భారత్‌ ‘ఎ’ 223/3 | India A solid in reply to Mitchell Marsh's ton | Sakshi
Sakshi News home page

భారత్‌ ‘ఎ’ 223/3

Published Mon, Sep 10 2018 5:28 AM | Last Updated on Mon, Sep 10 2018 5:28 AM

India A solid in reply to Mitchell Marsh's ton - Sakshi

బెంగళూరు: ఓపెనర్లు రవికుమార్‌ సమర్థ్‌ (83; 8 ఫోర్లు), అభిమన్యు ఈశ్వరన్‌ (86; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో... ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతోన్న రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టులో భారత్‌ ‘ఎ’ దీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగుల చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 123 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం శ్రేయస్‌ అయ్యర్‌ (30 బ్యాటింగ్‌), శుబ్‌మన్‌ గిల్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఓవర్‌నైట్‌ స్కోరు 290/6తో ఆదివారం ఆట కొనసాగించిన ఆసీస్‌ 109 ఓవర్లలో 346 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ మిచెల్‌ మార్‌‡్ష (113; 16 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement