సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. నిన్నటి ఆటను రెండు వికెట్ల నష్టానికి 96 పరుగుల వద్ద ముగించిన టీమిండియా.. ఈ రోజు మూడొందల మార్కును ఈజీగా దాటుతుందని అనుకున్నప్పటికీ మనోళ్లు ముందుగానే ఇన్నింగ్స్‌ను ముగించారు. టీమిండియా మూడొందల పరుగుల మార్కును దాటకపోవడంలో ఆసీస్ ఫీల్డింగ్ కూడా ఒక కారణం. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లను రనౌట్ చేయగా, అందులోనూ ఒక టెస్టు మ్యాచ్‌లో రనౌట్లు రూపంలో మూడు వికెట్లను చేజార్చుకోవడం సమన్వయ లోపాన్ని సూచిస్తోంది. కాగా, ఆ మూడు రనౌట్లలో హనుమ విహారి రనౌట్ అయిన తీరు బాధకరం అనే కంటే హజిల్‌వుడ్ రనౌట్ చేసేన తీరు కొనియాడకతప్పదు. (148 పరుగులు.. 8 వికెట్లు)
భారత కెప్టెన్ రహానే ఔటైన తర్వాత ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హనుమ విహారి.. లయన్ వేసిన 68 ఓవర్‌లో మిడాఫ్ వైపుకు బంతిని ఆడి సింగిల్ తీయబోయాడు. పరుగు తీద్దామా.. వద్దా అనే ఆలోచనలో విహారి పరుగు పూర్తి చేయాలనుకుని నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు దూసుకొచ్చాడు. కానీ అక్కడే కాచుకుని ఉన్న హజల్‌వుడ్ బంతిని అందుకున్న వెంటనే వికెట్లపైకి నేరుగా గిరటేశాడు. అతని శరీరం మొత్తం గాల్లో ఉండగానే బంతిని గురి చూసి కొట్టడంతో విహారి రనౌట్ అయ్యాడు. ఇది నేటి ఆటలో టర్నింగ్ పాయింట్‌గా చెప్పొచ్చు. విహారి కనుక క్రీజ్‌లో ఉండి ఉంటే భారత్ మరిన్ని పరుగులు చేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం విహారి రనౌట్ వీడియో వైరల్‌గా మారింది.
96/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 148 పరుగులు సాధించి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఈ రోజు ఆటలో రహానేనకు కమిన్స్ పెవిలియన్‌కు పంపగా, ఆపై హనుమ విహారి(4) రనౌట్ అయ్యాడు. ఆ తరుణంలో పుజారా- పంత్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 53 పరుగులు జత చేసిన తర్వాత పంత్‌ను హజల్‌వుడ్ ఔట్ చేశాడు. దాంతో టీమిండియా 195 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోగా, అదే స్కోరు వద్ద పుజారాను కమిన్స్ ఔట్ చేశాడు. ఆ సమయంలో జడేజా-అశ్విన్‌లు ప్రతిఘటించే యత్నం చేశారు. కాగా, అశ్విన్(10) ఏడో వికెట్‌గా ఔటైన కాసేపటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. జడేజా మాత్రం కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో భారత్ 240 పరుగుల మార్కును దాటింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే టీమిండియా 94 పరుగుల వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. (అప్పుడూ ఇదే సీన్.. మరి టీమిండియా గెలిచేనా?)
Don't take on the Hoff! ⚡@hcltech | #AUSvIND pic.twitter.com/eXFpRPuKiJ
— cricket.com.au (@cricketcomau) January 9, 2021
Comments
Please login to add a commentAdd a comment