న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో బుధవారం ప్రసంగించారు. ప్రజలు మూడసారి ఎన్డీయేకు పట్టం కట్టారని పేర్కొన్నారు. 60 ఏళ్ల తరువాత దేశంలో వరుసగా మూడోసారి ఓ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.
ప్రధాని మోదీ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు అడ్డు తగిలారు. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. విపక్ష నేతలను మాట్లాడనివ్వలేని వాకౌట్ చేశాయి. అయితే దీనిపై మోదీ స్పందిస్తూ.. విపక్ష సభ్యులు ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు. సభను విపక్షాలు అవమానిస్తున్నాయని అన్నారు. నిజాలు చెబుతుంటే ప్రతిపక్షానికి భరించడం లేదని, ప్రజలు ఓడించినా వారిలో మార్పు రావడం లేదని ధ్వజమెత్తారు. చర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారని చురకలంటించారు.
తన సమాధానం వినే ధైర్యం విపక్షాలకు లేదని అన్నారు ప్రధాని మోదీ. ప్రజా తీర్పును విపక్షాలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయని పేర్కొన్నారు. విపక్షాలు అబద్దం ప్రచారం చేస్తున్నాయని, సన్నకారు రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పథకాలు తేలేదని దుయ్యబట్టారు.
తాము వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చామన్న మోదీ.. రైతుల పంటలకు కనీసమద్దతు ధరను భారీగా పెంచామని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు అండగా నిలిచామన్నారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాంమని, బంజారాల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment