
సంబరాల కోసం సభను వాయిదా వేస్తారా?
పెళ్లిళ్లు, పుట్టిన రోజు సంబరాల కోసం సభను వాయిదా వేస్తారా అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు.
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్లు, పుట్టిన రోజు సంబరాల కోసం సభను వాయిదా వేస్తారా అనిæపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. గురువారం శాసనసభ వాయిదాపడిన అనంతరం ఆయన మాట్లా డుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సభను నిర్వహిం చాలని ఎంతోకాలంగా పోరాడితే ఈ సమావేశాలు జరుగు తున్నాయని పేర్కొన్నారు.
ఈ సమావేశాలు కూడా మొక్కు బడిగా, ఏకపక్షంగా, అప్రజాస్వామికంగా నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుందనే భయంతోనే టీఆర్‌ఎస్ నాయకులు సభను అర్ధంతరంగా వాయిదా వేస్తున్నారని భట్టి అన్నారు. ఎవరి ఇంట్లోనో పెళ్లి, పుట్టినరోజు కార్యక్రమాలుంటే సభను వాయిదా వేయడం ఇదేం న్యాయమని భట్టి పేర్కొన్నారు. ప్రజల సమస్యలకన్నా సంబరాలు, వేడుకలే టీఆర్‌ఎస్ నేతలకు ముఖ్యమా అని ప్రశ్నించారు.