దిగంబర సాధువులకు చిర్రెత్తింది
నాసిక్: పుష్కర స్నానాలకు వచ్చిన జైన దిగంబర సాధువులకు చిర్రెత్తిపోయింది. ఎప్పుడు భగవన్నామ స్మరణలో ఉండే వారంతా ఆగ్రహంతో ఊగిపోతూ అధికారులపై చిందులేశారు. ఏమిటీ ఏర్పాట్లు, జాగ్రత్తలు అంటూ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గోదావరి పుష్కరాలు ప్రారంభమైనట్లుగానే మహారాష్ట్రలో సింహాష్ట కుంభమేళా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జైన దిగంబర సాధువులు తరలి వచ్చారు.
అయితే, గోదావరిలో నీళ్లు సరిగా లేకపోవడం, రాత్రి పూట విద్యుత్ సమస్య తలెత్తడం, చుట్టుపక్కల కుప్పలుగా చెత్తపేరుకోవడంవంటి పలు ఏర్పాట్ల లోపం వారికి కాస్త ఇబ్బంది కలిగించినట్లుదశరధ్ దాస్ అనే సాధువు అసంతృప్తి వ్యక్తం చేశాడు. కుంభమేళాకు వచ్చే తమకు కొన్ని ప్రత్యేక ప్రదేశాలు కేటాయించాల్సి ఉంటుందని, ఆ విషయంలో అధికారులు విఫలమయ్యారని ముందు తమకు ఆ పనిచేసి పెట్టాలని కోరారు. కన్నంవార్ బ్రిడ్జి నుంచి లక్ష్మీనారాయణ ఘాట్ వరకు కిలో మీటర్ కుపైగా ఉంటుందని, దానిని ఇప్పటికీ ఓపెన్ చేయకుండా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారని తెలిపారు.