Chief Minister Naveen Patnaik
-
ఒక్కరోజులో 10 వేల కేసులు, 14 రోజుల లాక్డౌన్ ప్రకటించిన సీఎం
భువనేశ్వర్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో 14 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. మే 5 నుంచి మే 19వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. రోజూ వేల సంఖ్యలో కరోనా కొత్త కేసులు నమోదవుతుండటంతో సీఎం లాక్‌డౌన్‌కే మొగ్గుచూపారు. ఎమర్జెన్సీ సర్వీసులు మినహాయించి లాక్ డౌన్ పై ఆంక్షలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. కాగా, ఇప్పటికు ఒడిశాలో 4.62 లక్షల మందికి కరోనా సోకగా 3 లక్షల 85వేల మంది కోలుకున్నారు. 2,043 మంది మహమ్మారికి బలయ్యారు. అయితే రికార్డు స్థాయిలో శనివారం ఒక్కరోజే 10,413 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యశాఖ అధికారులు, మంత్రులతో ఆదివారం అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ భేటీ అనంతరం రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
దేశంలో ఓటమి ఎరుగని ముఖ్యమంత్రి
-
ఉండేందుకు ఇల్లు లేని మండలి సభ్యురాలు!
రసాయన ఎరువుల వల్ల వరి పంటకొచ్చే ముప్పుపై గ్రామస్తులను దశాబ్దాల క్రితమే చైతన్యం చేసిన కమలా పూజారి నేడు, గ్రామాల్లో మంచి నీటి సరఫరాకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించారు. ఇప్పుడిక రాష్ట్ర ప్రణాళికా మండలి సభ్యురాలు కూడా అయ్యారు కాబట్టి ఆమె లక్ష్యసాధనకు ఉన్న అవాంతరాలు తొలగిపోవచ్చు. అయితే ఆమె సొంత గూటి సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది! కమలా పూజారి వయసు 67 ఏళ్లు. గిరిజన మహిళా రైతు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పత్రాపుట్ గ్రామం ఆమె స్వస్థలం. భుమియ గిరిజన తెగలో పుట్టిన కమలకు దేశీ వరి వంగడాలన్నా, సేంద్రియ వ్యవసాయమన్నా పంచప్రాణాలు. ఆమె పేరు ఇప్పుడు రాష్ట్రమంతా మారుమోగిపోతోంది. అందుకో బలమైన కారణమే ఉంది మరి. ఒడిశా రాష్ట్ర ప్రణాళికా మండలి సభ్యురాలిగా ఇటీవల కమల నియమితులయ్యారు. ఒక గిరిజన మహిళను రాష్ట్ర ప్రణాళికా బోర్డు సభ్యురాలిగా తొలిసారిగా నియమించిన ఘనత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు దక్కింది. నాడు వరికొచ్చే ముప్పుపై కమల నియామక ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరచినప్పటికీ.. ఈ పదవి ఆమెకు అంత అయాచితంగా ఏమీ రాలేదు. సుసంపన్నమైన వ్యవసాయ జీవవైవిధ్యానికి.. ముఖ్యంగా అపురూపమైన దేశీ వరి వంగడాలకు ఒడిశాలోని జేపూర్ పెట్టింది పేరు. జేపూర్ బ్లాక్‌లోనే ఉంది కమల స్వగ్రామం పత్రాపుట్. వేలాది ఏళ్లుగా తమవై విరాజిల్లుతున్న వందలాది దేశీ వరి వంగడాలు అంతరించిపోతుండటం ఆమెను కలవరపరచింది. రసాయనిక వ్యవసాయం పుణ్యమా అని అందుబాటులోకి వచ్చిన కొత్త వంగడాల వల్ల దేశీ వంగడాలు కాలగర్భంలో కలసిపోతుండటం ఆమెకు సుతరామూ నచ్చలేదు. దేశీ వరి వంగడాలు అతివృష్టిని, కరువు కాటకాలను తట్టుకొని నిలబడి.. ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అంత విలువైన వంగడాల పరిరక్షణ సజావుగా సాగాలంటే సేంద్రియ వ్యవసాయం వ్యాప్తిలోకి తేవాలని కమలా పూజారి దశాబ్దాల క్రితమే గ్రహించారు. ఎమ్మెస్ స్వామినాథన్ ఫౌండేషన్ నేర్పిన మెలకువలు ఆమె తన లక్ష్యంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు తోడ్పడ్డాయి. నేడు తాగునీటి సరఫరాపై లక్ష్య సాధనకు రైతుగా తాను పాటుపడటంతోపాటు తమ గ్రామంలో గడపగడపకు, ఆ ప్రాంతంలోని గ్రామ గ్రామానికీ వెళ్లి ఇదే విషయాన్ని కమల ప్రచారం చేశారు. అవాంతరాలు ఎదురైనా దీక్షతో కదిలింది. ఫలితంగా పత్రాపుట్, ఆ పరిసర గ్రామాల్లో రైతులు రసాయనిక ఎరువుల వాడకం పూర్తిగా నిలిపివేశారు. ఆమె కృషికి గుర్తింపుగా 2004లో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళా రైతు పురస్కారంతో సత్కరించింది. జోహన్నెస్‌బెర్గ్(దక్షిణాఫ్రికా)లో 2002లో జరిగిన అంతర్జాతీయ సమావేశాలకు కూడా ఆమెహాజరయ్యారు. ఇక ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం మహిళా హాస్టల్ భవనానికి కమల పేరు పెట్టి ఆమెపై గౌరవాన్ని చాటుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కమలను ప్రభుత్వం తాజాగా రాష్ట్ర ప్రణాళికా సంఘం తొలి మహిళా సభ్యురాలిగా నియమించడం విశేషం. దీని గురించి టీవీ ద్వారా తెలిసీ తెలియగానే కమల ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘గ్రామాల్లో తాగునీటి సరఫరాపై దృష్టి సారిస్తాను’ అన్నారు. ఆమె తన ఇద్దరు కుమారులతో కలసి మట్టి గోడల పూరింటిలో నివసిస్తున్నారు. ‘నాకు ఈ పదవి కన్నా ఏదో ఒక ప్రభుత్వ పథకం కింద పక్కా ఇల్లు ఇచ్చి ఉంటే ఇంకా ఎక్కువ సంతోషించేదాన్ని’ అని కమల అన్నారని ఆమె మనుమడు విలేకరులతో చెప్పాడు! నిజానికి ఆమె 2016లో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, మంజూరు కాలేదు. ఆమె రెండో కుమారుడికి గత ఏడాది ఇల్లు మంజూరైనా, అదింకా నిర్మాణంలోనే ఉంది. – పంతంగి రాంబాబు -
ఒడిశా అసెంబ్లీలో పరిస్థితులు గందరగోళం
భువనేశ్వర్ : ఒడిశా అసెంబ్లీలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా నిరసనకారులపై పోలీసు ఫోర్స్ చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నేటి అసెంబ్లీ సమావేశాలు అట్టుడికాయి. సుందర్ఘర్ జిల్లాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిర్వహించిన సమావేశానికి బ్లాక్ స్టోల్స్‌ను కప్పుకుని వచ్చిన మహిళా నిరసనకారుల స్టోల్స్‌ను తొలగించడానికి పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించారని విపక్షాలు వాపోయాయి. ఈ గందరగోళ పరిస్థితుల నడుమ సభ పలుమార్లు వాయిదా పడింది. ఈ ఘటనపై సీఎం క్షమాపణ చెప్పాలని విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే ఈ ఘటనపై ఏ మహిళా ఇప్పటివరకు ఫిర్యాదుచేయలేదని అధికారపక్షం బీజేడీ వాదిస్తోంది. సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఈ ఘటనకు పట్నాయకే బాధ్యుడంటూ స్లోగన్స్ చేశారు. కొంతమంది కాంగ్రెస్ సభ్యులైతే ఏకంగా స్పీకర్ పోడియంపైకి ఎక్కి, మైకులను విరగొట్టారు. సభను సజావుగా సాజనిపక్షంలో స్పీకర్ నిరంజన్ పూజారీ మొదట 3 గంటల వరకు వాయిదావేశారు. తిరిగి సమావేశాలు ప్రారంభమైన తర్వాత కూడా సభలో గందరగోళం కొనసాగింది. దీంతో స్పీకర్ మరోసారి సభను వాయిదా వేశారు. మహిళలకు మంచి గౌరవం ఇస్తానని చెప్పే ముఖ్యమంత్రే, తన ర్యాలీలో ఇలాంటి ఘటనలు చేపట్టడం బాధకరమని విపక్షాల చీఫ్ విప్ తార ప్రసాద్ అన్నారు. నల్లరంగు చీరలతో వచ్చిన మహిళలను పట్నాయక్ తన మీటింగ్‌కు అనుమతించలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. -
హీరోని బయటకు పంపించి జీరోగా..
ఒడిశా: నాలుగు రోజులు ముందుగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయడంపట్ల ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను తీవ్రంగా విమర్శించాయి. సభలో ఆయనొక సున్నా అని ఆరోపించాయి. హీరోలను బయటకు పంపించి సున్నాగా సభలో ఉండిపోయి ముఖ్యమైన అంశాలపై చర్చ లేకుండానే తప్పించుకున్నారని మండిపడ్డాయి. చిట్ ఫండ్ కుంభకోణం వంటి ఎన్నో ముఖ్యమైన అంశాలు సభలో చర్చించేందుకు ఉన్నాయని, సభను నిర్వహించాలని తాము ఎంతగా విజ్ఞప్తి చేసుకున్నా ఆ మాట పెడచెవిన ముఖ్యమంత్రి సభను వాయిదా వేయించారని ఆరోపించారు.