పాల ట్యాంకర్, కారు ఢీ.. ఇద్దరు మృతి | two dies as milk tanker-car collsion in chittoor district | Sakshi
Sakshi News home page

పాల ట్యాంకర్, కారు ఢీ.. ఇద్దరు మృతి

Published Mon, May 2 2016 7:29 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

two dies as milk tanker-car collsion in chittoor district

బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం కాటప్పగారిపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున పాలట్యాంకర్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తితోపాటు ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.

కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తరలించారు. వీరంతా ఎస్‌ఆర్ పురం మండలానికి చెందిన వారు కాగా బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement