పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను బర్తరఫ్ చేయాలంటూ వైఎస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. ఉదయమే ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంపై అత్యవసరంగా చర్చించేందుకు గురువారం వాయిదా తీర్మానం ఇవ్వగా, దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు.