నాసిక్ : పిల్లల చిలిపి పనులు చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. కానీ ఈ మహిళ మాత్రం కూతురి చిలిపి చేష్టలకు చిరాకు పడింది. అతిగా అల్లరి చేస్తోందని ఆగ్రహం చెందింది. నిన్ను భరించటం నా వల్ల కాదంటూ కన్నకూతురినే గొంతు కోసి చంపేసింది. ఈ అమానుష ఘటన నాసిక్‌లో చోటు చేసుకుంది. నాసిక్‌లో నివసిస్తున్న యోగిత ముఖేష్ పవార్ కూతురి చేష్టలకు విసుగు చెంది తనను దారుణంగా చంపేసింది. కాగా తాను చెత్త పడేసి ఇంట్లోకి వస్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని బుకాయించింది.
అయితే ఘటనాస్థలంలో యోగితకు దుండగుడికి మధ్య ఘర్షణ జరిగిన దాఖలాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది. ఈ క్రమంలో ఇంటిని మొత్తం తనిఖీ చేయగా పదునైన బ్లేడును కనుగొన్నారు. దానిపై ఉన్న రక్తం యోగిత రక్తంతో సరిపోగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. విచారణలో భాగంగా తానే కూతురిని చంపినట్టుగా యోగిత నేరాన్ని అంగీకరించింది. పోలీసులు బుధవారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ హత్యకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment