Opposition walkout
-
చర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారు: విపక్షాలపై మోదీ ఫైర్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో బుధవారం ప్రసంగించారు. ప్రజలు మూడసారి ఎన్డీయేకు పట్టం కట్టారని పేర్కొన్నారు. 60 ఏళ్ల తరువాత దేశంలో వరుసగా మూడోసారి ఓ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు అడ్డు తగిలారు. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. విపక్ష నేతలను మాట్లాడనివ్వలేని వాకౌట్ చేశాయి. అయితే దీనిపై మోదీ స్పందిస్తూ.. విపక్ష సభ్యులు ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు. సభను విపక్షాలు అవమానిస్తున్నాయని అన్నారు. నిజాలు చెబుతుంటే ప్రతిపక్షానికి భరించడం లేదని, ప్రజలు ఓడించినా వారిలో మార్పు రావడం లేదని ధ్వజమెత్తారు. చర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారని చురకలంటించారు.తన సమాధానం వినే ధైర్యం విపక్షాలకు లేదని అన్నారు ప్రధాని మోదీ. ప్రజా తీర్పును విపక్షాలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయని పేర్కొన్నారు. విపక్షాలు అబద్దం ప్రచారం చేస్తున్నాయని, సన్నకారు రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పథకాలు తేలేదని దుయ్యబట్టారు. తాము వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చామన్న మోదీ.. రైతుల పంటలకు కనీసమద్దతు ధరను భారీగా పెంచామని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు అండగా నిలిచామన్నారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాంమని, బంజారాల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని తెలిపారు. -
Tawang dominates Parliament: ‘చైనా’పై చర్చించాల్సిందే
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికులతో భారత సేన ఘర్షణ అంశాన్ని పార్లమెంట్లో చర్చించాల్సిందేనన్న ఉభయసభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. అయితే, ఈ అంశాన్ని రాజ్యసభ, లోక్‌సభల్లో చర్చించే ప్రసక్తేలేదని ఇరుసభల సభాపతులు తేల్చిచెప్పడంతో విపక్ష సభ్యులు వాకౌట్‌చేశారు. బుధవారం ఉదయం లోక్‌సభలో ప్రశ్నావళి ముగియగానే సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘1962లో భారత్–చైనా యుద్ధంపై స్వయంగా ప్రధాని నెహ్రూనే చర్చించారు. ఆనాడు 165 మంది సభ్యులకు మాట్లాడే అవకాశమిచ్చారు. ఇప్పుడూ తవాంగ్‌లో చైనా దుందుడుకుపై సభలో చర్చించాల్సిందే’ అని పట్టుబట్టారు. చర్చించాలా వద్దా అనేది సభావ్యవహారాల సలహా కమిటీ భేటీలో నిర్ణయిస్తామని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా స్పష్టంచేశారు. ఇందుకు ఒప్పుకోబోమంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు సైతం వేర్వేరు అంశాలపై ప్రభుత్వాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, ఎన్సీ పార్టీల సభ్యులు కొందరు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను దాటి చైనా సైనికులు భారత భూభాగంలోకి వచ్చిన అంశాన్ని చర్చించాలంటూ రాజ్యసభలోనూ విపక్షాలు డిమాండ్ల మోత మోగించాయి. అయితే, ఈ అంశంపై చర్చకు ముందస్తు నోటీసు ఇవ్వనికారణంగా రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ చర్చకు నిరాకరించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, ఆర్జేyీ తదితర పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. -
మరో వేటు
డీఎండీకే ఎమ్మెల్యేలపై పది రోజుల నిషేధం అసెంబ్లీలో హక్కుల తీర్మానం ఆమోదం విపక్షాల వాకౌట్ విపక్షంపై మరోవేటు వేయడం ద్వారా అధికార పక్షం తన కక్ష తీర్చుకుంది. రెండు అసెంబ్లీ సమావేశాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న డీఎండీకే ఎమ్మెల్యేలపై మరోసారి నిషేధాన్ని విధించింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పది రోజులపాటు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాల్గొనేందుకు వీలులేదని నిషేధం విధించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:గత నెల 19వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో డీఎండీకే సభ్యులు అడ్డు తగిలారు. స్పీకర్ పోడియం వైపునకు దూసుకెళ్లారు. బడ్జెట్ ప్రతులను చించి ఎగురవేశారు. అన్నాడీఎంకే అధినేత్రి, జయలలితపై విమర్శలు చేశారు. డీఎండీకే ఎమ్మెల్యేలు చంద్రకుమార్, మోహన్‌రాజ్, పార్తిబన్, వెంకటేశన్, శేఖర్, దినకరన్ ప్రస్తుత, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సైతం పాల్గొనరాదని స్పీకర్ ధనపాల్ నిషేధం విధించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు సాగుతుండగా, తమపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డీఎండీకే ఎమ్మెల్యేలు సచివాలయం ముందు ప్రతిరోజూ ధర్నా నిర్వహిస్తున్నారు. వీరి ఆందోళనకు డీఎంకే, కాంగ్రెస్, తదితర పార్టీలన్నీ మద్దతు పలుకుతున్నాయి. సభలో తీర్మానం ఇదిలా ఉండగా, డీఎండీకే ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని ప్రస్తావించేందుకు డీఎంకే సభ్యులు స్టాలిన్ సిద్ధపడగా అదే సమయంలో సదరు ఆరుగురు సభ్యులపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని మంత్రి నత్తం విశ్వనాథన్ ప్రవేశపెట్టారు. సభ్యుల విపరీత చేష్టలపై సభా హక్కుల బృందమే ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇదే బృందంలో సభ్యుడుగా ఉన్న కంభం రామమోహన్ ఈ శిక్ష చాలా ఎక్కువని వ్యాఖ్యానించినట్లు స్టాలిన్ గుర్తు చేశారు. డీఎండీకే సభ్యులపై విధించిన నిషేధం రెండు యావజ్జీవ శిక్షల వలె ఉందని కాంగ్రెస్ రంగరాజన్ విమర్శించారు. ఈ సమయంలో అధికార ఎమ్మెల్యే బోస్ కలుగజేసుకుంటూ గత ప్రభుత్వం తనను నాలుగు నెలల పాటూ జైలు పాలు చేసిందని, ఎమ్మెల్యేగా పనిచేయకుండా అడ్డుకుందని ఎత్తిపొడిచారు. ఏది ఏమైనా హక్కుల బృందం తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులు శిరసావహించకతప్పదని మంత్రి నత్తం పేర్కొన్నారు. డీఎండీకేకు చెందిన ఆరుగురు సభ్యులపై వచ్చే అసెంబ్లీ సమావేశాలకు కూడా పదిరోజుల పాటూ నిషేధం విధిస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న ఉపసభాపతి పొల్లాచ్చి జయరామన్ ప్రకటించారు. నిషేధం సమయంలో సభ్యులు తమ వేతనాన్ని, రాయితీలను సైతం కోల్పోతారని స్పష్టం చేశారు. ఆరుగురు సభ్యులపై నిషేధం విధిస్తూ చేసిన తీర్మానాన్ని సభ ఆమోదించిందని స్పీకర్ ప్రకటించడంతో స్టాలిన్ (డీఎంకే), రంగరాజన్ (కాంగ్రెస్), సౌందరరాజన్ (సీపీఎం), అరుముగం (సీపీఐ), జవహరుల్లా (మనిదనేయ మక్కల్ కట్చి) నిరసన తెలుపుతూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. -
చెరకు రైతుల బకాయిలు తీర్చాలంటూ విపక్షాల వాకౌట్
జూన్‌లోపు ఇప్పిస్తామని మంత్రి హామీ బెంగళూరు: చక్కెర కర్మాగారాల మాఫియాకు రాష్ట్ర ప్ర భుత్వం తలొగ్గి, రైతులకు చక్కెర కర్మాగారాల నుంచి అందాల్సిన బకాయిలను ఇప్పించలేక పోయిందంటూ విపక్షాలు వాకౌట్ చేశాయి. సోమవారం శాసనసభ కార్యకలాపాలు ప్రా రంభమైన అనంతరం జేడీఎస్, బీజేపీ సభ్యులు చెరకు రైతుల బాకీలకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తాయి. దీంతో రాష్ట్ర చక్కెర, సహకార శాఖ మంత్రి మాట్లాడుతూ...వచ్చే ఏడాది మార్చి నుంచి జూన్‌లోపు రైతుల బకాయిలను ఇప్పిస్తామని చెప్పారు. అయితే ఈ సమాధానంతో సంతృప్తి పడని విపక్షాలు రైతుల బాకీలు చెల్లించేందుకు చక్కెర కర్మాగారాలకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించాల్సిందిగా కోరాయి. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ...నవంబర్ 30లోపు రైతులకు టన్ను చెరకుకు రూ.2,300 చెల్లించాల్సి ఉందని, అయితే ఇప్పటికీ కొన్ని కర్మాగారాలు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు మాత్రమే చెల్లించాయని అన్నారు. చక్కెర కర్మాగారాలకు చెరకును అం దించిన అనంతరం 14 రోజుల్లోపు ఆయా కర్మాగారాలు రైతులకు చెరకు ధరను చెల్లించాలని, లేదంటే వడ్డీతో సహా చెల్లిం చాలనే నియమం ఉందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికి చెర కు రైతులకు చక్కెర కర్మాగారాలకు చెరకు అందజేసి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ చెరకు ధరను చెల్లించలేదని, మరి అ లాంటి పరిస్థితుల్లో వడ్డీతో కలిపి కట్టాల్సిందిగా చక్కెర కర్మాగారాలను ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ...‘మా ప్రభుత్వం ఎలాంటి మాఫియాకు తలొగ్గలేదు. ఇప్పటికే ప్రకటించిన మద్దతు ధర రూ.2,500 తప్పక అందిస్తాం* అని తెలిపారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ, జేడీఎస్పార్టీలు శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. కాసేపటి తరా్వాత ఇరు పార్టీల సభ్యులు తిరిగి శాసనసభలోకి రావడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు.