
అశ్లీల నృత్యాలు... పోలీసుల దాడి
నాసిక్: విలాసవంతమైన భవనంలో గుట్టుగా సాగుతున్న రేవ్ పార్టీని మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు రట్టు చేశారు. అసభ్యకర నృత్యాలు చేస్తున్న పలువురిని నాసిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంబంధీకులు ఉన్నట్టు సమాచారం. లగత్ పురి ప్రాంతంలో మిస్టిక్ విల్లాలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమచారం అందుకున్న పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధనగ్నంగా డాన్సులు చేస్తున్న యువతులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఘటనా స్థలం నుంచి మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాలు సేవించారన్న అనుమానంతో నిందితుల రక్త నమూనాలను సేకరించారు. భవనం ముందు పసుపురంగు లైటు కలిగిన పార్క్ చేసివుందని మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది. నిర్వాహకులు ఆన్ లైన్ ద్వారా సంప్రదించి యువతులను పార్టీకి రప్పించినట్టు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.