ప్రజాస్వామ్యాన్ని జుగుప్సాకరంగా మార్చాయి  | Telangana: CLP leader Bhatti Vikramarka Fires On BJP And TRS | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని జుగుప్సాకరంగా మార్చాయి 

Published Fri, Oct 28 2022 2:37 AM | Last Updated on Fri, Oct 28 2022 2:37 AM

Telangana: CLP leader Bhatti Vikramarka Fires On BJP And TRS - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ప్రజాస్వామ్యాన్ని జుగుప్సాకరంగా మార్చేశా యని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని టీఆర్‌ఎస్‌ నేతలు అంటారు.. మరి వారు చేసిందేమిటి.. 12 మంది కాంగ్రెస్‌ సభ్యులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న విషయం అందరికీ తెలిసిందే’ ఈ పార్టీలు దొందూ దొందేనన్నారు.

నారాయణపేట జిల్లాలో గురువారం జరి గిన భారత్‌ జోడో యాత్రలో బొందలకుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకూ కొత్త అసలే కాదు.. ఆ నలుగురు కనపడ్డారు.. బయటకు రాని వాళ్లు ఇంకా ఎంత మంది ఉన్నారో అని పేర్కొన్నారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ అపహాస్యం పాలవుతోందని గగ్గోలు పెట్టినా ఫలితం లేకుండా పోయిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement