‘కుట్ర వ్యాఖ్యల’పై కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం | Congress given adjournment motion notice in Rajya Sabha | Sakshi
Sakshi News home page

‘కుట్ర వ్యాఖ్యల’పై కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం

Published Fri, Dec 22 2017 9:28 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM

Congress given adjournment motion notice in Rajya Sabha

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై ప్రధాని మోదీ చేసిన ‘కుట్ర వ్యాఖ్యల’పై కాంగ్రెస్‌ శుక్రవారం రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. రూల్ నెంబర్ 267 ప్రకారం కాంగ్రెస్‌ ఈ వాయిదా తీర్మానం అందించింది.  ఈ అంశాన్నిచర్చించేందుకు సభా కార్యక్రమాలను రద్దు చేయాలని కోరుతూ 267 నిబంధన కింద కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేతలు కొందరు... పాక్‌‌తో కలిసి కుట్ర పన్నారని స్వయంగా మోదీనే ఓ కార్యక్రమంలో చెప్పిన విషయం తెలిసిందే.  అయితే  మోదీ వ్యాఖ్యలపై గత నాలుగు రోజులుగా రాజ్యసభలో కాంగ్రెస్‌ ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement