భారత-ఏ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 31-నవంబర్ 10 మధ్యలో ఆస్ట్రేలియా-ఏతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు ముందు జరుగనుంది.
ఈ పర్యటనలో భారత-ఏ జట్టు టీమిండియాతో కూడా ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 15-17 మధ్యలో జరుగనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత-ఏ జట్టు ఆడే రెండు మ్యాచ్‌లకు ఫస్ట్ క్లాస్ హోదా లభించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు రెగ్యులర్ సభ్యులు కొందరు ఈ సిరీస్‌లో పాల్గొంటారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుందని సీఏ తెలిపింది. ఈ పర్యటన కోసం జట్ల ఎంపిక జరగాల్సి ఉంది. భారత్-ఏతో సిరీస్ పక్కా అయిన విషయాన్ని మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
ఆస్ట్రేలియాలో భారత-ఏ జట్లు పర్యటన వివరాలు..
తొలి నాలుగు రోజుల మ్యాచ్- భారత్-ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు క్వీన్స్‌ల్యాండ్ వేదికగా జరుగనుంది.
రెండో నాలుగు రోజుల మ్యాచ్- భారత్-ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 7 నుంచి నవంబర్ 10 వరకు మెల్‌బోర్న్ వేదికగా జరుగనుంది.
టీమిండియాతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్- నవంబర్ 15 నుంచి 17 వరకు పెర్త్‌లో జరుగనుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ ఇలా..
తొలి టెస్ట్- నవంబర్ 22-28 వరకు (పెర్త్‌లో)
రెండో టెస్ట్- డిసెంబర్ 6-10 వరకు (అడిలైడ్‌లో)
మూడో టెస్ట్- డిసెంబర్ 14-18 వరకు (బ్రిస్బేన్‌లో)
నాలుగో టెస్ట్- డిసెంబర్ 26-30 వరకు (మెల్‌బోర్న్‌లో)
ఐదో టెస్ట్- 2025 జనవరి 3 నుంచి 7 వరకు (సిడ్నీలో)
స్వదేశంలో జరిగిన గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఈసారి సిరీస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment