ద్రవిడ్‌, గంగూలీ తర్వాత విహారే! | Hanuma Vihari Becomes Third Indian to score 50 on Test debut At England | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 9 2018 8:16 PM | Last Updated on Sun, Sep 9 2018 8:16 PM

Hanuma Vihari Becomes Third Indian to score 50 on Test debut At England - Sakshi

హనుమ విహారి

లండన్‌ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో తెలుగు క్రికెటర్‌ హను విహారి అరుదైన రికార్డ్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌తోనే టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన ఈ యువక్రికెటర్‌ క్లిష్ట సమయంలో హాఫ్‌ సెంచరీ సాధించి భారత్‌ను గట్టెక్కించాడు. దీంతో అరంగేట్రపు మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించిన 26వ భారత క్రికెటర్‌గా విహారి గుర్తింపు పొందాడు. ఈ మధ్యకాలంలో ఈ ఘనతను టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా శ్రీలంకపై అందుకున్నాడు.

అతని స్థానంలోనే తుది జట్టులోకి వచ్చిన విహారి సైతం ఈ జాబితాలో చేరడం విశేషం. ఇంగ్లండ్‌ గడ్డపై అరంగేట్ర మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్‌గా విహారి నిలిచాడు. 1996లో లార్డ్స్‌ టెస్ట్‌లో సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌లు ఈ ఘనతను అందుకున్నారు. 104 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన విహారి ఇంగ్లండ్‌ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. అంతేకాదు జడేజాతో కలిసి ఈ సిరీస్‌లో అత్యధిక పరుగుల (73) మిడిలార్డర్‌ భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు జడేజా(86) సైతం సూపర్‌ ఇన్నింగ్స్‌తొ పోరాడటంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగులు చేయగలిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement