
కింగ్‌స్టన్ (జమైకా): వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ‘గోల్డెన్ డక్’ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కీమర్ రోచ్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే కోహ్లి పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ హామిల్టన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టెస్టుల్లో ‘గోల్డెన్ డక్’ కావడం కోహ్లికి ఇది నాలుగోసారి. మొత్తం తొమ్మిదిసార్లు టెస్టుల్లో కోహ్లి డకౌట్ అయ్యాడు.
కాగా, వెస్టిండీస్‌కు టీమిండియా 468 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు భారత్ 168/4 స్కోరు వద్ద సెకండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటిన తెలుగు కుర్రాడు హనమ విహారి రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించాడు. రహానేతో కలిసి 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రహనే(64), విహారి(53) అర్ధ సెంచరీలతో అజేయంగా నిలిచారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి విండీస్ 45 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది. (ఇది చదవండి: వహ్వా విహారి...)
Comments
Please login to add a commentAdd a comment