
హెడింగ్లీ:ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ‘ఎ’ క్రికెట్ జట్టు భారీ విజయాన్ని సాధించింది. ఆదివారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ జట్టు 125 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ యువ జట్టు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో పృథ్వీ షా(70;61 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ‍్యర్(54; 45 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), ఇషాన్ కిషన్(50; 46 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించగా,విహారి(38), కృనాల్ పాండ్యా(34), అక్షర్ పటేల్(28 నాటౌట్)లు ఫర్వాలేదనిపించారు.
ఆపై 329 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎలెవన్ 36.5 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలింది. మాథ్యూ క్రిచెల్లీ(40), బెన్ స్లాటర్(37), హాన్‌కిన్స్(27), విల్ జాక్స్(28)లు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. భారత ‘ఎ’ బౌలర్లలో దీపక్ చాహర్ మూడు వికెట్లతో రాణించగా,అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించాడు. ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, విజయ్ శంకర్, కృనాల్ పాండ్యాలు తలో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment