Nashik: కాలారామ్‌ ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన మోదీ | Video: PM Modi Visit Kalaram Temple in Maharashtra Nashik | Sakshi
Sakshi News home page

నాసిక్‌లో మోదీ ఆధ్యాత్మిక పర్యటన.. కాలారామ్‌ ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన ప్రధాని

Published Fri, Jan 12 2024 2:17 PM | Last Updated on Fri, Jan 12 2024 4:21 PM

Video: PM Modi Visit Kalaram Temple in Maharashtra Nashik - Sakshi

ముంబై: అయోధ్యలో రామ మందిన ప్రాణప్రతిష్ట వేళ మహారాష్ట్రలోని నాసిక్‌లో శుక్రవారం ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు.  నాసిక్‌లో మెగా రోడ్డు షో నిర్వహించారు. అనంతరం రాంఘాట్‌కు చేరుకుని గోదావరి నదీమాతకు పూజలు చేశారు. ఇక చారిత్రక కాలారామ్ కాలారామ్‌ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజారులు, భక్తులతో కలిసి రామ భజన చేశారు.

స్వచ్ఛత అభియాన్’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. కాలారామ్‌ ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు దేశవ్యాప్తంగా  అన్ని ఆలయాల్లో పరిశుభ్రత క్యాంపెయిన్‌ను మొదలు పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇవాళ నాసిక్‌ రావడం సంతోషంగా ఉందని తెలిపారు. పంచవటి ప్రాంతంలో సీతారాములు గడిపారన్న నమ్మకం ఉందని చెప్పారు.  రాముడు చాలాకాలంపాటు పంచవటిలో ఉన్నారని అన్నారు. అనంతరం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తపోవన్ గ్రౌండ్‌లో నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌ను మోదీ  ప్రారంభించారు. 

దేశంలో యువశక్తి అత్యంత ముఖ్యమైనదని.. దేశ లక్ష్యాలను చేరుకోవడంలో యువత బలమైన మనస్తత్వం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పారు.  ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద ఐదో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. టెక్నాలజీ రంగంలో భారత్‌ వృద్ధి చెందుతోందన్నారు. ప్రధాని వెంట మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌, ఇతర బీజేపీ నేతలు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement