ఢిల్లీ: ఏపీ విభజన చట్టంలోని ఆస్తుల విభజన ఆలస్యంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రూ.లక్షన్నర కోట్లకు పైగా ఆస్తుల విభజనపై తెలంగాణ తేల్చకపోవడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. జస్టిస్ జె.కే. మహేశ్వరి, జస్టిస్ సుందరేషన్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.
విభజన చట్టం ప్రకారం ఆస్తులలో ఏపీకి 58% తెలంగాణకు 42 శాతం వాటా దక్కాలని, ఆస్తుల విభజనపై అవసరమైతే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమించాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. దీంతో ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటి అని సుప్రీంకోర్టు అడిగింది. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే దీనిపై తగిన సూచనలు తీసుకుంటామని కేంద్ర తరఫు న్యాయవాది నటరాజన్ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు.
అనంతరం ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత రెండు వారాల్లో రీజైండర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై నెలాఖరుకు వాయిదా వేసింది.
చదవండి: ఉద్ధవ్‌ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు
Comments
Please login to add a commentAdd a comment