హైదరాబాద్ బ్యాటర్ హనుమ విహారి దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కోహ్లి గాయం కారణంగా వచ్చిన అవకాశాన్ని అతను సమర్థంగా వినియోగించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా ఎగసిన బంతికి అతను అవుట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో కీలక పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ విషయాన్ని భారత్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అంగీకరించాడు. అయినా సరే విహారికి తుది జట్టులో చోటు ఖాయం కాదని అతను పరోక్షంగా చెప్పాడు. కోహ్లి కోలుకొని టీమ్‌లోకి వస్తే విహారిని పక్కన పెట్టడం ఖాయమని సంకేతమిచ్చాడు.
విహారితో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా రెగ్యులర్‌గా అవకాశాలు దక్కించుకునేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశాడు. ‘విహారి రెండు ఇన్నింగ్స్‌లలో చక్కగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టకర రీతిలో అవుటైన అతను రెండో ఇన్నింగ్స్‌లో తన ఆటతో జట్టులో ఆత్మవిశ్వాసం నింపాడు. అయ్యర్ కూడా ఆడిన రెండు టెస్టుల్లో ఆకట్టుకున్నాడు. తాము ఎప్పుడు బరిలోకి దిగినా బాగా ఆడగలమని వారు నిరూ పించారు. అయితే ఇప్పటికిప్పు డే కాకుండా మున్ముందు వారికి తగిన అవకాశాలు లభిస్తాయి’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.
చదవండి: MS Dhoni: పాక్ పేసర్‌కు ధోని స్పెషల్ గిఫ్ట్.. భావోద్వేగానికి గురైన క్రికెటర్.. దటీజ్ లెజెండ్!
Comments
Please login to add a commentAdd a comment