అడిలైడ్ : మెల్‌బోర్న్ టెస్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాలని భారత్ భావిస్తే తుది జట్టులో రవీంద్ర జడేజా వచ్చే అవకాశం ఉంది. తొలి టి20 మ్యాచ్‌లో కన్‌కషన్‌కు గురైన తర్వాత కోలుకున్న జడేజా తన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. అయితే అతను వంద శాతం ఫిట్‌గా ఉన్నాడా లేదా అనేది తేలలేదు. పెద్ద సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేసే స్థాయిలో అతను ఫిట్‌గా ఉంటే మాత్రం ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి స్థానంలో జడేజాను తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
‘విహారిని పక్కన పెట్టాలనుకోవడానికి అతని వైఫల్యం కారణం కాదు. జట్టు కాంబినేషన్ కోసం ఆల్‌రౌండర్‌గా జడేజా సరిపోతాడు. ఇటీవల అతని బ్యాటింగ్ చాలా మెరుగుపడింది. పైగా లైనప్‌లో ఏకైన ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌గా అతను ప్రత్యేకత చూపించగలడు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సిడ్నీలో రోహిత్ శర్మ క్వారంటైన్ కొనసాగుతోంది. అయితే కరోనా కారణంగా ఆ్రస్టేలియా దేశంలో కొత్త నిబంధనలు వస్తుండటంతో రెండో టెస్టు జరిగే మెల్‌బోర్న్‌కు రోహిత్‌ను పంపరాదని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు సిడ్నీలోనే జరిగితే రోహిత్‌కు ఇబ్బంది ఉండదు. వేదిక బ్రిస్బేన్‌కు మారితే మాత్రం బీసీసీఐ రోహిత్ కోసం మళ్లీ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment