ప్రత్యేక హోదా అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండోరోజు కూడా దద్దరిల్లింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో హోరెత్తింది. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే వాయిదా తీర్మానంపై చర్చకు వైఎస్ఆర్ సీపీ పట్టుబట్టింది. ప్రజలందరూ కోరుకొంటున్నట్లుగా ఈ అంశంపై చర్చించాలని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే ముందు ప్రకటన చేస్తామని ఆ తర్వాతే చర్చ చేపట్టాలని అధికార పక్షం స్పష్టం చేసింది. విపక్షం మాత్రం ప్రభుత్వ ప్రకటనకు తాము ఒప్పుకునేది లేదని, ముందు చర్చ చేపట్టాలని తెలిపింది. ప్రశాంతంగా ప్రారంభమైన సభలో అధికార పక్షం రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహారించింది
Published Fri, Sep 9 2016 10:00 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement