దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా అన్ని విధాల సన్నద్దం అవుతుంది. డిసెంబర్ 26న సెంచూరియాన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇక జట్టులో 5వ స్ధానంపై సందిగ్ధత నెలకొంది. గత కొన్నేళ్లుగా అజింక్య రహానే ఆ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే రహానే ప్రస్తుతం పేలవ ఫామ్ కొనసాగిస్తుండంతో అతడి స్ధానంలో శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం ఇవ్వాలని చాలా మంది భావిస్తున్నారు. అయితే అయ్యర్‌కు కాకుండా హనుమ విహారీని జట్టులోకి తీసుకోవాలని భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ సూచించాడు.
“శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారిలో ఎవరని ఎంపిక చేయాలని నన్ను అడిగితే, నేను మాత్రం హనుమ విహారి వైపు మొగ్గు చూపుతాను. ఎందుకంటే చాలా కాలంగా అతడు భారత టెస్ట్ జట్టులో ఉన్నాడు. విదేశీ పిచ్‌లపై అతడికి చాలా అనుభవం ఉంది. అందుకే శ్రేయాస్ అయ్యర్ కంటే విహారి ఎంపిక చేస్తే బెటర్. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ను విహారి తన పోరాట ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఎలా గట్టుక్కించాడో మనందరికీ తెలుసు. అదే విధంగా అతడు వెస్టిండీస్‌లో కూడా సెంచరీ సాధించాడు అని బంగర్ పేర్కొన్నాడు. 2018లో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విహారి 12 మ్యాచ్‌ల్లో 11 మ్యాచ్‌లు విదేశాల్లో ఆడాడు. అంతే కాకుండా 32.84 సగటుతో 624 పరుగులు చేశాడు.
చదవండి: Hardik Pandya: "హార్ధిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేసే ఆటగాడు దొరికేశాడు"
Comments
Please login to add a commentAdd a comment