బెంగళూరు: ఆంధ్ర బ్యాట్స్‌మన్ కోన శ్రీకర్ భరత్ సెంచరీతో (106; 12 ఫోర్లు, సిక్స్) అదరగొట్టాడు. ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న అనధికారిక రెండో టెస్టులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (52; 5 ఫోర్లు) బ్యాటింగ్‌లో రాణించాడు. దీంతో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 505 పరుగుల వద్ద ఆలౌటైంది. జట్టుకు 159 పరుగుల ఆధిక్యం లభించింది. సోమవారం 223/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ కాసేపటికే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42; 4 ఫోర్లు, 1 సిక్స్) వికెట్‌ను కోల్పోయింది.
ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన భరత్, శుభ్‌మన్ గిల్ (50; 7 ఫోర్లు)కు జతయ్యాడు. ఇద్దరు కలిసి స్కోరును 300 పరుగులకు చేర్చారు. అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే గిల్ నిష్క్రమించగా... గౌతమ్ (20), కుల్దీప్ యాదవ్‌ల అండతో శ్రీకర్ శతకాన్ని సాధించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ‘ఎ’ ఆట నిలిచే సమయానికి 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.
భరత్ సెంచరీ
Published Tue, Sep 11 2018 1:10 AM | Last Updated on Tue, Sep 11 2018 1:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment