంకాలు వివరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ రూ.13.2 లక్షల కోట్లు. పారిశ్రామికంగా, విద్య, సామాజిక రంగాల్లో మొదటి నుంచీ ముందున్న తమిళనాడు రూ.24.8 లక్షల కోట్ల జీఎస్డీపీ సాధించగా, తర్వాత కర్ణాటక రూ.22.4 లక్షల కోట్లు, తెలంగాణ రూ.13.3 లక్షల కోట్లు, కేరళ రూ.కేరళ రూ. 10 లక్షల కోట్లతో ముందుకు సాగుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం 9 సంవత్సరాల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల జీఎస్డీపీలను కలిపితే రూ.26.5 లక్షల కోట్లు అవుతుంది. అంటే ఒకవేళ రాష్ట్ర విభజన జరిగి ఉండకపోతే– జీఎస్టీడీపీ విషయంలో తమిళనాడు కన్నా ఉమ్మడి ఏపీ ముందుండేది.ఒక ఆంగ్ల వాణిజ్య పక్షపత్రిక 2022కు సంబంధించి ఆర్బీఐ, ఇకనామిక్ సర్వే నుంచి లభించిన గణాంకాల ఆధారంగా కొన్ని అంచనాలు వేసింది. తలసరి ఆదాయంలోనూ ఏపీ పరుగులు తీస్తోంది. దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో ఐటీ, ఔషధాల పరిశ్రమల కేంద్రం హైదరాబాద్ అంతర్భాగంగా ఉన్న తెలంగాణ రూ.2,65,623 తలసరి ఆదాయంతో అగ్రభాగాన నిలవడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కాని, హైదరాబాద్ వంటి పారిశ్రామిక మహానగరం ఆంధ్రప్రదేశ్ లో లేకున్నా ఈ రాష్ట్రం రూ. 2,07,771 తలసరి ఆదాయం నమోదు చేసుకోవడం నిజంగా ఘనవిజయమే. ఎందుకంటే, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర సాంకేతిక, వైద్య విద్యలకు సంబందించి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలా ఆలస్యంగా విద్యాసంస్థలు నెలకొల్పారు. ప్రైవేటు రంగంలో భారీ పరిశ్రమలు, అత్యధిక జీతాలు చెల్లించే రంగాలు కూడా ఏపీలో ఇంకా చెప్పుకోదగ్గస్థాయికి ఎదగలేదు. ఆంధ్ర ప్రాంతం ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఇతర టెక్నాలజీ కోర్సులు చదివిన విద్యార్థులు పీజీ చదువుల కోసం అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లి స్థిరపడడం ఎక్కువ. ఈ నేపథ్యంలో ఏపీ రూ.2,07,771 తలసరి ఆదాయం సాధించడం నిజంగా ప్రశంసనీయం. ఐటీ, ఇతర టెక్నాలజీ రంగాలు, గట్టి పునాదులున్న ఫార్మా రంగాల ద్వారా 21వ శతాబ్దపు నగరంగా రూపుదిద్దుకున్న గ్లోబల్ సిటీ హైదరాబాద్ అంతర్భాగం కావడం వల్ల తెలంగాణ దక్షిణాదిన తలసరి ఆదాయంలో అగ్రభాగాన నిలిచింది. అయితే, తొమ్మిదేళ్ల క్రితం సొంత ప్రయాణం మళ్లీ ప్రారంభించిన ఏపీ తలసరి ఆదాయంలో మంచి ప్రగతి సాధించిందనే చెప్పవచ్చు. కాగా, తలసరి ఆదాయంలో జాతీయ సగటు అయిన రూ.1,50,007ను ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలు దాటì అందనంత ముందుకెళ్లడం ఈ ప్రాంతంలోని ఆర్థిక, సామాజిక, మౌలిక సదుపాయాల పునాదులకు అద్దంపడుతోంది. దక్షిణాదిన ఈ ఐదు రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ మధ్య ఆర్థికాభివృద్ధికి సంబంధించి గట్టి పోటీ ఉందని కూడా ఆర్బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, మిగిలిన మూడు రాష్ట్రాలూ ఈ రెండింటితో పోటీపడుతూ ముందుకు పరిగెడుతున్నాయి. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్ సహా ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలూ భారత ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజన్లుగా ఉపయోగపడుతున్నాయి. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ -
ఏపీ భవన్ విభజన సమావేశం వాయిదా
సాక్షి, ఢిల్లీ: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ నిర్వహించ తలపెట్టిన సమావేశం వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(సోమవారం) సమావేశం జరగాల్సి ఉండగా.. బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు సమాచారం అందించింది హోంశాఖ. అయితే సమావేశం వాయిదాకి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఈ సమావేశానికి రావాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఇదివరకే హోంశాఖ కోరిన సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. ఇదీ చదవండి; ‘లింక్’ కోసం డబ్బులా? -
షెడ్యూల్ 9, 10 సంస్థలపై పిటిషన్.. కేంద్రం, టీఎస్‌కు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలను తక్షణమే విభజించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్లో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. పిటిషన్లో భాగంగా ఏపీ ప్రభుత్వం.. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనలో తీవ్ర ఆలస్యం జరిగింది. ఈ షెడ్యూల్లో ఉన్న సంస్థల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లుగా ఉండగా.. దాదాపు 91 శాతం సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని పేర్కొంది. లక్ష మందికిపైగా ఉద్యోగులు అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సంస్థల విభజన ఆలస్యం కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోతోంది. విభజన అంశంలో తెలంగాణ స్పందించకపోవడం ఏపీ ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపింది. తక్షణమే సంస్థల విభజనకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది.