తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా
హైదరాబాద్: గత సమావేశాకు భిన్నంగా సుదీర్ఘంగా 18 రోజులపాటు జరిగిన తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు బుధవారంతో ముగిశాయి. మైనారిటీ సంక్షేమంపై లఘు చర్చ అనంతరం స్పీకర్ మధుసూదనాచారి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కీలకమైన భూ సేకరణ, ప్రజాప్రతినిధులకు జీతాల పెంపు తదితర కీలక బిల్లులు ఈ సమావేశాల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
(ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు పక్కా)
డిసెంబర్ 16న శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలివిడదతలో 16రోజులపాటు సభ జరగగా, సంక్రాతి సెలవుల అనంతరం రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించిన స్పీకర్ బుధవారం నిరవధిక వాయిదావేశారు. కేంద్ర బడ్జెట్ తర్వాత, రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను తిరిగి ఫిబ్రవరి చివరి వారంలో మొదలు పెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.