ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై శాసనసభలో మరోసారి తీర్మానం చేయాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం వాయిదా తీర్మానం ఇచ్చింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై శాసనసభలో మరోసారి తీర్మానం చేయాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం వాయిదా తీర్మానం ఇచ్చింది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్ అంశంపై ప్రకటన చేయనున్నారు. ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, వ్యవసాయం, విద్యుత్, అటవీశాఖ పద్దులపై చర‍్చ జరగనుంది.