విజయవాడ : 2016-17 క్రికెట్ సీజన్‌లో పాల్గొనే ఆంధ్ర రంజీ జట్టును ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. గతేడాది హైదరాబాద్‌కు ఆడి ఈసారి ఆంధ్రకు వచ్చిన హనుమ విహారిని జట్టు కెప్టెన్‌గా నియమించారు. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన రవితేజతో పాటు గుజరాత్‌కు చెందిన భార్గవ్ భట్‌కు కూడా చోటు కల్పించారు. సొంత జట్టు ఆంధ్రకు ఆడతానంటూ ఏసీఏ చుట్టూ తిరిగిన వేణు గోపాలరావును సెలక్షన్ కమిటీ పట్టించుకోలేదు. సీజన్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల కోసం ఈ జట్టును ప్రకటించారు.
ఆంధ్ర రంజీ జట్టు: విహారి (కెప్టెన్), కేఎస్ భరత్ (వైస్ కెప్టెన్), డీబీ ప్రశాంత్‌కుమార్, ఎంయూబీ శ్రీరామ్, కె.శ్రీకాంత్, ఏజీ ప్రదీప్, డీబీ రవితేజ, కె.అశ్విన్ హెబర్, సీహెచ్.స్టీఫెన్, డి.శివకుమార్, ఐ.కార్తీక్‌రామన్, బి.అయ్యప్ప, పి.విజయకుమార్, టి.వంశీకష్ణ, సిద్ధార్థ్, భార్గవ్ భట్. అక్టోబర్ 3నుంచి చెస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిడే ఇంటర్నేషనల్ రేటింగ్ అండర్-19 ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్ అక్టోబర్ 3న ప్రారంభం కానుంది. తెలంగాణ చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ఖమ్మంలోని సీక్వెల్ రిసార్‌ట్సలో మూడు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి పద్మారావు సోమవారం టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌సీఏ అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి ఆనం చిన్ని వెంకటేశ్వర రావు, మీడియా ఇన్‌చార్జి పి. రమేశ్ పాల్గొన్నారు.
ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌గా విహారి
Published Tue, Sep 20 2016 10:33 AM | Last Updated on Sat, Jun 2 2018 2:19 PM
Advertisement
Advertisement