డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఫైనల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా హాజిల్‌వుడ్ గాయం తిరగబెట్టిందని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. అతని స్థానంలో 33 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్ మైఖేల్ నెసర్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం నెసర్ ఇంగ్లండ్‌లోనే ఉన్నాడని, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అతను గ్లామోర్గన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడని తెలిపింది.
కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నెసర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, ఈ టోర్నీలో అతను 25.63 సగటున 19 వికెట్లు పడగొట్టాడని, దీన్ని పరిగణలోకి తీసుకునే అతన్ని ఎంపిక చేశామని సీఏ ప్రకటించింది. కాగా, హాజిల్‌వుడ్ ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023 సందర్భంగా కూడా ఇలాగే గాయపడి లీగ్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని కెన్నింగ్‌స్టన్ ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ జరుగనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్ కోసం భారత్, ఆసీస్ జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇదివరకే ఐసీసీ టీ20, వన్డే టోర్నమెంట్‌లు (వరల్డ్‌కప్‌లు) గెలిచిన భారత్, ఆసీస్ జట్లు.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 గెలిచి, మూడు ఫార్మాట్లలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్టుగా రికార్డుల్లోకెక్కాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
అస్ట్రేలియా: మార్కస్ హ్యారిస్, ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, మైఖేల్ నెసర్, మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, నాథన్ లయోన్
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్
Comments
Please login to add a commentAdd a comment