SA Vs Ind: Rassie Van Der Dussen One Handed Stunning Catch To Send Back Hanuma Vihari, Video Viral - Sakshi
Sakshi News home page

SA vs IND: దక్షిణాఫ్రికా ఫీల్డర్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌!

Published Tue, Jan 4 2022 11:12 AM | Last Updated on Tue, Jan 4 2022 1:35 PM

Rassie van der Dussen Pulls Off A One Handed Stunning Catch To Send Back Hanuma Vihari - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఫీల్డర్‌ రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్‌ 39వ ఓవర్‌ వేసిన రబాడా బౌలింగ్‌లో.. హనుమా విహారి డిఫెన్స్‌ ఆడడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుంది. కాగా షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న వాన్ డెర్ డుస్సెన్ జంప్‌ చేస్తూ ఒంటి చెత్తో అద్భుతమైన స్టన్నింగ్‌ క్యాచ్‌ని అందుకున్నాడు.

దీంతో ఒక్కసారిగా  విహారి ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇక భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో  202 పరుగులకే ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌(50) అశ్విన్‌ (46) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్‌  4 వికెట్లు పడగొట్టగా, ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు. . తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టపోయి 35 పరుగులు చేసింది.

చదవండి: SA vs IND: ఆ భారత ఆటగాళ్లకు ఇదే చివరి ఛాన్స్‌..లేదంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement