నిన్న (గురువారం) అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన ప్రతిపక్ష నేతలు తమ వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు.
హైదరాబాద్: నిన్న (గురువారం) అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన ప్రతిపక్ష నేతలు తమ వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు. ప్రాజెక్టులు, భూ సేకరణ చట్టం ఆమోదం విషయంలో బుధవారం సభ జరిగిన తీరుకు నిరసనగా బుధవారం ప్రతిపక్ష పార్టీలు సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. కాగా, నేడు సమావేశాలలలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై బీజేపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. విద్యా, ఉపాధి రంగాల్లో వికలాంగులకు మూడు శాతం హామీలపై టీడీపీ నేతలు తమ వాయిదా తీర్మానం ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు సభలో తమ కార్యచరణ ఎలా ఉండాలన్న దానిపై చర్చించేందుకు సమావేశమయ్యారు. మరోవైపు నేడు సభలో మత్స్యశాఖకు సంబంధించిన విషయాలను చర్చించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.