చెరకు రైతుల బకాయిలు తీర్చాలంటూ విపక్షాల వాకౌట్
జూన్‌లోపు ఇప్పిస్తామని మంత్రి హామీ
బెంగళూరు: చక్కెర కర్మాగారాల మాఫియాకు రాష్ట్ర ప్ర భుత్వం తలొగ్గి, రైతులకు చక్కెర కర్మాగారాల నుంచి అందాల్సిన బకాయిలను ఇప్పించలేక పోయిందంటూ విపక్షాలు వాకౌట్ చేశాయి. సోమవారం శాసనసభ కార్యకలాపాలు ప్రా రంభమైన అనంతరం జేడీఎస్, బీజేపీ సభ్యులు చెరకు రైతుల బాకీలకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తాయి. దీంతో రాష్ట్ర చక్కెర, సహకార శాఖ మంత్రి మాట్లాడుతూ...వచ్చే ఏడాది మార్చి నుంచి జూన్‌లోపు రైతుల బకాయిలను ఇప్పిస్తామని చెప్పారు. అయితే ఈ సమాధానంతో సంతృప్తి పడని విపక్షాలు రైతుల బాకీలు చెల్లించేందుకు చక్కెర కర్మాగారాలకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించాల్సిందిగా కోరాయి. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ...నవంబర్ 30లోపు రైతులకు టన్ను చెరకుకు రూ.2,300 చెల్లించాల్సి ఉందని, అయితే ఇప్పటికీ కొన్ని కర్మాగారాలు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు మాత్రమే చెల్లించాయని అన్నారు.
చక్కెర కర్మాగారాలకు చెరకును అం దించిన అనంతరం 14 రోజుల్లోపు ఆయా కర్మాగారాలు రైతులకు చెరకు ధరను చెల్లించాలని, లేదంటే వడ్డీతో సహా చెల్లిం చాలనే నియమం ఉందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికి చెర కు రైతులకు చక్కెర కర్మాగారాలకు చెరకు అందజేసి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ చెరకు ధరను చెల్లించలేదని, మరి అ లాంటి పరిస్థితుల్లో వడ్డీతో కలిపి కట్టాల్సిందిగా చక్కెర కర్మాగారాలను ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ...‘మా ప్రభుత్వం ఎలాంటి మాఫియాకు తలొగ్గలేదు. ఇప్పటికే ప్రకటించిన మద్దతు ధర రూ.2,500 తప్పక అందిస్తాం* అని తెలిపారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ, జేడీఎస్‌పార్టీలు శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. కాసేపటి తరా్వాత ఇరు పార్టీల సభ్యులు తిరిగి శాసనసభలోకి రావడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు.