ఆంధ్ర చేతిలో హైదరాబాద్ చిత్తు | Hyderabad, Andhra Pradesh in the draft | Sakshi
Sakshi News home page

ఆంధ్ర చేతిలో హైదరాబాద్ చిత్తు

Published Tue, Mar 4 2014 1:08 AM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM

Hyderabad, Andhra Pradesh in the draft

 బెంగళూరు: సౌత్ జోన్ వన్డే టోర్నీ (సుబ్బయ్య పిళ్లై ట్రోఫీ)లో చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన పోరులో ఆంధ్రదే పైచేయి అయింది. సోమవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 47.5 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. హబీబ్ అహ్మద్ (49 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), హనుమ విహారి (70 బంతుల్లో 43; 5 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. లెగ్‌స్పిన్నర్ దాసరి స్వరూప్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. 

కేఎస్ భరత్ (87 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీకి తోడు సాయికృష్ణ (55 బంతుల్లో 36; 5 ఫోర్లు) రాణించడంతో ఆంధ్ర 40.1 ఓవర్లలో 4 వికెట్ల కు 167 పరుగులు చేసింది. అయితే ఈ రెండు జట్లూ దేశవాళీ నాకౌట్‌కు అర్హత సాధించలేకపోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement