
సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై న్యూజిలాండ్ ‘ఎ’ జట్టుతో జరిగిన ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ‘ఎ’ 3–0తో సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండో వన్డే ‘టై’గా ముగిసింది. అనంతరం భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలుచుకుంది.
ఐదో వన్డేలో ముందుగా న్యూజిలాండ్ ‘ఎ’ 44.2 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ హెన్రీ నికోల్స్ (42; 2 ఫోర్లు), వర్కర్ (39; 2 ఫోర్లు) మాత్రమే కొద్దిగా పోరాడారు. భారత బౌలర్లలో బాసిల్ థంపి 3 వికెట్లు తీశాడు. భారత్ 32.1 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ (49; 6 ఫోర్లు, 1 సిక్స్), శార్దూల్ ఠాకూర్ (40; 3 ఫోర్లు, 1 సిక్స్), కరణ్ శర్మ (38 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.