సాక్షి, ముంబై: ఎన్నికల తేదీలు ఖరారు కాకముందే వివిధ రాజకీయ పార్టీలు బలాబలాలను అధ్యయనం చేయడంతో పాటు ఎన్నికల ప్రచారాలను తమదైన శైలిలో ప్రారంభించాయి. రాబోయే లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుతం ప్రముఖ నగరాల పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాలుగు, అయిదు జిల్లాల్లో పట్టు సాధిస్తే సునాయాసంగా అధికారంలోకి రావచ్చని కూడా భావిస్తున్నట్లు తెలిసింది.
ముఖ్యంగా గత ఎన్నికల నుంచి నియోజకవర్గాలు మారిన సంగతి తెలిసిందే. దీంతో గత ఎన్నికల నుంచి నగరాలు, పట్టణాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. ముఖ్యంగా ముంబై, ఠాణే, పుణే, నాసిక్ ప్రాంతాల్లో పట్టున్నవారు అధికారంలోకి వచ్చేందుకు అధిక అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
నాలుగు జిల్లాల్లో 96 అసెంబ్లీ, 16 లోక్‌సభ నియోజకవర్గాలు
రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ, 48 లోక్‌సభ నియోజకవర్గాలున్న విషయం విదితమే. గత ఎన్నికల సమయంలో జరిగిన పునర్విభజన అనంతరం ముంబై, ముంబై ఉపనగరం, ఠాణే, పుణే, నాసిక్ మొదలగు జిల్లాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయని చెప్పవచ్చు. ఒక్క ముంబై నగరంలోనే (ముంబై, ముంబై ఉపనగరం) మొత్తం 36 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 6 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.
ముంబై అనంతరం ఠాణే, పుణే, నాసిక్ జిల్లాలు ఉన్నాయి. ఠాణే జిల్లాలో 4 లోక్‌సభ, 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరోవైపు పుణే జిల్లాలో 21 అసెంబ్లీ, 4 లోక్‌సభ, నాసిక్ జిల్లా లో 15 అసెంబ్లీ 2 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నా యి. దీంతో ముంబై, ఠాణే, పుణే, నాసిక్ జిల్లాలు కీలకంగా మారాయని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని మొత్తం 35 జిల్లాల్లో 288 అసెంబ్లీ, 48 లోక్‌సభ నియోజకవర్గాలుండగా వీటిలో 96 అసెంబ్లీ నియోజకవర్గాలు, 16 లోక్‌సభ నియోజకవర్గాలు కేవలం ముంబై, ముంబై ఉపనగరం, ఠాణే, పుణే, నాసిక్ మొదలగు జిల్లాల్లోనే ఉండడం విశేషం. దీంతో ఈ ప్రాంతాలపై రాజకీయ నాయకులు అత్యధికంగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ఈ ప్రాంతాలకు అధిక ప్రాధాన్యం కూడా ఇస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో పట్టు న్న రాజకీయ పార్టీలు సునాయాసంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీ య నిపుణులు అంటున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతాలు రాష్ట్రంతోపాటు కేంద్రంలో సమీకరణా లు మార్చేందుకు కీలకంగా మారాయి. వీటన్నిం టినీ దృష్టిలో ఉంచుకుని రాజకీయ నాయకులు ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
పట్టుకోసం పాకులాట
Published Mon, Feb 10 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
Advertisement