
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీరుపై కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే త్రీవ విమర్శలు గుప్పించారు.
‘లోక్ ఎన్నికల ప్రసంగాల్లో ప్రధాని మోదీ విద్వేషాలు రెచ్చగొట్టారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో బీజేపీ సరైన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మంగళసూత్రాలు అమ్మెస్తారని మోదీ తప్పడు ప్రచారం చేశారు. ప్రధాని స్థాయిలో ఉండి విద్వేష ప్రసంగాలు చేయటం సరికాదు. ఓటర్లను ప్రధాని మోదీ అవమానించారు’ అని అన్నారు.
‘ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం దేశానికి ప్రమాదకరం. మహిళలు, దళితులకు విద్యను నిరాకరిస్తున్నారు’ అని ఖర్గే అన్నారు. ఖర్గే వ్యాఖ్యలను అధికార పక్షం తప్పుపట్టింది. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీ జేపీ నడ్డా చైర్మన్‌ను కోరారు. ఆర్‌ఎస్‌ఎస్ ఖర్గే వ్యాఖ్యలను రికార్డులను ఛైర్మన్ తొలగించారు.
దీనికంటే ముందు లోక్‌సభలో నీట్ పరీక్షపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుపట్టాయి. నీట్‌పై లోక్‌సభలో చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించలేదు. దీంతో విపక్ష సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment