
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాయిదా తీర్మానాలను చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా విపక్షాల నిరసనలు కొనసాగడంతో మధ్యాహానికి వాయిదా వేశారు. కాగా బెంగాల్ సీబీఐ వివాదం కారణంగా గత రెండు రోజులుగా సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన విషయం తెలిసిందే.